భారత స్వాతంత్ర్య పోరాటంలోని అజ్ఞాత చరిత్ర యొక్క సంగ్రహావలోకనం - భాగం 8

 
సంపత రావు వేలు పైకెత్తి ప్రశ్న అడిగాడు, “మంగల్ దివాకర్ పాండే ఒక సామాన్య సైనికుడు కదా! అతను ఏమీ సాధించాడు? అతను ముందు తయారీ ఏమైన చేసాడా?లేక తొందరపాటుతో లేదా వ్యర్థ ఉత్సాహంలో ఏదైనా చేసేశాడా? మేము అలాంటిదేదో విన్నాము!”

మల్హార రావు స్పష్టంగా అన్నాడు, “మంగల్ పాండే గురించి బ్రిటీష్ వారు, బ్రిటీష్ వారికి అనుకూలమైన వార్తాపత్రికలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు మరియు గూఢచారులను ఉపయోగించి ఈ విధమైన వార్తనే వ్యాప్తి చేశారు: ‘మంగల్ పాండే భాంగ్ సేవించారు, ఆయన ఎప్పుడూ నల్లమందు (opium) తీసుకునేవారు మరియు ఆ మత్తులోనే ఆయన అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు అతని వెనుక భారతదేశానికి సంబంధించిన ఎలాంటి విలువ లేదు.’

అయితే ఇదంతా పచ్చి అబద్దము. ఫడకే మాస్టర్ గారి తండ్రి అనంతరావు ఫడకే కూడా మంగల్ పాండే ఉన్న అదే బటాలియన్‌లో ఉండినాడు మరియు మన ఫకీర్ బాబా మామ కూడా. అందువల్ల, మన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది, అది కూడా అక్కడ ఉన్న వ్యక్తుల నుండే లభించింది.

అందరు శ్రద్ధగా వినండీ. 29 మార్చి 1857 నాడు మంగళ్ పాండే పోరాటం ఆరంభించాడు దాడి కూడ చేశాడు, ఇది నిజం. అయితే అది ఆయన ఏ మత్తులోనూ చేసిన పని కాదు ఆయన నల్లమందు, గంజాయి, భంగు, సారాయినే కాదు, కనీసం బీడి కూడ త్రాగే వాడు కాదు. ఆయనకు సాదా తమలపాకు తినే అలవాటు కూడా లేదు. సాధారణంగా ఫిబ్రవరి 57 చివరి వారం లో తుపాకులు మరియు తూటాలు వారి గుడారం లో నింపినారు, కాని సైనికులకు నిజం దాచారు.

మంగల్ దివాకర్ పాండే రోజూ తెల్లవారుజామున లేచి 108 సార్లు గాయత్రీ మంత్రం జపించేవారు, ఆ తర్వాత మహాదేవుడిని ఆరాధించే ధార్మిక మరియు సత్శీల్ యువకుడు. అతనికి అంగ్ల భాష బాగా తెలుసు. ‘ఈశ్వరీప్రసాద్’ అనే ఆ సైన్యంలోని జమదార్ (హవల్దార్) ఇంగ్లీష్ భాషలో ప్రవీణుడు. ఆయనతో ఉండి ఉండి మంగల్ పాండే ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అలాగే, ‘నందకుమార్’ అనే, బుర్ద్వాన్, నాదియా మరియు హుగ్లీ విభాగం యొక్క భారతీయ బెంగాలీ వంశానికి చెందిన దివాన్ (Tax Collector) ను బ్రిటీష్ వారు 1775 లో ఉరి తీశారు, ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్న మనవడు పేరు మరియు గ్రామం మార్చుకుని ‘నవీన్‌చంద్ర ముఖోపాధ్యాయ’ అనే పేరుతో బ్రిటీష్ గవర్నమెంట్‌కు చెందిన సైన్యానికి సంబంధించిన ఉద్యోగంలో చేరారు, మరియు ఆయన ఇంగ్లీష్‌లో అత్యంత ప్రవీణుడు. కానీ ఆయన తన

రహస్యాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. అతని కుమారుడు మంగళ్ పాండేకు మంచి స్నేహితుడు అయినాడు. మంగళ్ పాండే అతనితో ఎప్పుడూ మాట్లాడుతుండేవాడు. అందులో బ్రిటీష్ వారు చేస్తున్న అత్యాచారాల గురించి కోపం వ్యక్తం చేసేవారు మరియు ‘ఏదైనా చేయాలి’ అనే పట్టుదలతో ఉండేవారు. అందువల్ల నవీన్‌చంద్ర ముఖోపాధ్యాయ మంగల్ పాండేను ఒక నెలలోనే ఇంగ్లీష్‌లో బాగా తయారు చేశారు, మరియు ఈ విషయం మంగల్ పాండే నమ్మకస్తులైన మిత్రులకు తప్ప మరెవరికీ తెలియదు.

ఒక రోజు తెల్లవారుజామున లేచి జపం చేయడానికి ముందు స్నానం కోసం బావి దగ్గరకు వెళ్లిన మంగల్ పాండేకు, ఇద్దరు బ్రిటీష్ ఆఫీసర్స్‌ల సంభాషణ కొంచం విన పడింది. అందులో ఆవు కొవ్వు, మాంసం , పంది కొవ్వు మాంసం ఈ పదాలు వినబడినందున దొంగ చాటుగ సంభాషణ అంతా విన్నాడు. దాంతో అతనికి హిందువులు మరియు ముస్లింలు ఇరువురిని కూడ ధర్మభ్రష్టులు చేయాలనే ఆంగ్లేయుల కుట్ర బోధ పడింది. ఎందుకంటే హిందువులు ఎన్నడూ గోమాంసం తినరు. మంచి ముస్లిం ఎన్నడూ పంది మాంసం తినడు.

అక్కడి నుండే మంగల్ పాండే ఆలోచనల చక్రాలు వేగంగా తిరగడం ప్రారంభించాయి. ఆయన ఆ ఉదయమే ఈ వార్తను జమదార్ ఈశ్వరీప్రసాద్ మరియు తన సహచరులకు చెప్పారు. వారు తమలో తాము క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించడం ప్రారంభించారు. వేరు వేరు స్థలాల లో ఉన్న హిందూ సైనిక మిత్రులను ఈ యోజన లో చేర్చుకున్నారు. మీరట్ శిబిరంలో ఉన్న ప్రతి భారతీయ సైనికుడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఏప్రిల్ 1, 1857 నుండి కొత్త కాడ్తూసులు ఉపయోగించడం తప్పనిసరి కానుంది, అందువల్ల మార్చి 28 రాత్రిని నిర్ణయించారు. అందరూ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా రాత్రంతా మేల్కొని ఉన్నారు. కానీ రాత్రంతా బ్రిటీష్ అధికారి ‘లెఫ్టినెంట్ బాఘ్’ (Baugh) తన కొంతమంది బ్రిటీష్ సహచరులతో ఈ మొత్తం బారక్ పోర్ (Barrack Pore) శిబిరంలో గస్తీ తిరుగుతున్నారు మరియు ఆయనతో బయటి నుండి వచ్చిన కొంతమంది భారతీయ జమీందార్లు, ఠాకూర్లు మరియు కాశీకి బయలుదేరిన యాత్రికులు కూడా ఉన్నారు ఆ కారణంగ మంగళ్ పాండే కొంచం ఓపిక పట్టాలని నిర్ణయించుకున్నాడు. వీరందరు మెల్ల మెల్లగ అక్కడ నుంచి వెళ్లి పోయిన తర్వాత తనతో నింపి ఉన్న పాత తుపాకీ చాలా తుపాకీ గుండ్లు తీసుకుని లెఫ్టినెంట్ బాఘ్ గుడారం పై దాడి చేయడానికి తన డేరా (టెంట్) నుండి బయటకు వచ్చాడు.



వారి యోజనలో చేరిన తోటి వారి కొరకు గుర్తుగా తాత్కాలికం గా ఏర్పాటు చేసిన ఎరుపు రంగు బట్ట చిన్న ముక్క ను ఒక పిరికి వాడు భయస్తుడైన తోటివాడు దాచిపెట్టాడు. మంగళ్ పాండే ఒక్కడే లెఫ్టినెంట్ బాఘ్ నివాస స్థలము వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. అక్కడినుంచే బయటకు వచ్చిన లెఫ్టినెంట్ పై మొదటి సారి తుపాకీ గుండు పేల్చాడు. స్వతంత్ర సంగ్రామం యొక్క మొదటి గుండు పేల్చబడింది. ఇక్కడ అయితే

విప్లవవాది తన పని కానిచ్చాడు. దాంతో లెఫ్టినెంట్ బాఘ్ వెంటనే గుర్రం పై ఎక్కి పారిపోతుండినాడు. అయితే మంగళ్ పాండే పేల్చిన రెండు గుండ్లు లెఫ్టినెంట్ గుర్రం శరీరంలో దూరాయి. గుర్రం లెఫ్టినెంట్ తో పాటు క్రింద పడిపోయింది. మంగళ్ పాండే కత్తి తీసుకుని బాఘ్ వైపు పరుగెత్తి కత్తితో ఏడు సార్లు దెబ్బ వేశాడు. కాని శేఖ్ పలటూ పేరుగల లెఫ్టినెంట్ యొక్క ముఖ్య సిపాహి మంగళ్ పాండే ను వెనుకకు లాగి పడగొట్టాడు.

మంగళ్ పాండే యొక్క ప్లాన్ తెలిసిన బ్రిటిష్ సార్జెంట్ మేజర్ హ్యూసన్ హుటాహుటిన అక్కడికి వచ్చాడు. ఓటమి జరుగుతుందని చూసి హ్యూసన్ కోపోద్రిక్తుడైనాడు. మంగళ్ పాండే పై దాడి చేయుమని జమేదార్ ఈశ్వర్ప్రసాద్ ను ఆదేశించాడు. కాని ఈశ్వర్ప్రసాద్ అతని ఆజ్ఞను తిరస్కరించి మంగళ్ పాండేకు సహాయం చేయడం మొదలు పెట్టాడు హ్యూసన్ కు సహాయం చేయడానికి శేఖ్ పలటూ పరుగెత్తుక వచ్చాడు. ఆయన ఇతర సిపాహిలను సహాయం చేయమని అన్నాడు. కానీ మంగళ్ పాండే పై ఏకనిష్ఠ గల తోటివారు తిరిగి రాళ్ళు చెప్పులు విసిరారు.

మంగల్ పాండే మరియు ఆయన సహచరులు ఆ పోరాటాన్ని దాదాపు గెలిచినట్లే. మంగల్ పాండే బిగ్గరగా నినాదాలు ఇస్తున్నారు,

1). విదేశీయులను చంపండి

2) మీరు మా నల్ల మనిషి యొక్క నిజాయితీని చూశారు, ఇకపై మా కోపాన్ని చూడండి. (You have tested a black man’s loyalty - now test his fury.)

3) ఈ కాడ్తూసులు కొరకడం వలన మనం అందరం ధర్మభ్రష్టులం అవుతాము. ఇప్పుడే మేల్కొనండి. (By biting these cartridges, we shall become infidels, awake!)

4) నేను హిందుస్థానీని మరియు నేనే హిందుస్థాన్. (I am true Indian and I am Hindustan myself.)

ఇంతలో మేజర్ జనరల్ జాన్ బెనెట్ హరసే అక్కడికి వచ్చాడు. అతను వెంట చాలాపెద్ద సైన్యము ను తీసుక వచ్చాడు. జనరల్ యొక్క ఆజ్ఞ ను తిరస్కరించే ప్రతీఒక భారతీయ సైనికునిపై తూపాకీ గుండ్లు కురిపించమని బెదిరించాడు. అందువల్ల ఏమీ తెలియని అతని వెంట వచ్చిన సైనికులు ముందుకు వచ్చారు. చేతికి దొరికిన ఆయుధాలతో కొట్టుకోవడం ప్రారంభమైంది. రక్తపాతం జరుగుతుండింది.

అయితే అదేదో సాధారణ కొట్లాట కాదు. అది స్వాతంత్ర్యపు మొదటి పోరాటం. బ్రిటిష్ వార పట్ల నమ్మకంగా ఉన్న 600 మంది సైనికులు మరియు మంగల్ పాండేతో ఉన్న ఇరవై నలుగురు ఈ యుద్ధాన్ని సాయంకాలం అయ్యేసరికి ముగించారు. ఈశ్వరీప్రసాద్ మంగల్ పాండే సూచనల మేరకు మిగిలిన ఇరవై నాలుగు సహచరులను అడవిలోకి పంపించాడు.

చివరకు సాయంత్రం ఐదు గంటలకు మంగల్ పాండే మరియు ఈశ్వరీప్రసాద్‌ను బంధించారు మరియు రక్తంతో తడిసిన పాండే అయినప్పటికీ నిటారుగా నడుస్తూ బిగ్గరగా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. ఆయనను నామమాత్రంగా సైనిక హాస్పిటల్లో ఉంచారు మరియు ఏడు రోజుల కోర్ట్‌మార్షల్ నాటకం ఆడి మంగల్ పాండేను ఏప్రిల్ 8, 1857 నాడు వేలాది మంది ప్రజల సమక్షంలో ఉరి తీశారు మరియు ఈశ్వరీప్రసాద్‌ను ఏప్రిల్ 21 నాడు ఉరి తీశారు.

మిత్రులారా! మన భారతీయ స్వతంత్ర సంగ్రామం యొక్క మొట్టమొదటి ఈ రెండు బలిదానాలు, వీటిని స్మరించ కుండ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర ఆరంభం కానే కాదు.”


(కథ కొనసాగుతోంది)

मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments