ఒక శ్రద్ధావంతుడు, అకస్మాత్తుగా వచ్చిన కోరిక మేరకు, వివాహం చేసుకోబోతున్న తన మేనల్లుడి మెడలో త్రివిక్రమ్ లాకెట్ వేస్తాడు, ఆపై లాకెట్ మరియు ఊది ప్రభావంతో, బాపు భక్తుడు కాని మేనల్లుడు వివాహ వేడుక మధ్యలో తనకు ఎదురైన సంకటాల నుండి సులభంగా విముక్తి పొందుతాడు!
---------------------------
అంతా అశాస్త్రీయం!
హరి ఓం. 8 మే 2018న నాకు కలిగిన సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు అనుభవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
నా ఈ అనుభవం ద్వారా, బాపుకు మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మరియు తను ప్రతి క్షణం తన భక్తులతో ఉండి భక్తులను మరియు వారి కుటుంబాలను రక్షిస్తారో అందరూ అర్థం చేసుకుంటారు.
నా మేనల్లుడి వివాహానికి హాజరు కావడానికి నా సోదరి, నేను మరియు నా కుటుంబం 6 మే 2018 న ఇండోర్ నుండి వార్ధాకు బయలుదేరాము. గమ్యస్థానానికి చేరుకోగానే, నేను నా మేనల్లుడిని కలిసిన తర్వాత, ఎలా ఉన్నావు? అని అడిగాను. ఇలా అడగడం వెనుక ఒక కారణం ఉంది. నా మేనల్లుడు బాగా మద్యం తాగేవాడు, కానీ గత రెండు రోజులుగా తను మద్యం తాగడం మానేశాడు. అందుకనే అతను కొంచెం బాగానే ఉన్నట్లు నాకు అనిపించింది.
వార్ధా చేరుకున్న రోజు నుండి, నా మేనల్లుడి గురించి ఆందోళన చెందుతున్నాను. నేను నిరంతరం అతని గురించి ఆలోచిస్తూనే ఉండేవాడిని. అతను బాపు భక్తుడు కాదు, కానీ మనం అతనికి త్రివిక్రమ్ లాకెట్ ధరింపజేయాలని నాకు పదే పదే అనిపించింది. నాకు తెలియకుండానే నేను నా మెడలోని త్రివిక్రమ లాకెట్‌ను తీసి నా మేనల్లుడి మెడలో వేశాను. నిజం చెప్పాలంటే నా లాకెట్‌ను నేను అతనికి ఎలా ఇచ్చానో కూడా నాకు తెలియదు! నాకు ఈ పని హృదయపూర్వకంగా చేయాలనిపించింది మరియు నేను అది చేశాను. పెళ్లి అయ్యే వరకు అతని మెడలోంచి ఈ లాకెట్ తీయవద్దని కూడా నా మేనల్లుడికి చెప్పాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాపు భక్తుడు కాకపోయినా, నా మేనల్లుడు దీన్ని అంగీకరించాడు. నాకు ఉపశమనం కలిగింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని క్షణాల తర్వాత, ఒక వింత సంఘటన జరిగింది. నా మేనల్లుడికి ఏదో జరగడం ప్రారంభమైంది, కానీ మేము ఎవరు దానిని గుర్తించలేకపోయాము. నా మేనల్లుడు అకస్మాత్తుగా వణకడం ప్రారంభించాడు. నా భార్య మేనల్లుడికి శుభసూచకమైన మెహందీ పెడుతుంది, ఆ సమయంలో అతను మరింతగా వణకడం ప్రారంభించాడు. పెళ్లి కేవలం ఒక్క రోజు వ్యవధిలో ఉంది అనగా మరి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎవరికైతే పెళ్లి జరుగబోతుందో ఆ వ్యక్తి ఆరోగ్యమే మరింత క్షీణించసాగింది. ఏదో ఒక పరిష్కారం చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంట్లో పూజ కూడా జరుగుతోంది మరియు పెళ్లి రోజున మేనల్లుడికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. అందుకే నేను వెంటనే అతనిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాను.
ఆసుపత్రిలోని వైద్యులు అతన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. వైద్యులు అతన్ని పరీక్షిస్తుండగా, మేము అతని దగ్గర కూర్చుని హనుమాన్ చాలీసా పఠనం చేయసాగాము. బాపుతో ఒకే ఒక అభ్యర్థన చేసాము, బాపు, దయచేసి నా మేనల్లుడికి నయం చేయండి. రేపు అతని వివాహం ఉంది. అతన్ని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత డాక్టర్, అతనికి ఏమీ కాలేదు, అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు, కాబట్టి మీరు అతన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు అని అన్నారు. మేము కొంచెం ఉపశమనం పొంది ఇంటికి తిరిగి వచ్చాము. కానీ మా మనసులో ఆందోళన పెరుగుతూనే ఉంది. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడని కూడా మాకు తెలిసింది. అయినప్పటికీ మా మనసులో ఆందోళన తగ్గలేదు. నా మేనల్లుడికి ఏదైనా జరిగితే, త్రివిక్రమ్ లాకెట్ ఖచ్చితంగా అతన్ని కాపాడుతుందని ఒక వంతు నా మనసు నమ్మకంగా చెబుతోంది. అది నా కోసమే అయినా, నా మేనల్లుడు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మెడలో లాకెట్ ధరించాడు.
ఈ లాకెట్ ఎవరి మెడలో ఉంటుందో, బాపు వారిని రక్షించడానికి సదా, సర్వదా సమర్థులు.
నా మేనల్లుడితో పాటు బాపు కూడా నిలబడి ఉన్నాడని నేను నమ్మాను.
మరుసటి రోజు పెళ్లి వేడుక ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది మరియు నవవధువును పంపే సమయంలో, నా మేనల్లుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు మరియు నోటి నుండి నురగలు రావడం జరిగింది. ఒకవైపు సంతోషకర వాతావరణం ఉంది, మరియు వివాహం చేసుకోబోయే వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు మరియు నవవధువుతో సహ ఆమె కుటుంబ సభ్యులు నిలబడి ఉన్నారు. అందరికీ ఒకే ప్రశ్న ఉత్పన్నమైంది, అతనికి అకస్మాత్తుగా ఏమైంది? ఆనందమంతా మసకబారింది, ఎవరికీ ఏమీ తోచలేదు, ఏమి చేయాలో అర్థం కాలేదు. అందరూ భయపడి ఏడవడం ప్రారంభించారు మరియు ఇంటి సభ్యులందరూ వీలైనంత త్వరగా మేనల్లుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
నేను, నా భార్య బాపు భక్తులం కాబట్టి, మా బాపు ఈ సమస్యకు ఖచ్చితంగా తగిన పరిష్కారం కనుగొంటారని మాకు బాపుపై పూర్తి నమ్మకం ఉంది. నా భార్య తను తెచ్చుకున్న ఊదీ గుర్తుకు వచ్చింది. మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇంటి నుండి బయలుదేరేటప్పుడల్లా, ఊదీని మావెంట తీసుకెళ్తాము ధారణ కూడా చేసుకుంటాము. నా సోదరి కూడా బాపు భక్తురాలు కాబట్టి, ఆమె దగ్గర కూడా ఊదీ ఉండింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు అతనికి ఊదీ ధారణ చేయడం మంచిదని భావించి, నా భార్య పరుగెత్తుకుంటూ ఊదీ పెట్టె తీసుకుని నా మేనల్లుడి దగ్గరకు వెళ్ళింది. మా ఇతర బంధువులందరు బాపు భక్తులు కారు, కాబట్టి వారందరూ చాలా భయపడ్డారు మరియు నా భార్య మాట వినలేదు మరియు ఆమెను పక్కకు వెళ్ళమని చెప్పారు. కానీ నా భార్య వారితో "ఇది మా సంస్థ యొక్క పవిత్రమైన ఊదీ” కాబట్టి నేను అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా దీన్ని ధరింపచేస్తాను అని గట్టిగా చెప్పింది. నా భార్య స్పృహ కోల్పోయిన నా మేనల్లుడికి ఊదీని రాసింది మరియు అది రాయగానే వెంటనే అతను ఉపశమనం పొంది స్పృహలోకి వచ్చాడు. నా మేనల్లుడు స్పృహలోకి వచ్చిన తరువాత, నా సోదరి ఊదీని నీటిలో కలిపి అతనికి ఆ ఊదీని కల్పిన నీళ్ళు కూడా ఇచ్చింది. దానిని తీసుకున్న వెంటనే, మేనల్లుడు పూర్తిగా కోలుకుని లేచి కూర్చున్నాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం కూడా రాలేదు. చికిత్స తర్వాత, అతను ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు.
నా బాపు అలాంటివాడు. ఒక భక్తుడి పిలుపు మేరకు, అతను ఎక్కడికైనా, ఎప్పుడైనా, మరియు ఎలాగైనా పరిగెత్తుకు వస్తాడు. ఆ పిలుపు గురించి ఏమి చెప్పాలి, పిలవకపోయినా బాపు మనకు సహాయం చేయడానికి వస్తాడు. బాపు సర్వదా మాతోనే ఉంటాడు, కాబట్టి బాపు ఇండోర్ మరియు వార్ధాలో నాతోనే ఉన్నాడు. మేనల్లుడి మెడలో త్రివిక్రమ లాకెట్ నా ద్వారా వేయబడింది, అది కూడా బాపుకు నా మీద, అతని మీద ఉన్న అపారమైన కరుణ వల్లే. ఆ త్రివిక్రమ్ లాకెట్ మరియు ఊదీ మేనల్లుడిని రక్షించాయని నేను నమ్మకంగా చెబుతున్నాను. తద్వారా తదుపరి సంఘటన తప్పింది. అతను బాపును నమ్మేవాడు కాదు, అయినప్పటికీ బాపు అతనిని రక్షించారు. అతను బాపు భక్తుడు కాకపోవచ్చు, కానీ నా సోదరి (అతని తల్లి) బాపు ఉపాసనకు వెళుతుంది మరియు ఇంట్లో కూడా బాపు యొక్క నిత్య ఉపాసన మరియు పఠనం చేస్తుంది. ఇప్పుడు ఆమె కోడలు కూడా సద్గురు బాపు ఆరాధనలో చేరి బాపు భక్తిలో స్థిరపడింది.
“హరి ఓం” “శ్రీరామ్” “అంబజ్ఞ” “నాథసంవిద్”