మల్హార రావు మాట్లాడుతు మాట్లాడుతు ఒక్క క్షణం ఆగినాడు. అతని గొంతు గద్గదమైంది. కండ్లు చెమ్మగిల్లాయి అక్కడ ఉన్న వారందరి పరిస్థితి కూడ అలానే ఉండింది. అదే గదిలో మల్హార రావుకు ఎడమ ప్రక్కన ఒక మూలన కూర్చున ముగ్గురు మహిళల యొక్క పరిస్థితి భిన్నంగా ఉండింది.
మొదటి స్త్రీ అంటే ఇరవై ఒక్క ఏళ్లు నిండి ఇరవై రెండో ఏడు నడుస్తున్న జానకీబాయి - ‘ఆద్య హుతాత్ముడు మంగల్ పాండే కూడా ఇరవై రెండేళ్ల వాడే. నేను కూడా ఇరవై రెండేళ్ల దాన్ని. 'ఎప్పుడైతే అతని గుండె లోకి తుపాకి తూటాలు గ్రుచ్చినవో అపుడు ఎంత అందంగా కనిపించి ఉండవచ్చు గద! ఓ భగవంతుడా! నాకూ అలాగే జరగనివ్వు'.’
రెండవ మహిళ, ఫడకే మాస్టర్ భార్య కమలాబాయి, ఆమె పరిపక్వత గల, మరియు అనుభవజ్ఞురాలైన మహిళ. ఆమే తన మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఏమి చేయగలదో ఆలోచిస్తున్నది.
మూడవ మహిళ గోవిందదాజీ కూతురు శ్రీమతి మంజులాబాయి ఆమె అత్తగారు కూడా అదే గ్రామము. ఆమెకు ఒక ఏడాది (సంవత్సరం) బాబు ఉన్నాడు. ఆమె ఒడిలో నిద్ర పోతున్నాడు. ఆమె వయసు కూడ 22 సంవత్సరాలే ఉండింది. ఆమె మొదటి నుండి గోవింద దాజీ యొక్క మార్గదర్శనంలో వారి అన్ని యోజనలలో గత మూడు సంవత్సరాల నుండి సహాయం చేస్తుండింది. ఆమె జానకీబాయి యొక్క ప్రాణ స్నేహితురాలు. ఆమె భర్త వాసుదేవ గోవింద. ఆయన రామచంద్ర ధారపుర్ యొక్క ముఖ్య స్నేహితుడు. ముంబై - ధారపుర్ మధ్య మానవీయ పుల్ (వంతెన)గా ఉన్నాడు. మంజులాబాయి కొడుకు పేరు మంగళ్ ప్రసాద్ అని కావాలని పెట్టుకుంది. మంగళ్ పాండే నే ఆమే గర్భంలో జన్మించాడని అనిపించేది.
ఒక ఐదు నిమిషాల తర్వాత వాతావరణం కాస్త తేలికపడింది. సంపత్‌రావు కొంచం భయపడుతూ అడిగాడు, “మల్హార్‌రావు! మంగల్ దివాకర్ పాండే బలిదానం చేశాడు, ఇది గొప్ప విషయమే. కానీ మీరు దాన్ని ‘మొదటి బలిదానం’ అని ఎందుకు అంటున్నారు? ఆ నందకుమార్‌ను కూడా ఉరి తీశారు కదా?”
మల్హార్‌రావు అన్నారు, “నందకుమార్‌ను బ్రిటిష్ Officer కపటబుద్ధిని ఉపయోగించి ఉరి తీశారు, ఇది నిజం;
కానీ అతనేమీ స్వాతంత్ర్య సమరయోధుడు కాదు. అతను బ్రిటిష్ వాళ్ళ కోసం భారతీయ ప్రజల దగ్గరి నుండి Tax వసూలు చేసే పని చేస్తుండేవాడు మరియు అందులో కొంత భాగం అతను అవినీతిపరులైన బ్రిటిష్ అధికారులకు వారి జల్సాల కోసం ఇస్తుండేవాడు. ఒకసారి సందర్భవశాత్తు అంటే డబ్బు ఇబ్బంది ఉండడం వల్ల నందకుమార్, వసూలు చేసిన Tax లోని కొంత భాగం తన దగ్గరే ఉంచుకోవడం మొదలుపెట్టాడు మరియు దాని కోసం అతన్ని ఉరి తీశారు.
ఇది స్వాతంత్ర్య యుద్ధంలోని బలిదానం కాదు, కానీ బ్రిటిష్ వారి హింసాత్మక మరియు క్రూరమైన దౌర్జన్యానికి ఉదాహరణ. కేవలం కొంచెం డబ్బు దొంగతనం కోసం ఉరి తీయడం మరియు అది కూడా 70 ఏళ్ల మనిషిని, ఇది కచ్చితంగా అన్యాయమైన విషయమే, కానీ బలిదానం కాదు.”
సంపత్ రావు మరల ఒక ప్రశ్న అడిగాడు "మంగళ్ పాండే ఎక్కడైతే బలిదానం చేశాడో అక్కడ అతని స్మృతి చిహ్నంగా ఏదైన ఒక సాధారణ శిల పెట్టబడిందా?"
మల్హార్‌రావు భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తూ అన్నారు, “మంగల్ దివాకర్ పాండే బలిదానం తర్వాత కేవలం ఒక్క నెలలో, అతని ఒక ఆప్త మిత్రుడు ‘ధనసింహ గుర్జర్’ ఆ స్థలంలో ఒక నిర్దిష్ట ఆకారపు రాయిని పాతిపెట్టి, దాని పక్కన ఒక తులసి మొక్కను నాటాడు. స్వతంత్రం లభించిన తర్వాత అదే స్థలములో మంగళ్ పాండే యొక్క స్మారకం నిర్మించ బడింది.
ధనసింహ గుర్జర్ మేరఠ్ లో ఉన్న బ్రటిష్ గుడారంలో కొత్వాల్ పదవిలో ఉండినాడు. అతని ఆధీనంలో 50 మంది సైనికులు ఉండిరి. మంగళ్ పాండే మరణానికి ముందు ధనసింహునితో వరుసగా మూడు రోజులు చర్చించాడు. అయితే లెఫ్టినెంట్ బాఘ్ ధనసింహుడిని తిరిగి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. దాంతో అతను వెళ్ళవలసి వచ్చింది.
ధనసింహ గుర్జర్ వద్ద ఆ సమయంలో అతనితో పాటు కేవలం ఒక సైనికుడే ఉన్నాడు. అందువల్ల అతను శాంతంగా ఉన్నాడు. అయితే మేరఠ్ గుడారం లోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలలోనే అతనికి బరక్ పూర్ లో మంగళ్ పాండే ఏమి చేసాడో ఆ సమాచారం తెలిసింది. మనసులో కోపంతో రగిలిపోయిన కొత్వాల్ ధనసింహ గుర్జర్ వేగంగా పనిలో నిమగ్నమైనాడు. తన 50 మంది సైన్యము మరియు ఇతర సైన్య భాగాల యొక్క 50 మంది సైనికులు 100 మందితో ఒక చిన్న సైన్యం తయారు చేసాడు. మేరఠ్ గుడారంలో మంగళ్ పాండేను ఉరి తీసారని 9 ఏప్రిల్ 1857 నసమాచారం తెలిసింది. గుడారం లో ఉండిన ప్రతీఒక సైనికుడు కోపోద్రిక్తుడైనాడు. కాని ఏమి లాభం? రెండువేల మంది సైనికుల లో కేవలం 40 మంది సైనికులు ధనసింహ గ్రూపులో చేరడానికి సిధ్ధం అయ్యారు. మిగతా వారు ఊరుకున్నారు.
ధనసింహ గుర్జర్ యొక్క నూట నలభై మంది సైనికులకు తమ దగ్గర ఉన్న తూటాలు ఇచ్చే ధైర్యం కూడా మిగిలిన సైనికులలోని కేవలం ముప్పై-నలభై మంది దగ్గరే ఉంది, కానీ ధనసింహ గుర్జర్ యొక్క తేజోవంతమైన మాటలు మెల్లమెల్లగా ఇతరుల మీద ప్రభావం చూపడం మొదలుపెట్టాయి మరియు అప్పుడు చాలా వరకు తూటాలు జమా అవ్వడం మొదలయ్యాయి మరియు అతని సైనికుల సంఖ్య కూడా 250 వరకు వెళ్లి చేరింది. 21 ఏప్రిల్ న ఈశ్వరీప్రసాద్‌ను కూడా ఉరి తీశారు, ఈ వార్త వచ్చాక అయితే ఇంకా ఎక్కువ మంది సైనికులు ముందుకు రావడం మొదలయ్యింది మరియు స్వాతంత్ర్య యుద్ధపు మంటలు దగ్గరలోని ఇతర ఏడు స్థావరాలలో కూడా వ్యాపించాయి.
తమలో తాము వార్తల మరియు సందేశాల మార్పిడి జరగడం మొదలయ్యింది. ప్రతి స్థావరానికి మరియు ఠాణాకు ఎవరి లక్ష్యం వారికి నిర్దేశించి ఇవ్వబడింది మరియు 10 మే 1857 న కొత్వాల్ ధనసింహ గుర్జర్ నేతృత్వంలో మీరట్ స్థావరంలోని బ్రిటిష్ Officers ఉన్న ఠాణా మీద జోరుగా దాడి చేశారు.
ధనసింహ యొక్క ఉద్రేక పూరితమైన ఉపన్యాసము (వాగ్దాటి) తో మరియు ప్రచండమైన పట్టుదల వల్ల దాదాపు 600 మంది సైనికులు వేరు వేరు ఠాణాల నుండి ఆయుధాలతో మేరఠ్ వచ్చారు.
పశ్చిమోత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఆగ్రా, డెహరాడూన్, బిజ్నోర్, పంజాబ్, రాజస్థాన్, ఝాన్సీ మరియు మహారాష్ట్ర నుండి విప్లవాత్మక ఆలోచనలతో నిండిన సామాన్య ప్రజలు బాకు, పార, రంపము, సుత్తే, గొడ్డలి లాఠీ ఇలా ఆయుధాలను తీసుకొని మీరఠ్ వచ్చారు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.
మేరఠ్ చుట్టుపక్కల గ్రామాల లోని గుర్జర జాతి వారు వేలాది మంది గ్రామస్థులు ఏది అందు బాటులో ఉంటే ఆ ఆయుధంను తీసుకుని అక్కడ గుమిగూడారు.
10 మే రాత్రి 9 గంటలకు ధనసింహ మరియు అతని ఒక బృందం మీరట్ స్థావరంలోని బ్రిటిష్ అధికారుల భవనం మీద దాడి చేసింది మరియు వాళ్ళందరినీ బందీలుగా చేసింది. రాత్రి రెండు గంటలకు మీరట్‌లోని ప్రధాన జైలును పగలగొట్టి 876 మంది ఖైదీలను విడిపించారు మరియు తమలో కలుపుకున్నారు. ఆ తర్వాత జైలుకు నిప్పు పెట్టారు.
తెల్లవారేసరికి ఇరవై రెండు మంది బ్రిటిష్ ఆఫీసర్లు చంపబడ్డారు, 80 మంది బ్రిటిష్ సోల్జర్లు చంపబడ్డారు మరియు దాదాపు అంతే మంది ధనసింహ చెరలో ఉన్నారు.
"శహీద్ మంగళ్ పాండే అమర్ రహే! అంటూ నినాదాలు ఇస్తూ సామాన్య ఆయుధాలను పట్టుకొని, దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది భారతీయ నాగరీకులు మీరఠ్ లో ఉన్న బ్రిటిష్ వారికి సంబంధించిన ప్రతీ ఒక భవనాన్ని కాగితాలను, పోలీసు ష్టేషన లను ఈ రకంగా అనేక రంగాలకు చెందిన చాలావాటిని అక్షరాల కాల్చి బూడిద చేసారు.
ఆ తర్వాత వారిలో సగం మంది సైనికులు సగం మంది నాగరికులు మే12 న ఢిల్లీ వరకు వెళ్లినారు మరియు మేరఠ్ చుట్టుపక్కల గ్రామాలలో కూడ తిరుగుబాటును వ్యాప్తిచేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం దీటుగా సమాధానం ఇవ్వడం మొదలు పెట్టింది. బ్రిటిష్ వారి దగ్గర సైనిక బలం చాలా ఉండింది. శక్తివంత మైన అస్త్ర శస్త్రాలు కూడ విస్తృతంగా ఉండినవి.
ఈ తిరుగుబాటు ఢిల్లీ లో కూడా విస్తరిస్తుందని గమనించి మరియు ఉత్తరప్రదేశ్ పంజాబ్ బంగాల్ మహారాష్ట్ర మరియు పాట్నా లో కూడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చూసి బ్రిటిష్ సర్కారు భగ్గుమన్నది. వాళ్ళకు తమ అధికారం పోయే ప్రమాదం కనిపించసాగింది.
కొన్ని చోట్ల మాత్రమే బ్రిటిష్ వారికి విజయం కలుగుతుండినది కాని చాలా చోట్ల స్వతంత్ర సేనానులు విజయం పొందు తుండిరి. ప్రతీ ఒక స్వతంత్ర సేనాని మూడు రకాల నినాదాలు ఇస్తున్నాడు.
1) ఫిరంగీ (తెల్లవారిని చంపేయండి.
2) శహీద్ మంగళ్ పాండే అమర్ రహే.
3) విప్లవ సూర్యుడు ధనసింహ గుర్జర్ కు జయహో. మూడు నెలలుగా ఈ పోరాటం సాగుతుండినది. బ్రిటిష్ వారు చాలా దెబ్బలు తిన్నారు.
చివరకు బ్రిటిష్ వారు కుటిల నీతిని ఉపయోగించి ధనసింహ ఆ సమయం లో ఎక్కడ ఉన్నాడో ఆ గ్రామంపై (పానస్లి లేదా గగోల్) పది పెద్ద ఫిరంగులతో అతి క్రూరంగా దాడి చేసారు. 500 మంది అశ్విక దళము గ్రామంలో చొచ్చకొని పోయి అందరిని చంపి వేస్తుండినారు. సమారు వేలాది మంది స్త్రీ పురుషులు చంపివేయ బడినారు. మిగిలిన వారిని ఒక్కొక్క చౌరస్తా లో ఉరి తీసారు.
ధనసింహ గుర్జర్ కొత్వాల్ అక్కడే వీరగతి పొందాడు. అదికూడ దాదాపు వంద మంది బ్రిటిష్ సైనికులను చంపిన తర్వాత నే వీరగతీ పొందాడు.
ఈ గ్రామంలోనే ధనసింహ గుర్జర్‌కు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి యొక్క బలమైన సమర్థన ఉన్నట్లు ఆధారాలు బ్రిటిష్ వారి చేతికి చిక్కాయి మరియు ఒక్క రాత్రిలో బ్రిటిష్ వారికి పేద స్వభావం గల, నిస్సహాయ, ఏకాకి విధవ రాణి లక్ష్మీబాయి ప్రచండ ప్రమాదకరంగా అనిపించసాగింది.”
(కథ కొనసాగుతుంది)
.png)



Comments
Post a Comment