భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర అనేది సాధారణంగా మనకు తెలిసిన గొప్ప, లోతైన గాథలోని కేవలం ఒక భాగమే. పరిచితమైన పేర్లు మరియు ప్రసిద్ధ ఘట్టాలకు అవతల, చెప్పబడని ఒక కథ ఉంది. ఆ కథను దైవసమానమైన త్యాగాలు చేసిన స్త్రీ-పురుషులు సృష్టించారు. అయినప్పటికీ, వారి కథలు చరిత్ర పుస్తకాలలోనూ, ప్రజల స్మృతిలోనూ కనుమరుగయ్యాయి. 'దైనిక్ ప్రత్యక్ష'లో ప్రచురించబడిన తన అంతర్దృష్టితో కూడిన సంపాదకీయాలలో, డాక్టర్ అనిరుద్ధ ధైర్యధర్ జోషి ఈ విస్మరించబడిన చరిత్రను వెలుగులోకి తెచ్చారు. మాతృభూమి పట్ల అచంచలమైన నిబద్ధత, ధైర్యం మరియు భక్తితో నిలబడిన యోధులు, మేధావులు మరియు నిశ్శబ్ద మార్గదర్శకుల వంటి అసాధారణ వ్యక్తుల జీవితాలను ఆయన ఆవిష్కరించారు.
కథనం ముందుకు సాగుతున్న కొద్దీ, అనేక అన్వేషించని పేర్లు వెలుగులోకి వస్తాయి, వారి జీవితాలు పరాక్రమం, త్యాగం మరియు స్వాతంత్ర్యం కోసం అచంచలమైన సంకల్పంతో నిర్వచించబడ్డాయి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి ప్రసిద్ధ వ్యక్తులతో పాటు, ఆమెకు సమానమైన పరాక్రమవంతులైన ఆమె సహచరులు వెలుగులోకి వస్తారు, వారి శౌర్యం ఆమెతో సమానంగా ఉన్నప్పటికీ చరిత్ర వారి పేర్లను భద్రపరచడంలో విఫలమైంది. ఈ వృత్తాంతం తరువాత బాల గంగాధర్ తిలక్ యుగంలోకి ప్రవేశిస్తుంది; ఇది ఆయన సుప్రసిద్ధ ప్రజా ప్రతిమకన్నా ఎంతో లోతైన ఒక కోణాన్ని వెలుగులోకి తెస్తుంది. ముందుకు సాగుతూ, ఈ సంపాదకీయాలు ఆయన పక్కన నిలిచిన మనకు తక్కువగా తెలిసిన లెక్కలేనన్ని విప్లవకారులు, నిర్వాహకులు మరియు అంకితభావంతో పనిచేసిన కార్యకర్తల కథలను వెలుగులోకి తెస్తాయి. వారి నిశ్శబ్ద త్యాగాలు, మేధోపరమైన పటిమ మరియు నిర్భయ చర్యలు స్వాతంత్ర్య ఉద్యమానికి వెన్నెముకగా నిలిచాయి, అయితే ఈ నిజమైన వీరులను మేధావులని చెప్పుకునే చరిత్రకారులు నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టినందువల్ల, వారి పాత్రలు పెద్దగా లిఖితపూర్వకంగా నమోదు కాలేదు.
ఇది కేవలం ఒక చారిత్రక కథనం మాత్రమే కాదు; ఇది భారత స్వాతంత్ర్యానికి అదృశ్య పునాదులకు నివాళి. శౌర్యం, సమర్పణ మరియు నైతిక శక్తితో సమృద్ధిగా ఉన్న ఈ వృత్తాంతాలు, మన స్వాతంత్ర్య పోరాటంలోని నిజమైన లోతును మళ్లీ కనుగొనడానికి, అలాగే తమ సర్వస్వాన్ని అర్పించి ప్రతిఫలంగా ఏమీ ఆశించని వారిని గౌరవించడానికి మనలను ఆహ్వానిస్తాయి.
-------------------------------------------------------------------------------------
భాగం -1
రచయిత - డాక్టర్ అనిరుద్ధ డి జోషి
మల్హారరావు నుదుటి పై వచ్చిన చెమటను తుడుచుకుంటు పొలము గట్టు పై వెళ్ళి నిల బడ్డాడు. ఈ రోజు దినమంతా అతను చాలా పని చేయవలసి వచ్చింది. అతని పొలములో పని చేసే దాదాపు వంద మంది కూలీలు ఈ రోజు పనికి రాలేదు. మరియు పంటలు తయారై కోత, నూర్పిడి, మిల్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. గోధుమలు, సజ్జలు, మక్కలు, వీటితో పాటే మల్హార రావు పొలం లో కందులు, మినుములు, వేరుశనగ, బటానీ, శనగలు మొదలగు పంటలు కూడ పండుతాయి. ఖరీఫ్ పంటలు అనగా జూన్ జులై నెలల లో విత్తబడే పంటలు మరియు, రబీ పంటలు, అనగా నవంబరు తర్వాత విత్తబడే పంటలు పండుతాయి.
అంతేకాకుండా, మల్హారరావు గారి తోట భూమి కూడా చాలా పెద్దది. కేవలం మామిడి తోటే నూట యాభై ఎకరాలు ఉండెను. దానితో పాటు అరటి తోటలు, దానిమ్మ తోటలు, బొప్పాయి తోటలు, జామ తోటలు - ఇవన్నీ దాదాపు ఎనిమిది వందల ఎకరాలలో విస్తరించి యున్నవి. ఇంకా మిగిలిన అంటే అక్కడక్కడా బీడు భూములు కూడా ఉండేవి, అక్కడ గడ్డి మొలిచి దానిని గడ్డిమోపుగా చేసి పశువుల కోసం అమ్మేవారు. ఏడు అడవుల యాజమాన్యం కూడా వారి వద్ద ఉండేది. ఆ అడవులలోని పెద్ద పెద్ద చెట్లను నరికి, వాటి నుండి కలప దుంగలు మరియు పలకలు తయారుచేసే కర్మాగారాలను కూడా మల్హారరావు ఏర్పాటు చేశారు. వంట చెక్కల (జలనం కోసం, వంట కోసం) వ్యాపారం కూడా మల్హారరావు గారిది చాలా జోరుగా సాగుతోంది.
ఇదే కాకుండ రెండు వందల ఎకరాలలో ఆవులు, గేదేలు, మేకలు కూడ పెంచబడుతుండేవి. పాల వ్యాపారం కూడ మిక్కిలి లాభదాయకంగా ఉండింది. గత సంవత్సరం నుండి మల్హారరావు యొక్క ఏకైక ముద్దుల కొడుకు రామచంద్రరావు కోళ్ళు పెంచడం ( ఫోల్ట్రీ ఫామ్) కొరకు మంచి స్థలమును కొన్నాడు. అక్కడ అన్ని అవసరమైన ఏర్పాట్లు కూడ చేశాడు. మరియు ఈ రంగం కు ( ఫోల్ట్రీ ఫామ్)కు చెందిన వృత్తి పరుడైన ఒక వ్యక్తిని ఇక్కడ ఉద్యోగం చేయడానికి, ( ఆ ఉద్యోగం నుండి అవమానించ బడి, బయటకు వచ్చిన వ్యక్తి "గోవింద దాజే"అనుపేరు గల అనుభవజ్ఞుడైన ఒక కర్మచారిని ఇక్కడ ఆయన ప్రబంధకునిగా నియమించాడు.
ఈ రోజు కొంచం గందరగోళం చెలరేగింది ఎందుకంటే అతని పొలంలో పని చేసే చాలామంది కూలీలు పక్క ఊరు నుంచి వచ్చేవారు. ఆ గ్రామం లో బ్రిటిష్ అధికారి తనిఖీ చేయడానికి వచ్చాడు అందువల్ల ఎవరూ గ్రామం బయట కు వెళ్ళకుండ కట్టడి చేయబడింది. అది విప్లవకారుల కాలం. మరాఠీ మాట్లాడే కొంత మంది యువ విప్లవకారులు ఆ ఊరిలోకి రావడం పోవడం జరుగు తుండింది. ఈ వార్తను ఒక విద్రోహి బ్రటిష్ పాలకులకు చెప్పాడు. భగత్ సింగ్ ను రెండు మాసాల క్రితం ఉరి తీసింది. భారత్ లోని మూల మూలన యువకుల రక్తం మరుగు తుండింది.మల్హారరావు ఈ కారణంగా చాలా పని చేయవలసి వచ్చింది. అతను ఈ రోజు స్వయంగా పొలం లో దిగి పని చేయవలసి వచ్చింది. అతని కుమారుడు రామచంద్రరావు మొదట ముంబై లోని ఒక కాటన్ మిల్లు లో ఉన్నత అధికారి గా పని చేస్తుండినాడు. అయితే అతని తెలివితేటలు, బుద్ధికుశలత మరియు యోగ్యత చూసి బ్రిటిష్ గవర్నర్ రామచంద్ర రావును గవర్నమెంటు సర్వీసు కు ఎంపిక చేసింది. అతను ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసర్ అయ్యాడు అధికారికంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లోని దక్షిణ భాగము, మరియు కర్ణాటక లోని ఉత్తర భాగము ఈ ప్రాంతాల లోని అటవీ శాఖ అతని అధికారం లో ఉండింది. అతను డైరెక్ట్ గా గవర్నర్ కు రిపోర్టు చేసేవాడు. అతనికి మరియు గవర్నర్ కు మధ్య వేరే బ్రిటిష్ ఆఫీసర్ ఎవరూ ఉండేవారు కాదు. ఇక భారతీయ అధికారి ఉండే ప్రసక్తే (అవకాశమే) లేదు.
రామచంద్రరావు ఎప్పుడూ టూర్ పై వెళ్తుంటాడు. ముంబై లో ఉన్న ఫోర్టు పరిసరాల లో గవర్నమెంటు అతనికి ఇచ్చిన చాలా పెద్దది, వాస్తవానికి, విశాలమైన బంగళా ఉండింది.
గవర్నర్ తో డైరెక్ట్ గా కలిసేవారు కేవలం ఇద్దరు ముగ్గురు ప్రాంత అధికారులు ఉండేవారు. వారిలో రామచంద్ర రావు పేరు అందరికన్న ముందు (పైన)ఉండేది. అంతే కాదు, గత నాలుగేళ్లలో అతను చూపించిన పనితీరుతో, అతనికి ఇండియా వైస్‌రాయ్(భారతదేశంలోని బ్రిటిష్ వారి అత్యున్నత అధికారి)ను మూడు సార్లు కలిసే అవకాశం వచ్చింది. అది కూడ అక్కడ ఇతరులు ఎవరూ ఉపస్థితి లేనప్పుడు వైస్రాయ్ యొక్క స్పెషల్ క్యాబిన్ లో వైస్రాయ్, ఈ ప్రాంతం యొక్క గవర్నర్, మరియు రామచంద్రరావు వీరు ముగ్గురు కలిసేవారు. ఈ కారణంగా రామచంద్రకు తన పరిధిలో మత్రమే కాదు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మంచి పలుకుబడి ఉండింది.
మల్హారరావు గారికి మాత్రమే తెలుసు రామచంద్ర వద్ద పైకి చూస్తే కేవలం అటవీ మరియు వ్యవసాయ శాఖలు మాత్రమే ఉన్నట్టుగా కనిపించినప్పటికీ, నిజానికి ఆ ప్రాంతంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలహీనపరిచే బాధ్యత కూడా అతని చేతిలోనే ఉండింది.
ఈ బాధ్యత రామచంద్రకు అప్పగించబడినప్పుడు, మల్హారరావు లోకమాన్య తిలక్ గారి పరమ భక్తులు కాబట్టి, రామచంద్ర వెంటనే తన తండ్రిని ముంబైకి పిలిపించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన బహిరంగంగా పాల్గొనకపోయినా, ఆ కార్యానికి డబ్బు అందించడం, రహస్య పత్రాలను ప్రింట్ చేయించడం, స్వాతంత్ర్య వీరులకు రహస్యంగా ఉండడానికి చోటు కల్పించడం, వారి భోజనం మరియు గోప్యతను జాగ్రత్తగా చూసుకోవడం మరియు ముఖ్యంగా లోకమాన్య గారి వార్తాపత్రికలోని సంపాదకీయాలను ప్రతిరోజూ సాయంత్రం గ్రామస్థులకు చదివి వినిపించడం వంటి పనులు జరుగుతుండినవి.
1920 లో లోకమాన్య తిలక్ స్వర్గస్తులైన తర్వాత శ్రీ. న. చి. కేళకర్ జీ వారి వార్తా పత్రికల పనిని కొన సాగించాడు. గాంధీజీ యొక్క అహింసావాద సిద్ధాంతం (ఆలోచనలు ) ప్రభావం పెరిగి పోతుండినది 1920 లో జరిగిన దాండీ యాత్ర" లో అనగా "ఉప్పు సత్యాగ్రహం " ఉద్యమము లో మల్హార రావు కూడ పాల్గోన్నాడు. అయితే ఈ దుర్మార్గపు విదేశీ పాలకులు అహింసా మార్గం లో స్వాతంత్య్రం ఇస్తారనే విషయం పై మల్హారరావు కు 1928 లోనే నమ్మకం తొలిగిపోయింది. ఎందుకంటే ఆయన కండ్ల ముందరనే నిరపరాధులు, అమాయకులు, ముసలివారు, మరియు మహిళలు కూడ గాయ పడడం దెబ్బలు తినడం ఆయన చూసాడు. యోధుల వంశాని చెందిన మల్హారరావు గారు అది సహించ లేక పోయాడు.
లోకమాన్య స్వర్గస్తులైనారు, గాంధీజీ అహింస మార్గం పై పట్టుదల తో ఉన్నాడు. బెంగాల్ మరియు పంజాబ్ లో విప్లవ కారుల పై విద్రోహం జరుగు తుండింది. స్థానిక భారతీయుల ద్వార చేయబడిన ద్రోహం కారణంగా విప్లవకారులు పట్టుబడుతుండినారు. ఉరి వేయబడుతుండినారు లేదా సరాసరి బ్రిటిష్ వారి తుపాకి గుండ్లకు బలి అవుతుండినారు.
ఇది గమనించి మల్హార రావు గత మూడు సంవత్సరాల నుండి క్రియాశీల పోరాటం నుండి దూరం అయినాడు. ఆయనకు మార్గం దొరకడం లేదు. నిజానికి ఆయనకు నాయకుడు దొరకడం లేదు. రామచంద్రకు ఈ రహస్య బాధ్యతను బ్రిటిష్ వారు అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాతే ఇచ్చారు. వారి రిపోర్ట్‌లో ఇలా రాసి ఉంది - ‘రామచంద్ర రాజకీయాల నుండి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆయన తండ్రి మల్హారరావు చాలా ధనవంతులైన జమీందార్, రైతు మరియు వ్యాపారవేత్త, తిలక్ అభిమాని. కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.’ ఈ రిపోర్ట్ కారణంగానే రామచంద్రకు ఈ బాధ్యత లభించింది.
మల్హారరావు ముంబై రాగానే, రామచంద్రరావు కొంచం భయం తోనే ఈ కొత్త బాధ్యత గురించి అతనికి చెప్పాడు. అది విని మల్హారరావు కోపోద్రిక్తుడు అవుతాడని రామచంద్ర అనుకున్నాడు. అతనికి కూడ భారతమాతకు ద్రోహం చేయాలని లేదు.కాని ఈ బాధ్యత ను అతను తిరస్కరిస్తే బ్రిటిష్ వారి యొక్క రహస్యం బయటకు రాదు. ఇంకా అతను జైలు ఊచలు లెక్క పెట్టవలసి వచ్చేది, లేదా చంపి వేయ బడేవాడు.
మల్హార రావు అంతా శాంతం గా విన్నాడు. ఆయన కండ్లు మూసుకుని తలవంచి తనకు ఎప్పుడూ ఇష్టమైన ఆరామ్ కుర్చీ లో మౌనంగా కూర్చున్నాడు. ఆ ఐదునిమిషాల మౌనం రామచంద్ర రావు ఓపిక పట్టలేక పోయినాడు.ఐదు నిమిషాల తర్వాత మల్హార రావు కూర్చున్న ఆ ఆరామ్ కుర్చీ మెల్లగా లయ బద్ధంగా ఊగుతూ ఉండినది. ( ఆ రోజులలో ఇలా ఊగుతూ ఉండే ఆరామ్ కుర్చీలు ఉండేవి.)
దాదాపు పది నిమిషాల తర్వాత మల్హార రావు కండ్లు తెరిచి లేచి నిలబడి రామచంద్ర రావును గాఢంగా కౌగిలించు కున్నాడు." అటవీశాఖ మరియు వ్యవసాయ శాఖ లను చక్కగ నిర్వహించాలి. అది కూడ
భూ మాత యొక్క రక్షణనే. మరియు బ్రిటిష్ వారు ఇచ్చిన ఈ రహస్య బాధ్యత ను కూడ తప్పక స్వీకరించాలి. అయితే ఈ రహస్య బాధ్యత యొక్క ఫాయిదా (మేలు) మన భారత మాత కొరకే జరగాలి. దేశభక్తు లకు సహాయం చేయడానికే కావాలి. చరిత్ర (ఇతిహాసం) లో నీ పేరు నమోదు చేయక పోయినప్పటికీ స్వయం భగవాన్ త్రివిక్రముని హృదయం లో తప్పక నీకు స్థానం లభిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకో. " ఆయన ఒక్కడే సత్యము."ఈ రోజు మల్హార రావు పొలం గట్టు మీద కూర్చుని రామచంద్ర రావు యొక్క సందేశం కొరకు ఎదురు చూస్తుండినాడు. పొలం పని చేసే దాదాపు ఆ వంద మంది కూలీలను ఊరిలోనే ఆపి ఉంచే యోజన కూడ మల్హార రావు ద్వార రామచంద్ర రావు కు తెలుప బడింది. మొత్తం పోలీసు దళము యొక్క దృష్టి మరియు బలము ఆ సమీప గ్రామం పైననే కేంద్రీ కృతం కానున్నది. ఇటు మల్హార రావు యొక్క స్వంత అభిప్రాయం తోనే నాటు తుపాకులు,(పిస్తోలు) మరియు తూటాలను పూణా కు పంపించ బోతున్నాడు. ( ఇంకా ఉంది)






Comments
Post a Comment