మల్హార రావు విద్రోహుల యొక్క మోసమును చక్కగ గుర్తించేవాడు అందుకని అతను మిక్కిలి రహస్యంగా శివుని యొక్క శివపిండి ( శివ లింగము) ను మరియు హరిహర మూర్తిని ఆ అడవిలో నివసించే స్థలములో తీసుక వచ్చి పెట్టాడు. ఆ మూర్తికి ఒక వైపు శిథిలమైన గోడను కూడ ముందే తయారు చేసి ఉంచాడు. ఎక్కడైతే చెట్లు చేమలు అధికంగా ఉండినవో అలాంటి స్థలమును ఎంపిక చేసాడు. తర్వాత ఒక రోజు అతని యొక్క ఒక ముఖ్య సహకర్మీ తన యొక్క తప్పి పోయిన ఆవుదూడ ను వెదుకుతు ఉన్నప్పుడు ఈ మందిరం అకస్మాత్తుగ కనిపించింది. మరి ఎప్పటి మాదిరి దానశీలి గా ప్రఖ్యాతి గాంచిన మల్హార రావు ముందుకు వచ్చి ఆ మందిరమును నిర్మాణం చేయించాడు, అంతే. తొంభై సంవత్సరాల వయసు దాటిన ఆ గ్రామంలోని వృద్దులు కూడా సాక్షం చెప్పారు. వారి చిన్న తనం లో వారు విన్న విషయం ఇక్కడి శివమందిరం ను దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం విధర్మీయుల ఆక్రమణలో పడగొట్ట బడింది. అని చెప్పారు.
అలాగే ఈ మందిరంలో నివసించేందుకు అనుమతించబడిన ప్రతి సాధువు మరియు తీర్థయాత్రికుడిని క్షుణ్ణంగా పరిశీలించేవారు. అయినప్పటికీ అక్కడ ఎవరూ కూడా రెండు రోజులకంటే ఎక్కువ కాలం ఉండేందుకు అనుమతి ఉండేది కాదు. ఇక్కడ ఎక్కువ కాలం పాటు నివాసం ఉండేది వేషభాషలు మార్చుకొని సంచరించే స్వాతంత్ర్య సమరయోధుల రెండు వర్గాలకు. ఒక వర్గం భూగర్భంలోకి వెళ్లిపోయిన స్వాతంత్ర్య సమరయోధులది కాగా, మరో వర్గం విప్లవకారులది. భూగృహం లో ఉండిన అనేక రహస్య అలమారీ లలో మరియు గోడలలో నిర్మించ బడిన అలమారీలలో వేషం మార్చు కొనడానికి అవసరమగు సకల సాధన సామగ్రి పెట్టబడి యుండేది. భారత్ లోని ప్రతిఒక ప్రాంతం యొక్క వస్త్రధారణ, రక రకాల సైజులలో ఇక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉండేవి.
ఈ రోజు మల్హార రావు రాగానే మందిరం లో చక్కగ దర్శనం చేసుకుని వేగంగా భూ గృహం లోకి వెళ్ళాడు. ఇలా ఎప్పడైన పగటి పూట చేయవలసి వస్తే అప్పుడు గుడి పూజారి, నూనె పడిపోయింది, భస్మం ఒలికి పోయింది, కిటికీ లోనుంచి పక్షి లోపలికి వచ్చింది, ఊసరవెల్లి తిరిగింది అని కారణాలు చెప్పి, గర్భగృహం యొక్క ద్వారం మూసివేసే వాడు. రాత్రి పూట అయితే ఎలాంటి సమస్య ఉండదు.
మల్హార రావు భూగృహం లోకి ప్రవేశించి నేరుగా భూగృహం లో ఉండిన 19 వసారాలలో ఉన్న 13వ నంబరు గల వసారాల లోకి వెళ్ళాడు. ప్రతి ఒక వరండా దర్వాజ పై అంకెలు చెక్కబడియున్నవి. వరండాలు 19 ఉన్నాయి, అలా అని చూసేవారికి కనిపించేది. కాని ఒకే నంబరు తో 3,--4, వరండాలు వాటిపై సేమ్ నంబరు( అదే నంబరు)వ్రాయబడి యుండింది. మరియు ఒకటి రెండు వరండాల యొక్క గోడలలో తెరుచుకునే ఒక రహస్య వరండా కూడ ఉండేది.
ఈ విధమైన సంక్లిష్టమైన సంపూర్ణ నిర్మాణానికి రూపకర్త అయిన నిర్మాణ నిపుణుడు (ఇంజనీర్) ‘శివరామరాజన్’ మూడు సంవత్సరాల తరువాత ఈరోజు తొలిసారి వచ్చాడు. అదీ ముందస్తు సమాచారంతో, ఉత్తర హిందుస్తానీ వేషధారణలో, గ్రామం బయట ఉన్న హనుమాన్ మందిరం నుంచి వచ్చే గోప్య మార్గం ద్వారానే వచ్చాడు.
ఫకీర్ బాబా యొక్క, అనగా శివరామరాజన్ యొక్క ముఖం ఒక్క క్షణంలో ఉగ్ర రూపం గా మారింది. కోపం తో అతని కండ్లు మండుతున్న నిప్పు కణాల మాదిరిగ ఉండినవి. అయితే అతను మెల్ల మెల్లగ తనంతట తను శాంతిస్తు చెప్పడం మొదలు పెట్టాడు "మల్హార రావు! విప్లవ కారులందరికి, వారి చుట్టుపక్కల ఉన్న భారతీయులే అపాయం కలిగిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టుబడిన విప్లవకారులలో 99% ఇదే జరిగింది. కొన్నిసార్లు చుట్టుపక్కల వారు, కొన్ని సార్లు బ్రిటీష్ వారి భారతీయ వార్తా హరులు, కొన్ని సార్లు ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన నజరానా ( పురష్కారం) కారణంగా ఆశపడినవారు, మరి కొన్నిసార్లు మొదట ఉద్యమం లో పాల్గొని, తర్వాత ఉద్యమం నుంచి బయటకువచ్చిన పిరికి పందల ద్వార జరిగింది.
ఎందరో భారతీయుల రక్తం వ్యర్థంగా ప్రవహించు చుండినది. ఇంకా ఎప్పటివరకు ప్రవహిస్తుందో ఇలాంటి విద్రోహులకు గుణపాఠం నేర్పడం నాకు అత్యంత ప్రాథమిక విషయం అనిపిస్తుంది.'
మల్హార రావు క్షణం కూడ ఆలస్యం చేయకుండ అన్నాడు, "ఎవరైనా విద్రోహం చేస్తే అతనికి బ్రిటిష్ ప్రభుత్వం ద్వార అన్ని సౌకర్యాలు ఇవ్వబడేవి. ఇలాంటి వారిని ఎవరు శిక్షిస్తారు? ఇప్పటి వరకు మనం విప్లవకారులకు, మరియు అండర్ గ్రౌండ్ స్వతంత్ర సేనానులకు సహకరించే పని చేస్తుండినాము. కాని ఏ రకమైన విప్లవ కారుల పనిలో అనగా సశస్త్ర పోరాటం మరియు కూటనీతి (గెరిల్లా యుద్దం) లో ప్రత్యక్షంగా పాల్గొన లేదు.
రామచంద్ర రావు తో నేను ఒక రోజు ముందే మాట్లాడినాను. కేవలం సమర్థన ఇవ్వడం, లేదా సహాయం చేయడం లేదా విప్లవ కారులకు అస్త్రశస్త్రములను సమకూర్చడం మాత్రమే సరిపోదు మనమొత్తం బృందం విప్లవోద్యమం లో దిగడం అవసరం. రామచంద్ర రావు యొక్క సంసిద్ధత పూర్తి అయింది.
రెండు మాసాల క్రితం భగతసింగ్ బలిదానం జరిగిన తరువాత దేశమంతట కోపం తో ఉద్రిక్తత నెలకొంది. (23-3-1931) చాలా ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ కు చెందిన బెంగాల్ నుంచి వచ్చిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తో ఈ మధ్య కలువడం జరిగింది. అతను విప్లవాత్మక ఆలోచన గలవాడు. యువకుడు, మరియు ఉత్సాహం గలవాడు. అంతరంగం పూర్తిగ విప్లవాత్మకం అయినప్పటికి, ఆయన గాంధీ మార్గము ను ఎంచుకున్నాడు. అది కూడ విశాల విస్తృత స్వతంత్రతా సంగ్రామం కొరకే.
"వాతావరణం ను నిర్మాణం చేసే పనిని మేము చేస్తాము. విద్రోహులకు గుణపాఠం నేర్పే పనిని కూడ చేస్తాము. ఆ విద్రోహ మేకలను బలి ఇవ్వవలసిందే.
కనీసం ఈ విద్రోహులు సమాజంలో బ్రతుకడం, జీవించి ఉండడం. కష్టాలలో కూరుక పోవడం,అవమానాల పాలు కావడం మరియు బ్రతుకు దుర్భరం కావాలి." ఈ కార్యాన్ని మేము మహిళలే ముందుగా చేతిలోకి తీసుకుంటాం.”అని జానకీ బాయి అన్నది. ఆమె రహస్య ద్వారం నుంచి లోపలికి వస్తూ స్వాభావికంగానే అన్నది, కానీ ఆమె ముఖంపై ఉన్న సంకల్పం మాత్రం అత్యంత కఠినంగా కనిపించింది.
( ఇంకా ఉన్నది)
मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>> മലയാളം>>
.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment