మరి ఇక్కడ మల్హార రావు యొక్క ఊరిలో అనగా ధారా పురంలో మల్హార రావు యొక్క పని పట్టపగలే చాలా సందడి గా జరుగుతుండినది. మరియు సాయంత్రం వరకు వ్యవస్థితంగా పూర్తి అయిపోయింది. సరుకులన్నీ అనగా పిస్తోల్ చిన్న తూపాకులు, తూటాలు మరియు కొన్ని ఇతర అవసర మైన సామగ్రి ఎడ్లబండ్ల మీద పూణా వైపు ఎప్పుడో రవాణా జరిగిపోయింది. ప్రతీఒక ఎడ్లబండిని నడిపే వ్యక్థి ఒక్కొక్క స్వతంత్ర సమరయోధుడు గా ఉండినాడు.
ఇది ఈనాటి విషయం కాదు. 1928 నుండి మల్హార రావు ప్రణాళికా బద్ధంగా పని చేస్తూ తన దంటూ ఈ రకమైన ప్రసిద్ధిని తయారు చేసుకున్నాడు. మరొక వైపు మల్హార రావు ఆధీనం లో ఉండిన వివిధ స్థలాల నుండి కనీసం వంద ఎడ్ల బండ్లు ఎంతో కొంత సరుకు తీసుకుని, చాలా దూరం వరకు వెళ్తుండేవి. ఆ ఎడ్ల బండ్లను పరిశీలన (చెక్ చేసి) చేసి చేసి బ్రిటీష్ ఆఫీసర్లు, బ్రిటీష్ సార్జంట్ భారతీయ సిపాహీలు కూడ విసుగు చెందారు. పైగా మల్హార రావు యొక్క ముద్ర ఉండిన కాగితాలు చూపగానే ఆ ఎడ్లబండ్ల వైపు ఎవరు దృష్టి ధ్యాస పెట్టేవారు కారు.
అన్నింటికంటే చెత్త పని ఏమిటంటే. మల్హార రావు యొక్క ఎడ్ల బండ్ల లో చాలాసార్లు ఇంధన బొగ్గు, ఇసుక, బాజరీ కీ మిట్టి, జాంభా పథ్థర్ ( ఒక రకమైన ఎరుపు రంగు రాళ్ళు సాధారణం గా కొంకణ ప్రాంతంలో లభించే రాళ్ళు) కంకర, చిన్న చిన్న ముక్కలు చేయబడిన రాళ్ళు, పేడ తో చేసిన పిడకలు ఇలాంటి మొదలగు వస్తువులు నిండుగా నింపి పంపబడేవి. ముఖ్య విషయం ఏమంటే మధ్య మధ్య లో ఇలాంటి సరుకులతో పాటు అడవులలో లభించే రక రకాల జిగురు (బంక) గోందు ఉండేది. వీటన్నిటి వాసన మరియు దుమ్ము బ్రటీష్ వారికే కాకుండ ఇంకా భారతీయ ఆఫీసర్ల కు మరియు సిపాహీలకు కూడ సహించ రానిది గా ఉండేది. ఇంకా అందులో అప్పుడప్పుడు పనికివచ్చే (ఉపయోగ పడగల) తయారైన జంతువుల చర్మాలు కూడ ఉండేవి. రక రకాల ఎండు ఉప్పు చేపలు కూడ ఉండేవి. ఎండు ఉప్పు చేపలు, పనికి వచ్చే జంతువుల చర్మాలు, మరియు గోందు(జిగురు) ల యొక్క వాసన తెలియగానే బ్రిటీష్ అధికారులు మరియు సార్జెంట్ లు ఆ బండ్ల కు దూరంగా పారిపోయేవారు.
వారిలో సగం కంటే ఎక్కువ మంది సిపాయిలకు స్వతంత్ర సంగ్రామం ఎందుకు ఏమిటీ? అని తెలుసు కునే తెలివి లేకుండింది. ఇలాంటి వారిలో చాలామంది నిరక్షరాస్యులు, లేదా చాలా తక్కువ చదువుకున్న వారు ఉంటారు. బ్రిటీష్ వారిపట్ల కోపంతో ఉండేవారు కాని కడుపు నింపుకునే ఉద్దేశం తో మరియు జల్సా చేయడానికి, ఈ ఉద్యోగం నిలుబెట్టుకోవడానికి, వారు బ్రిటిష్ ఆఫీసర్లను సంతోషపరచ వలసి వచ్చేది. మరియు దానికొరకు ఈ సిపాయిలు సందిగ్ధ స్వతంత్ర సేనా నాయకులను కొట్టడానికి తమ శక్తి ని ప్రదర్శించేవారు.
మల్హార రావు రామచంద్ర రావు తో బాగుగా మాట్లాడి, ఇలాంటి ఎందరో భారతీయ సిపాయిలను తన వైపు తిప్పేసుకున్నాడు.
ఆ తండ్రి కొడుకుల వద్ద డబ్బు లెక్క లేనంత ఉండింది. మరియు భారతమాత సేవ చేయాలనే ఆశయం ఉండింది. మల్హార రావు, రామచంద్ర రావు వయసు వారిని మరియు తన వయసు వారిని కొందరు పక్కా దోస్తులను తన ఈ రహస్య కార్యంలో చేర్చుకున్నాడు వారిలో కొందరు ఎంత ముసలి వారంటే, వారిని చూస్తే వీరు స్వతంత్ర సంగ్రామం ఉద్యమం లో సహచరులని ఎవరూ అనుకోరు.
ఇలాంటి వృద్దులైన పురుషులు, సాధారణంగా కనిపించే కూలీలు మరియు ఈ రకరకాల జాతులకు చెందిన మహిళలను చూసి బ్రిటీష్ ఆఫీసర్లు ఇలాంటి ఎడ్లబండ్లను పరిశీలించేవారు కాదు.ఎందుకంటే
ఎవరైన ముసలి వ్యక్తి మరణిస్తే, లేదా ఎవరైన ఉన్నత కుటుంబాని కి చెందిన మహిళకు అనాదరణ, అవమానం జరిగితే సమాజం మొత్తం బ్రిటిష్ వారికి విరుద్దంగా వెళ్ళగలదు. ఇలాంటి పరిస్థితి నిర్మాణం కాకూడదు, అందుకని, బ్రిటిష్ అధికారులందరికి వారి పై అధికారుల నుండి మాటి మాటికి హెచ్చరిక ఇవ్వబడేది. ఈ కారణం గా మల్హార రావు మరియు రామచంద్ర రావు ల యొక్క పని సక్రమంగా జరుగుతుండినది.
ఇంతే కాకుండ మల్హార రావు ఒక గొప్ప ధార్మికుడు అని బ్రిటిష్ ఆఫీసర్లు ఎరుగుదురు. నిరంతరం భగవంతుని నామము స్మరించు వాడు, గొప్ప ధనికుడు, జమీందారు గా కూడ తెలుసు. ఈ బ్రిటీష్ ఆపీసర్లు పరస్పరం మల్హార రావు గురించి మాట్లాడుకునే టప్పుడు "తెలివైన ముసలివాడు, ఎన్నో పాపాలు చేసి, స్వర్గప్రాప్తి కొరకు భగవంతుని స్మరణ చేస్తు ఉంటాడు." అని మాట్లాడుకునే వారు. అందుకు రెండు కారణాలు ఉండినవి.
1) మల్హారరావు అనేక స్థలాలలో మరియు చిన్న చిన్న గ్రామాలలో ఉండిన ఆలయాల జీర్ణోద్దరణ, (పాత ఆలయాల మరమ్మతు) చేయించేవాడు. నిరంతరం ఏదో ఒక ఆలయాన్ని సందర్శించి బోలెడంత దానధర్మాలు చేసేవారు.
వీటితో పాటు అనేక ఆలయాల వద్ద బావులు మరియు చిన్నచిన్న ధర్మశాలలు కూడ కట్టించాడు.
2). మరి రెండో వైపు తప్పకుండ ప్రతిఒక జాతరలో జరిగే తమాషా (మహారాష్ట్ర లో జనాదరణ పొందిన ఒక నాట్య ప్రక్రియ) స్థలానికి వెళ్ళే వాడు. మరియు అతని హవేళీ ( భవంతి)లో కూడ లావణీ ( మహారాష్ట్ర లోని లోకప్రియ సంగీత కచేరీ,అందులో పాట మరియు ఆట కూడ ఉంటుంది) కార్యక్రమం జరుగుతు ఉండేది. అది కూడ బహిరంగంగా అనేక సార్లు జరుగుతుండేది.
నిజానికి మల్హార రావుకు ఇలాంటి కార్యక్రమాలలో ఎంత మాత్రం అభిరుచి ఉండేది కాదు. సరదా మనిషిగా నటించడం అవసరం ఉండింది. కామ వాసన తో ఆకలిగా ఉండే బ్రిటీష్ అధికారులు అతనితో స్నేహం చేయాలని అందుకొరకు ఇలా ప్రవర్తించడం అవసరం ఉండింది.
రామచంద్ర ను బ్రిటిష్ వారు "రామచంద్రరావు లేదా ధారాపూర్ కర్ సాబ్ అనే పేరుతో పిలిచేవారు.
జానకీబాయి కేవలం ఇరవైఒక సంవత్సరాల వయసు గలదీ అయినా కానీ ఆ కాలం వారికి ఆమె గురంచి ఆశ్చర్యం కలిగేది.-- ఎందుకంటే ఆమె ధారాళంగా ఆంగ్లభాష మాట్లాడేది గవర్నర్ భార్య ఈ జానకీబాయి కి ప్రముఖ స్నేహితురాలు. గవర్నర్ భార్య జానకీబాయి లేకుండ ఎలాంటి వేడుకలకువెళ్ళేది కాదు.
అయితే గ్రామస్తులకు బాగుగా తెలుసు-- ఈ మండీ ఎదురుగానే మల్హార రావు ద్వార జీర్ణోద్దరణ గావించబడిన ధారపురేశ్వర మహాదేవుని దేవాలయం ఉండింది. అందులో శివలింగం తో పాటు భగవాన్ త్రివిక్రముని యొక్క హరిహర మూర్తి కూడ ఉండింది.
( ఇంకా ఉంది)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment