ఈ మద్య లో గంగాధర రావు ఆరోగ్యం క్రమ క్రమంగా క్షీణిస్తుండింది. అందుకని ఆయన తన తమ్ముని యొక్క చిన్న కొడుకు అయిన దామోదర రావు ను దత్తత తీసుకున్నాడు. ఈ దత్తత కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకు గంగాధర రావు మరణించాడు. తన దుఃఖమును పక్కన పెట్టి కేవలం 15 రోజుల్లోనే రాణీ లక్ష్మీబాయి దత్తత పుత్రుడిని ఒడిలో ఉంచుకుని పరిపాలన చేస్తుండినది.
రాణీ లక్ష్మీ బాయి యొక్క శిక్షణ ముందే పూర్తి అయింది. గత ఐదు సంవత్సరాలలో పొందిన ప్రశిక్షణ మరియు వ్యావహారిక అనుభవాల కారణం గా పరిపాలన చేయడం చాలా సులభం అవుతుండినది. నిజానికి ఆమె పాలనలో ఝాన్సీ ప్రజలకు మొదటి సారిగ ఆనందంగా గడుస్తుండినది.
ఝాన్సీ రాణికి లభిస్తున్న ప్రజల మద్దతు, ప్రశంసలు మరియు దీవెనలు అక్కడి బ్రిటిష్ అధికారుల దృష్టికి వస్తుండింది. దాంతో వారు పై అధికారులకు ఫిర్యాదు కూడా పంపారు. అయితే ఆ పై అధికారులకు తమ సొంత గూఢచారుల ద్వారా ఒక సమాచారం అందింది రాణి లక్ష్మీబాయి ఉదయం, సాయంత్రం దైవ ప్రార్థనలు, జపం మరియు గుడికి వెళ్లడంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారని. ఆమె సామాన్య మహిళలను తరచుగా కలుస్తుంటారని, వారి ద్వారా కేవలం పేదలకు, అనాథలకు మరియు వికలాంగులకు మాత్రమే సహాయం చేస్తున్నారని, అందుకే ప్రజల్లో అంత మంచి పేరు వస్తోందని గూఢచారులు చెప్పారు. అంతేకాకుండా రాణి లక్ష్మీబాయి కంపెనీ ప్రభుత్వానికి విశ్వాసపాత్రురాలిగా ఉన్నారని సమాచారం ఇచ్చారు. ఇలాంటి సమాచారాన్ని అందించిన ఆ గూఢచారి మరెవరో కాదు, స్వయంగా దివాన్ రఘునాథ్ సింహుడే.
ఇలాంటి సమాచారంతో నిశ్చింతగా ఉన్న బ్రిటిష్ అధికారులు ధనసింహ గుర్జర్ స్థావరాల నుంచి లభించిన ఆధారాలతో ఉలిక్కిపడ్డారు. ధనసింహ గుర్జర్‌కు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆర్థిక సాయం చేసేవారని, ఝాన్సీకి చెందిన యాభై మంది పౌరులు కూడా ధనసింహతో కలిసి ఉన్నారని వారికి తెలిసింది.
దీంతో బ్రిటిష్ గవర్నర్ ఒక్కసారిగా మేల్కొని బ్రిటిష్ వైస్రాయ్‌కు ఈ వార్తను తెలియజేశారు. (ఆ కాలంలో ‘వైస్రాయ్’ అనే పదవి లేదు. కంపెనీ ప్రభుత్వ చీఫ్ అంటే గవర్నర్ జనరల్ నే వైస్రాయ్ గా భావించేవారు.)
ఈ సమాచారం అందగానే బ్రిటిష్ సైన్యంలోని ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ధనసింహ గుర్జర్ చేసిన శక్తివంతమైన పోరాటం మరియు ఆయన బలిదానం తర్వాత కంపెనీ ప్రభుత్వం మొత్తం 34,000 కొత్త
చట్టాలను రూపొందించింది. వాటిని చాలా కఠినంగా అమలు చేయడం ప్రారంభించింది.
బ్రిటిష్ ఉన్నతాధికారుల నుంచి ఝాన్సీ సంస్థానానికి ఒక లేఖ వచ్చింది రాజు చేసిన ఈ దత్తతను కంపెనీ ప్రభుత్వం అంగీకరించదు. బ్రిటిష్ అధికారులకు సరైన సహకారం అందించాలి, పూర్తి సమాచారాన్ని అధికారికంగా ఇవ్వాలి మరియు సంస్థానాన్ని కంపెనీ ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉండాలి.
రాణి లక్ష్మీబాయికి మరియు ఆమె ముఖ్య అనుచరులకు ఇది జరుగుతుందని ముందే ఊహ ఉంది. కానీ బ్రిటిష్ వారు ‘ఏ కారణాన్ని ముందుకు తెస్తారు’ అనే దానిపైనే సందిగ్ధం ఉండేది. దత్తత కారణాన్ని చూపి బ్రిటిష్ వారు హిందూ వైదిక ధర్మంలోని ధార్మిక నమ్మకాలను తిరస్కరించారు. ఝాన్సీ రాణీ మిక్కలి కుపితురాలైనది. ఇది వైదిక ధర్మంపై, భారతీయ సంస్థానాధీశుల అధికారంపై మరియు భారతీయుల జీవనశైలిపై జరిగిన కుటిల దాడి అని ఆమె గ్రహించారు.
దివాన్ రఘునాథ్ సింహా సహాయంతో ఆమె బ్రిటిష్ అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించారు. లాలాభావు బక్షిని దూతగా పంపారు. సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించారు. ఇదంతా జరుగుతున్నప్పుడు రాణి లక్ష్మీబాయి తన సమయాన్ని ఎక్కువగా దేవాలయాల్లో గడపడం మొదలుపెట్టారు. వివిధ గ్రామాల్లో రకరకాల మహాపూజలు ఏర్పాటు చేయించారు. వైదిక పఠనం, పురాణ కాలక్షేపాలు నిర్వహించారు.
ఇలాంటి ఆలయ సందర్శనలు, మహాపూజల సమయంలో ‘బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారు’ అన్న విషయాన్ని రాణి అనుచరులు ప్రజలకు పద్ధతిగా వివరించసాగారు. అదే సమయంలో దేశభక్తి ఉన్న ప్రజల నుంచి నిధిని సేకరించారు. రహస్యంగా పురణ్ సింగ్ కోరీ మరియు ఖుదాబక్ష్ రకరకాల ఆయుధాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు.
14 మే 1857న గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ దత్తతను చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ ఝాన్సీ సంస్థానాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారిక ఉత్తర్వులను రాణికి పంపారు. ఆ రాత్రే ఝాన్సీలోని భారతీయ సైనికులు నగరం నలుమూలలా బ్రిటిష్ అధికారులపై దాడులు చేసి వారిని అంతం చేశారు. ఒక్క బ్రిటిష్ అధికారి కూడా ప్రాణాలతో మిగలలేదు.
మేజర్ జనరల్ హ్యూజ్ రోజ్ కు ఇది కేవలం ‘సిపాయిల తిరుగుబాటు’ అని రాణి లక్ష్మీబాయి నమ్మబలికారు మరియు చర్చలు కొనసాగించారు. మేజర్ హ్యూజ్ రోజ్ నవంబర్, డిసెంబర్ 1857లో ఝాన్సీలోనే మకాం వేశారు. కానీ ఆయనకు గానీ, ఆయన గూఢచారులకు గానీ రాణి చేస్తున్న రహస్య కార్యకలాపాల గురించి
కనీసం సమాచారం అందలేదు. దీనికి కారణం రాణి లక్ష్మీబాయి ముందస్తు ప్రణాళిక మరియు ఆమె అనుచరుల అద్భుతమైన నిర్వహణ. దివాన్ రఘునాథ్ సింహ, లాలాభావు బక్షి, ఖుదాబక్ష్, పురణ్ సింగ్ కోరీ, ఝల్కారీబాయి, మోతీబాయి, ముందర్ బేగం, కమలకుమారి చౌహాన్ మరియు రాజకున్వర్ యాదవ్ అనే తొమ్మిది మంది బృందం రాణి ఆదేశాల మేరకు అత్యంత నిశ్శబ్దంగా పని చేసేవారు. దుర్గా దళ్ మరియు మహాదేవ శివ దళ్ దళాలు పద్ధతిగా పెరుగుతూ వచ్చాయి. మేజర్ జనరల్ హ్యూ రోస్ లార్డ్ డల్హౌసీని కలవడానికి ఝాన్సీ వెలుపలికి వెళ్లారు. ఆయన ప్రయాణంలో భాగంగా ఝాన్సీ పొరుగు దేశాల ద్రోహులు కొందరు వచ్చి ఆయన్ని కలిశారు. వారు రాణి శౌర్యాన్ని చూసి అసూయ పడేవారు. వారు హ్యూజ్ రోజ్ కు రాణి కార్యకలాపాల గురించి సవివరంగా చెప్పి కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు.
దీంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. లార్డ్ డల్హౌసీ దగ్గర రాణికి మద్దతుగా మాట్లాడాల్సిన మేజర్ జనరల్ హ్యూజ్ రోజ్, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండు నెలలు ఝాన్సీలో ఉన్నా తనకు ఏమీ తెలియలేదనే అహంకారం ఆయనను దెబ్బతీసింది. రాణికి గుణపాఠం చెప్పాలని, ఝాన్సీని నాశనం చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు.
అప్పటికే రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న నానాసాహెబ్ పీష్వాతో సంప్రదింపులు జరిపారు. పీష్వా ప్రతినిధి తాత్యా తోపే రెండుసార్లు ఝాన్సీకి వచ్చి వెళ్లారు. ఝాన్సీపై దాడి జరిగితే తాత్యా తోపే తన మూడు వేల మంది సైనికులతో సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
లార్డ్ డల్హౌసీ ఆదేశాల మేరకు మేజర్ జనరల్ హ్యూజ్ రోజ్ పదివేల మంది సైనికులతో 15 మార్చి 1858న ఝాన్సీపై దాడి చేశారు. భీకరమైన యుద్ధం మొదలైంది.
మేజర్ ఎరస్కిన్ ప్రధాన సేనాపతిగా ఉన్నారు. ఆయనతో పోరాడుతూనే లాలాభావు బక్షి మరియు దివాన్ రఘునాథ్ సింహ చర్చలు కొనసాగించారు. కానీ రాణి లక్ష్మీబాయి ఎక్కడా అజాగ్రత్తగా లేరు.
రాణి లక్ష్మీబాయికి చెందిన దుర్గా దళము కు చెందిన 3500 మంది వీరవనితలు నేరుగా మేజర్ ఎరస్కిన్ శిబిరంపై దాడి చేశారు. రాణి లక్ష్మీబాయి మరియు ఝల్కారీబాయి రెండు వైపుల నుండి వచ్చి దాడిచేసారు. బ్రిటిష్ వారి 4000 మంది సైనికులను హతమార్చి దుర్గా దళము తిరిగి వచ్చింది.”
(కథ కొనసాగుతుంది)




Comments
Post a Comment