జానకీబాయి ముందు నిర్ణయించుకున్న ప్రకారముగ ముంబై నుండి ప్రత్యేకంగా ఫకీర్ బాబాను అనగా శివరామరాజన్ ను కలువడానికి వచ్చింది. శివరామరాజన్ కు గత మూడు సంవత్సరాల నుండి జానకీబాయి బాగుగా తెలుసు. ఇలాంటి చిన్న వయసు గల యువతిలో తెలివి తేటలు, దృఢమైన నిర్ణయం తీసుకునే క్షమత, నిర్భయము, మరియు సంయమనం మొదలగు విషయాల అద్భుత సంగమం ను ( మేళవింపు) ను ఫకీర్ బాబా చాలా చక్కగ గ్రహించాడు. ఆయన పాదాలను తాకి నమస్కరిస్తున్న జానకీబాయి ని ఆశీర్వదిస్తు ఫకీర్ బాబా అన్నాడు,
"బిడ్డా! ఉత్తర భారతదేశం లోని అనేక ప్రాంతాల మహిళలు ఇప్పటికీ తలపై ఉండిన కొంగును ముఖం నిండ కప్పుకుని తిరుగుతుంటారు. పట్టణాలలో కూడ ఇదే పద్దతి కనబడుతుంది. అయితే ప్రధాన నగరాలలో ఉండే మంచి కుటుంబము లోని మహిళలలో కొంత వరకు ఆధునిక ప్రపంచం యొక్క ఉనికి యొక్క జ్ఞానము కలుగుతుందని అనిపిస్తుంది. ఆ మహిళలు స్వేచ్చగా తిరుగుతుండినారు. ఇంకా నేర్చుకొంటున్నారు. ఒకరకంగా ముంబై, పూణ ప్రాంతం లోని మహిళల యొక్క విద్య (చదువు) లో ఎంత ప్రగతి జరిగిందో, ఉత్తర భారత మహిళల లో అంత జరుగలేదు. అయినా కూడ ఎందరో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారులు, మరియు గవర్నమెంటు ఆఫీసర్ల యొక్క ఇంటి మహిళలు కొంగును పూర్తిగ ముఖం పై కప్పుకొనక కేవలం తలపైన కొంగు కప్పుకొని తిరుగు తుంటారు. వారిలో కొందరు మహిళలు, పూణ ముంబై లో ఉండిన వారి మాదిరి సామాజిక స్థాయి గల మహిళల మాదిరి, ఆధునిక వస్త్రధారణ, ఎడ్యుకేషన్ (చదువు) మరియు సామాజిక పరివర్తన వీటిలో క్రమ క్రమంగా ప్రగతి సాధస్తున్నారు.
అదేమాదిరి, మధ్య భారత, మరియు దక్షిణభారత మహిళలు కూడ విద్యావంతులు (ఎడ్యుకేట్) అవుతుండినారు. పట్టణాల లోని అనేక బడులలో బాలికలు వెళ్తుండినారు. కొన్ని కొన్ని చోట్ల మహిళల కొరకు విడిగా (ప్రత్యేక) స్కూల్స్ కూడ మొదలైనవి. అయితే ముంబై మరియు పూణ నగరాలలోని మహిళలు చాలా వేగంగా ముందుకు పోతున్నారు. ఇంకా స్వాతంత్య్ర ఉద్యమం లో కూడ పాలు పంచుకుంటున్నారు.
విద్రోహులకు గుణపాఠం నేర్పే పనిని చేస్తున్నప్పుడు గోప్యత (సీక్రెట్) పాటించడం, మరియు ఓర్పు వహించడం, మనకు చాలా ఎక్కువ అవసరము. ఇంకా మన ద్వారా చేయబడిన ఈ పని భవిష్యత్తు లో చరిత్ర లో నమోదు కూడ కాదు అని తెలుసుకునే పని మొదలు పెట్టాలి. మన ఈ పనిలో పాల్గొనిన పురుషులు కూడ సుస్పష్టంగా బ్రిటీష్ వారి యొక్క మేలు కొరకే పని చేసే వారిగ, బ్రిటీష్ వారని ముఖస్తుతి చేసేవారిగ, తయారై పొగరుగ గర్వంగా తిరుగవలసి వస్తుంది. ఎప్పుడైనా స్వాతంత్య్రం లభిస్తే అప్పుడు మనం దేశభక్తల లిస్టు లో ఉండము అనే జ్ఞానం మన గ్రూపులోని ప్రతీఒకరికి ఉండడం మిక్కలి అవసరము. నేను అక్కడ కూడ ఈ రకమైన వేరు వేరు వయసు గల పురుష కార్యకర్తలను ఎందరినో తయారు చేసాను. మరియు నా భార్య ఇలాంటి మహిళల ను మద్రాసు ప్రాంతంలో తయారు చేసింది.
"జానకీబాయి,! మీది మరియు రామచంద్రరావు గారి పని మాత్రం ఎంతో జోరుగా, ఉత్సాహంగా సాగుతోంది. మీయొక్క కొందరు ముఖ్య మహిళా కార్యకర్తలను కలవాలనే యోజన నీవు చేసావు. నీ సూచన నాకు అందింది. సభ ఎక్కడ మరియు ఏ విషయంపై అనేది నాకు తెలియదు. స్వయంగా నీవు ఇక్కడికే వచ్చావు, అంటే దానర్థం ఆ సభ ఇక్కడేనా?"
సమాధానం మల్హార రావు చెప్పాడు."అవును ముంబై, పూణ నగరాలలో ప్రస్తుత పరిస్థితి లో ప్రతీ ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి పై గట్టి నిఘా పెట్టబడుతున్నది. అందువల్ల ఈ పట్టణాలలో ఉండిన మహిళల యొక్క సామూహిక పసుపు-కుంకుమ ఉత్సవం (వేడుక). [ఈ ఉత్సవం లో మహిళలు ఒక చోట చేరి,] ఒకరికొకరు పసుపు-కుంకుమ ను పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇందులోని యజమాని మహిళ, ద్వార భోజన వ్యవస్థ కూడ చేయ బడుతుంది, మరియు కొన్ని కానుకలు కూడ ఇవ్వ బడతాయి. ఆ కారణంగ మహిళలు పరస్పరం కలువడం, మరియు మాట్లాడు కోవడం జరుగుతుంది. మహిళా విద్యా పరిషద్, విధవరాండ్లు, పతి పరిత్యక్త మహిళలు,(భర్తలచే వదిలివేయబడిన మహిళలు) కొరకు ఏర్పాటు చేయబడు నర్సింగ్, విద్యా సెంటర్, లేదా ఇలాంటి మహిళల కొరకు నడుప బడుతున్న కుట్టుపని కార్య శాలలు, వీటన్నిటి పై నిఘా పెట్ట బడుతుండినది. బ్రిటిష్ వారికి, ముంబై పూణ మరియు కలకత్తా తో ఎంత భయం ఉండిందో అంత భయం ఇతర ఏ ప్రాంతాల వల్ల ఉండేది కాదు. ఎందుకంటే చాలా మంది విప్లవ కారులు మరియు సశస్త్ర విద్రోహులు ఈ రెండు ప్రాంతాలలోనే ఉండినారు. పంజాబు కూడ మండుతున్నది, ఎందరో సిఖు యువకులు దేశం కొరకు ఎప్పుడైనా ప్రాణాలు ఇవ్వడానికి, సిద్ధంగా ఉండినారు. అయితే ఇలాంటి యువకులకే అవరోధములు కలుగుతుండినవి. ఆ అవరోధములను ఆపడం ఇదే మన పని.
ఫకీర్ బాబా! ఈ కారణం వల్ల నే బాగా ఆలోచించి సభను ఈ శివ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన ఒకే ఆలోచన గల వారందరు ఇక్కడ చేరడం ముందే ఆరంభం అయింది. వారందరు వార్కారి సంప్రదాయంకు చెందిన అనగా విఠలేశ్వరుని భక్తలు గా ఉండే మరాఠీ భాషీయులు ధరించే వేషం లో ఇక్కడికి వస్తుండినారు. ఇంకా రాబోతున్నారు.
మన ఈ శివ మందిరం నుండి గ్రామానికి పడమట సరిహద్దు బయట ఉన్న విఠల మందిరం లోకి ఒక సొరంగ మార్గం ఉంది. అక్కడ కూడ ఈ రకమైన రహస్య నిర్మాణం చేయబడి యుంది. మన ఏస్టేట్ మేనేజరు గోవింద దాజీ ఆ విఠల మందిర భక్తుల యొక్క ప్రముఖ భజనీ పరుడు. (భజన చేసే ప్రముఖ వ్యక్తి). ప్రతీఒక ప్రతినిధి తో మిమ్ములను పరిచయం చేయించే పనిని గోవింద దాజీ మరియు జానకీ బాయి చేస్తారు. ఇక మీరు మనసు విప్పి అంతా చెప్పండి. దేశమంతా తిరిగి మీరు ఏదైతే చూసారో, ఏదైతే మీరు రహస్య సమాచారం సంపాదించారో వాటి గురించి అంతా చెప్పండి.
సొరంగ మార్గం ద్వార ఆ ముగ్గురు విఠల మందిరం చేరారు. అక్కడ నామ సప్తాహం యొక్క తయారీ పటిష్టంగా జరుగు తుండినది. వాస్తవానికి ప్యాంటు శర్టు లాంటి డ్రెస్ (దుస్తులు) ధరించి తిరిగే గోవిందదాజీ ఈ రోజు ఇక్కడ ధోవతీ లాల్చీ మెడలో వీణ మరియు తులసీ మాల, నుదుటిపై కస్తూరి తిలకం, పెట్టుకుని, మరియు చేతిలో చిరుతలు ఇలాంటి వేషం లో అంతటా కలయతిరుగుతున్నాడు.
క్షణం సేపు ఫకీర్ బాబా కూడ గోవింద దాజీ నీ గుర్తు పట్టలేక పోయాడు. నిజానికి గోవిందదాజీ మరియు శివరామరాజన్ మధ్య నిజమైన స్నేహం ఉండింది. ఫకీర్ బాబా నోటితో కబీర్ పంథా యొక్క సంప్రదాయం ననుసరించి నిరంతరం రామనామం జపిస్తూ ఉండేవాడు. మరి గోవిందదాజీ వార్కారీ పంథా సంప్రదాయం ననుసరించి నిరంతరం విఠల నామం జపిస్తు ఉండేవాడు.
సాయంత్రం భోజనం అయిన తర్వాత గ్రామం యొక్క రివాజు (పద్దతి) ప్రకారం భక్తులు, స్త్రీలు పురుషులు, గోవిందదాజీ యొక్క కీర్తనలో పాల్గొనడానికి, గుమి గూడుతుండినారు. అందులో 30% ప్రజలు ఎలా ఉన్నారంటే వారిలో భారత్ ను స్వతంత్రం చేయాలనే రక్తం ఉరకలేస్తుండింది. ముఖ్య విషయం ఏమంటే గోవిందదాజీ యొక్క పరిచయం కూడ వీరిలో చాలా మందికి జానకీబాయి నే చేయించింది. ఇలాంటి కలయికల కొరకు ఏర్పాట్లు ఈ విఠల మందిరం లో భక్తుల యొక్క జన సమ్మర్థం ఉన్నా కూడ చేయబడుతు ఉండినవి. అక్కడ విఠల మందిరం యొక్క గర్భగుడిని ఆనుకుని సంస్కృతం, వేదపఠనం యొక్క పాఠశాలలు ఉండినవి. మరియు ప్రధానంగా మౌనంగా మరియు ధ్యానం చేయడానికి గదులు కూడ ఉండినవి. ఈ గదులలోనే అన్ని రహస్య కలయికలు జరిగాయి.
గోవిందదాజీ "జయ జయ రామకృష్ణ హరి " సంత శ్రేష్ఠ జగద్గురు తుకారంజీ మహారాజు యొక్క దివ్య మంత్ర జపంతో కథను ప్రారంభించాడు. ప్రజల పై అత్యాచారాలు చేస్తున్న రావణుని కథలతో ఆరంభం అయింది. రావణుడు మోసంతో కుబేరుని రాజ్యమును జయించి అక్కడ ఉండిన వైదిక ధర్మమును ఎలా అణచి వేసాడో మరియు సాధు సంతులను చంపాడో వీటి గురించి వర్ణన చేయబడుతు ఉండినది. కీర్తనలోని ‘శ్రీరంగం’ (కథా భాగం) ముగిసి, ‘ఉత్తరరంగం’ ప్రారంభమైంది. ప్రభు శ్రీరామ చంద్రుని అవతరణ ఉద్దేశ్యం వివరిస్తున్నాడు.
చివరగా "రామలక్ష్మణ జానికీ - జయ బోలో హనుమాన్ కీ " ఈ మంత్రం జోరుగా ఉత్సాహంగా ఆరంభమైంది. కీర్తనలో లీనమైన భక్తులకు గజ్జెల చప్పుడు, మృదంగ ధ్వని ఇవి తప్ప ఇంకేమీ వినపడడం లేదు.
కీర్తన కొరకు సరిగ్గా ప్రవేశ ద్వారం వద్దనే నడుము వంగిన ఒక ముసలి వ్యక్తి కూర్చుండి, దగ్గుతూ దగ్గుతూ కర్ర ఊతంగా మెల్లగ బయటకు వచ్చాడు. ఇంకా ఆ చీకటిలో ఆ ముసలి వ్యక్తి తో ఒక మహిళ వచ్చి కలిసింది.
ఎప్పటిలాగే కీర్తన ముగిసే సమయంలో తమ శానాన్ని చూపించడానికి, సమీపంలోని పెద్ద గ్రామంలో నివసించే ఒక పేఢీ యజమాని మరియు అతని భారతీయ పోలీస్ అధికారిగా ఉన్న సోదరుడు తమ గుర్రాల బండిపై ఆలయ ప్రాంగణంలోకి దిగుతున్నారు.
దిగిన వెంటనే, వారు ఇద్దరూ పొట్టలు చీలిపోయిన స్థితిలో మృతదేహాలుగా కనిపించారు. ఆ వృద్ధుడు మరియు ఆ మరల ఒకసారి ప్రశాంతంగా లోపలికి వచ్చి భజన చేస్తుండినారు. అదే సమయంలో ఆ గుర్రాల బండి గాడివాడు (బండి నడిపేవాడు) “దోపిడీ జరిగింది! మా యజమానిని కాపాడండి!”
అని కేకలు వేస్తూ అరుస్తున్నాడు. అలా అరుస్తూ అరుస్తూనే, ‘వారు ఇద్దరూ ఖచ్చితంగా మరణించారు’ అనే విషయాన్ని అతడు నిర్ధారించుకున్నాడు.
ఆలయంలో జయఘోషం వినిపించింది — “పంఢరీనాథ్ మహారాజ్‌కు జయ”. అది పరస్పరం ఒకరికి ఒకరు చేసిన సంకేతం.
( ఇంకా ఉంది)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment