![]() |
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గారి దినపత్రిక 'ప్రత్యక్షం' లోని సంపాదకీయం (06-09-2006) |
శ్రీ గణపతిని స్మరించుకోగానే ప్రతీ భక్తుడికి లేదా నాస్తికుడికి కూడా వెంటనే గుర్తొచ్చేది మోదకాలే. ఈ రోజుల్లో ఖోవాతో చేసిన మోదకాలు దొరుకుతున్నాయి, కానీ మనకు ఇష్టమైన మవ్వా (కోవా) మోదకాలు అందుబాటులో లేనప్పుడు తక్కువ నాణ్యత కలిగిన మోదకాలతో సంతుష్టిగాఉండాల్సి వస్తుంది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను అత్యంత ఇష్టంగా తిన్న మోదకాలు అంటే సాంప్రదాయ పద్ధతిలో చేసినవే. అందులో బియ్యప్పిండిని వెన్నతో ముద్దలా కలిపుతారు, ఆ ముద్దలో వేసే పూరణాన్ని, తాజా మరియు రుచికరమైన తురిమిన కొబ్బరిని, ఇంట్లో తయారు చేసిన నెయ్యిలో వేపి తయరు చేస్తారు. అంతకంటే ముఖ్యంగా, మోదకం తినేటప్పుడు దాన్ని విరిచి, అందులో ఇంకో చెంచా స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి. పిల్లలందరికీ ఈ ‘నెయ్యితో నిండిన’ మోదకం అంటే చాలా ఇష్టం. ఈ సాంప్రదాయ మోదకం ఆహారంలోని సౌమ్య, స్నిగ్ధ మరియు గురు గుణాలకు సర్వోత్తమైనది. అందుకే మూలాధార చక్రాన్ని, అంటే అత్యుష్ణ, అర్ధస్నిగ్ధ మరియు లఘు స్థానాన్ని నియంత్రించే శ్రీ మహాగణపతికి ఇది సర్వోత్తమ నైవేద్యం.
![]() |
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇంటికి గణపతి ఆగమనం. |
నేటి పరిస్థితుల వల్ల, ప్రతి ఒక్కరికీ ఇలాంటి మోదకాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వీలైన వారు ఇలాంటి సాంప్రదాయ మోదకాలను చేసి, దాన్ని అత్యంత ప్రేమతో శ్రీ మహాగణపతికి అర్పించాలి. గరిక మరియు శమీ పత్రాలతో చేసే బాహ్యోపచారం మరియు సాంప్రదాయ మోదకాల నైవేద్యం నిజంగా ఉగ్ర, రూక్ష మరియు లఘు గుణాలను నాశనం చేసి, సౌమ్యత్వం, స్నిగ్ధత్వం మరియు గురుత్వం (స్థిరత్వం) స్థాపన చేస్తాయి. దానివల్ల, ఆ మంగళమూర్తి వరద వినాయకుడు విఘ్నాలను నాశనం చేయడానికి ప్రతి ఒక్కరి ప్రాణమయ దేహంలో మరియు మనోమయ దేహంలో అవతరిస్తాడు.
మోదకం అనగానే నాకు ఓ పాత కథ గుర్తొస్తుంది. ఒక చక్రవర్తి ఉండేవాడు. అతను చాలా విలాసవంతుడు మరియు ఎలాంటి విద్యనూ అభ్యసించలేదు. అందుకే అతని తండ్రి అతనికి పట్టాభిషేకం చేసేటప్పుడు, ఆ విద్యాహీనుడైన రాజకుమారుడికి ఎంతో విద్వాంసురాలు మరియు సుజ్ఞాని అయిన రాజకుమారితో వివాహం జరిపించాడు. అలా ఆ చదువురాని రాజు, అతని విద్వాంసురాలైన, పతివ్రత అయిన రాణి, తమ రాజపరివారంతో కలిసి ఒక సరస్సులో జలక్రీడల కోసం వెళ్లారు. అక్కడ సరస్సులో ఆడుకుంటున్నప్పుడు, రాజు రాణి మీద చేత్తో నీళ్లు చల్లడం మొదలుపెట్టాడు. పెళ్లి వరకు సంస్కృతాన్నే తన విద్యాభాషగా మరియు వాడుక భాషగా కలిగిన ఆ రాణి వెంటనే, “మోదకైః సించ” అంది. తక్షణమే రాజు సేవకుడిని పిలిచి, అతని చెవిలో ఏదో చెప్పాడు. కొద్దిసేపట్లోనే, ఆ సేవకుడు మోదకాలతో నిండిన ఐదారు పాత్రలను అక్కడికి తెచ్చాడు. రాజు ఒకదాని తర్వాత ఒకటిగా మోదకాలను రాణి మీదకు గురిపెట్టి విసరడం ప్రారంభించాడు. ఈ విచిత్రమైన సంఘటనతో మొదట పూర్తిగా అయోమయానికి గురైన రాణి, కొద్దిసేపటికే తేరుకుని, ఇతర రాజస్త్రీలు మరియు మంత్రుల ముఖాల్లోని ఎగతాళి నవ్వును చూసి చాలా సిగ్గుపడి, దుఃఖించింది. ఎందుకంటే రాణి చెప్పాలనుకున్నది, “మా ఉదకైః సించ” – అంటే, ‘నన్ను నీళ్లతో తడపవద్దు’. కానీ, కేవలం మాట్లాడటానికి మాత్రమే సంస్కృతం తెలిసిన ఆ చదువురాని రాజుకు సంస్కృత వ్యాకరణ నియమాలు తెలియకపోవడం వల్ల, ‘మోదకైః’ అనే పదాన్ని విడదీయకుండా తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత కథ వేరే మలుపు తీసుకుంటుంది, కానీ నాకైతే రాణి మీద మోదకాల వర్షం కురిపించిన ఆ మూర్ఖపు రాజే ఈ రోజుల్లో అనేక రూపాల్లో అక్కడక్కడా తిరుగుతున్నట్లు కనిపిస్తాడు.
![]() |
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇంట్లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ ఉత్సవంలో, గణపతి బాప్పాకు మోదకాలు ప్రేమగా నైవేద్యంగా సమర్పించబడతాయి. |
గణపతికి మోదకాలు, గరిక ఇష్టమని వాటిని ఆదరంగా అర్పించడం సబబే. అలాగే, ఆ పరమాత్ముడికి ఎన్నో రూపాలున్నాయని రకరకాల విగ్రహాలు చేయడం కూడా సరైనదే. కానీ, ఆ గణపతికి పాలు తాగించడానికి అక్కడక్కడా క్యూలు కట్టడం అంటే ఆ రాజు చేసిన పనిని మళ్లీ చేయడమే. నాకో విషయం అర్థం కాదు, నిజానికి గణపతికి మోదకాలు అత్యంత ప్రియమైనప్పుడు, ఆయనెందుకు అన్నిచోట్లా పాలు తాగుతాడు? మోదకాలు ఎందుకు తినడు? అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ ప్రశ్న మనలో ఎవరికీ రాదు. ఆ మంగళమూర్తి అయిన పరమాత్మ భక్తులు ప్రేమతో అర్పించిన చల్లారిన రొట్టె ముక్కలను కూడా ప్రేమగా స్వీకరిస్తాడు, ఇందులో నాకు ఎలాంటి సందేహం లేదు. విగ్రహం ముందున్న నైవేద్యం పళ్లెంలోని ఒక్క మెతుకు కూడా తగ్గకపోయినా ఫర్వాలేదు. గీతలో సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడే స్వయంగా ఈ హామీని భక్తులందరికీ ఇచ్చాడు. ముఖ్యంగా, పరమాత్ముడికి ఇలాంటివి చేసి తన గొప్పతనాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు, అలాగే ప్రజలలో భక్తిని పెంచడానికి కూడా ఆయనకు ఇలాంటి ఉపాయాలు అవసరం లేదు. భక్తులు, అభక్తులు అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి యొక్క సమగ్ర జీవన స్థితిని పూర్తిగా తెలిసిన, ప్రతి ఒక్కరి కర్మఫలాన్ని నిర్ణయించే ఆ నిజమైన పరమాత్ముడికి ఇలాంటి విచిత్రమైన పనుల అవసరం ఎప్పటికీ ఉండదు.
సంపాదకీయాన్ని ముగిస్తూ సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు ఇలా రాశారు -
मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>>‘మిత్రులారా, ఆ పరమాత్ముడికి కావలసింది మీ అచంచలమైన శ్రద్ధ, భక్తి మరియు కృతజ్ఞతా భావంతో చేసే భగవంతుని సేవ, ఆయన నిస్సహాయులైన పిల్లల సేవ. ఇదే నిజమైన నైవేద్యం, కాదు, ఇదే సర్వశ్రేష్ఠమైన నైవేద్యం. ఈ నైవేద్యాన్ని ఆ పరమాత్మ పూర్తిగా స్వీకరించి, దానికి వెయ్యి రెట్ల ఫలాన్ని ప్రసాదంగా భక్తుడికి ఇస్తాడు. మోదకాలను నైవేద్యంగా తప్పకుండా అర్పించండి, ఇష్టంగా మీరూ తినండి. కానీ, ‘మోద్’ అంటే ‘ఆనందం’ అని మర్చిపోవద్దు. పరమాత్ముడికి, ఇతరులకు ఆనందం కలిగేలా ప్రవర్తించడమే సర్వశ్రేష్ఠమైన మోదకం.’
Comments
Post a Comment