మందిరం లో ఉన్న మొగవారు అక్కడ ఉన్న స్త్రీలను మందిరం లోనే ఉండమని బలవంతంగా చెప్పి వేగంగా బయటకు వచ్చారు అంతా గందరగోళం గా ఉండింది. మరణించిన ఆ ఇద్దరు ఆఫీసర్ల భార్యలు మరియు ఇతర బంధువులు బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టారు. వారిని ఇతర మహిళలు ఓదార్చుతున్నారు.
కొద్దిసేపట్లోనే ధారాపుర్ పోలీస్ స్టేషన్ యొక్క అధికారులు మరియు సిపాయిలు వచ్చారు. పోలీసులు తమ పద్దతి ప్రకారం చట్టబద్దంగా ఎంక్వయిరీ మొదలు పెట్టారు. దాంతో చూడడానికి వచ్చిన జనం మెల్ల మెల్లగ జారుకుంటున్నారు.
కోచ్( టాంగా నడిపేవాడు) ఎలా మరియు ఏమి జరిగింది అంతా వివరంగా చెబుతున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారము నలుగురు ఐదుగురు బలంగా ఎత్తుగా ఉన్న మొగవారి గుంపు బండి ఆగగానే ముందుకు వచ్చి ఇద్దరు యజమానుల నుండి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బును ఇవ్వమని అడిగారు. ఆ ఇద్దరు యజమానులు వారిని కొడుతూ కేకలు వేస్తుండినారు. బహుశ ఈ కారణంగా దొంగలు ఆ ఇద్దరిని కత్తులతో పొడిచి, వారి శరీరాల మీద ఉండిన బంగారం మరియు డబ్బు తీసుకుని పారిపోయినారు.
సీనియర్ పోలీసు ఆఫీసరు ఆ కోచ్ యొక్క మెడ పట్టుకుని అడిగాడు " అరే! మరి నీవు ఏమి చేస్తున్నావు? నీకైతే ఎలాంటి గాయం కాలేదు కదా? నిజం చెప్పు, నీవు కూడ వారితో కలిసి యున్నావా?
అదే గ్రామంలో ఉంటున్న అనగా ధారాపూర్ నివాసస్తులైన ఇద్దరు పోలీసు సిపాయిలు అన్నారు,"సాబ్! ఇతని శరీరం ను చూడండి. పూర్తిగ బక్కచిక్కి బలహీనంగా ఉన్నాడు. ఇతనిని గ్రామంలో అందరూ (డర్పోక్) పిరికివాడు అని పిలుస్తారు. ఇతను ఒకటో నెంబర్ పిరికి సన్యాసి. ఇతను దేనికి భయపడడు అని అడగండి, ఎలుకను చూసి భయపడతాడు, కుక్కలకు భయపడతాడు. కొమ్ములున్న ఆవులు, గేదెలకే కాదు,పెద్ద పెద్ద మేకలకు కూడ భయపడతాడు. దూరంగా పాము కనబడితే కూడ అరుస్తుంటాడు. అలాంటి ఇతను దొంగలకు సహాయం చేస్తాడా?
ఇతని తల్లిదండ్రులు లేరు మరణించారు. ఈ అనాథ బాలుడిని ఇపుడు హత్య జరిగిన ఈ మన పోలీసు ఆఫీసరు సాబ్ పని కొరకు పెట్టుకున్నాడు. వారి ఇంటి వరండాలోనే ఉంటాడు. ఇతని తండ్రి కూడ గుర్రాలను మేపేవాడు. అందువల్ల ఇతను కేవలం గుర్రాలకు భయపడడు."
ఈ సమాచారం విని సీనియర్ పోలీసు ఆఫీసరు కొంచం మెత్త బడ్డాడు. ఏరా అబ్బాయి,! ఎప్పటి నుండి ఈ సాహబ్ దగ్గర పని చేస్తున్నావు? మరి ఆ దొంగలలో ఎవరినైన గుర్తు పడతావా?
ఆ కోచ్ చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చుంటూ అన్నాడు "సాబ్! నేను యజమాని యొక్క అత్త గారి ఊరిలో ఉండేవాడిని. ఇతని మామ గారు, నన్ను సిఫారిస్ చేసి, వీరి వద్ద కు పంపాడు. గత 3 సంవత్సరాల నుండి నేను వీరి గుర్రపు బండిని నడుపుతున్నాను. మరియు గుర్రమును సంరక్షణ చేస్తాను.
సాహబ్ ఒకటేమో చీకటిగా ఉండింది. అందులో ఆ దొంగల ముఖాలు చిన్న గొంగడితో సగము వరకు (ముసుగు) కప్పబడి యున్నందున, సరిగా చూడలేక పోయాను. కాని ఎవరు కూడ పరిచయం ఉన్న
వారిలాగ అనిపించ లేదు కాని ఎవరైతే నన్ను తన్నినాడో ఆ దొంగ కాలుకు చాలా పెద్ద కడియం ఉండింది. ఇలా కాలుకు దరించ బడిన లావైన కడియం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు.
ఇంకా చాలా అడగడం జరిగింది పోలీసు ఆఫీసర్లకు ఆ వచ్చిన దొంగలు వేరే ప్రాంతం వారు అయి ఉండవచ్చు అని నమ్మకం కలిగింది. వారు శవాలను పరీక్షించి రిపోర్టు వ్రాసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న పెద్ద మనుషుల సాక్షం తీసుకున్నారు. ఎవరికి కూడ ఏమీ తెలియదు. అందరు కేవలం కోచ్ అరుపులు విన్నారు మందిరం బయటకు వచ్చినపుడు ఆ శవాలను చూసారు.
చనిపోయిన పోలీసు ఆఫీసరు భార్య కూడ ఏడుస్తూ ఏడుస్తూ అన్నది, "ఈ వ్యక్థి మా పుట్టింట్లో గుర్రాల పని చూసేవాడు. అతను చాలా ప్రేమామయుడు, మరియు నిజాయితీ పరుడు. అతను సాహెబ్‌పై దాడి చేయడు."
మెల్ల మెల్లగ జనాలు అందరు చెల్లాచెదరు అయినారు. పోలీసు అధికారులు మరియు సిపాయిలు వెళ్ళిపోయారు. రెండు శవాలకు చట్టపరమైన పంచనామ చేసిన తర్వాత బంధువులకు అప్ప గించారు. మందిర ప్రాంగణంలో కేవలం గ్రామంలోని కొందరు పెద్దమనుషులు, ప్రతిష్ఠిత వ్యక్తులు మరియు మందిరం కు ఎప్పుడూ వచ్చే భజనీ మండలీ సభ్యులు ఆగినారు.
మల్హారరావు గ్రామ పండితుడని అడిగాడు, " మన ఈ పవిత్ర మందిర ప్రాంగణం లో ఇలా హత్య జరిగింది, మేము వార్కారీ సంప్రదాయికులము. మేము మాంసాహారం కూడ చేయము మరి ఇప్పుడు ఈ స్థలం శుద్దీకరణ చేయవలసిందే కదా! ? ఈ ప్రశ్న నిజానికి అక్కడ ఉన్న ప్రతీఒకరి మనసులో కలిగింది.
పండితుడు మినుకు మినుకు మని వెలుగుతున్న దీపాల వెలుతురులో పంచాంగం తిరుగ వేస్తూ అన్నాడు " మల్హార రావు ముహూర్తం కూడ బాగులేదు. నక్షత్రం ఇంకా బాగులేదు. కనుక శుద్దీకరణ మరియు శాంతి కూడ చేయవలసిందే. ఈ ఆవరణలోనే అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ నాలుగు వైపులా మండపం నిర్మించాలి. ‘ఎవరి అశుభ ఛాయ కూడా పడకూడదు’ కాబట్టి మండపం చుట్టూ నాలుగు వైపులా మందమైన గుడారపు వస్త్రాన్ని కట్టాలి. అలాగే ఈ మండపంలోకి ఎంచుకున్న కొద్ది మందికే వచ్చి వెళ్లేందుకు అనుమతి ఉండాలి.” ఉపాధ్యాయజీ అవసరమైన సామాగ్రి యొక్క చాలా పెద్ద జాబితాను (లిస్ట్‌ను) తయారు చేసి ఇచ్చారు.
ఉపాధ్యాయజీ మరియు మల్హార రావు కలిసి గ్రామంలోని ఆసక్తి గలవారిని ఈ పని కొరకు ఎంపిక చేసారు. ముఖ్యంగా వారు మందిర ప్రాంగణము నుండి బయటకు పోవడానికి అనుమతి లేకుండింది.
ఫడకే మాస్టరు రెండు చేతులు జోడించి, భగవంతునిని స్మరిస్తూ అన్నాడు,"ఇది స్వయంభగవాన్ కృప తోనే జరుగగలదు. నా సంగతి పక్కన పెట్టండి. ఇద్దరు సోదరులు వచ్చారు, ఈ సమాచారం తెలియగానే జానకీబాయి ఎంతో వేగంగా పశువుల కాపరి యొక్క గొంగడి కప్పుకొని, నాతో పాటు చేరింది. ఇది ఆశ్చర్య కరమైన విషయమే. ఆమే ఆ దుర్మార్గపు పోలీసు ఆఫీసరు పై గొడ్డలి తో దెబ్బ వేసింది.
మల్హార రావు కుతూహలము తో తన ప్రియమైన కోడలు వైపు చూస్తూ అన్నాడు," బిడ్డా! నీవు నిజంగా రణరాగిణివి. (యుద్ధం లో పరాక్రమం చూపేదానివి.) ఈ ఇద్దరు దుర్మార్గ సోదరులు మన జిల్లా లోని ఎందరో దేశభక్తులకు అనేక యాతనలు బాధలు కలిగించారు. ఆ వ్యాపారి పోలీసులకు రహస్య వార్తలు చేరవేసేవాడు. మరియు స్వతంత్ర సేనానులను పట్టిచ్చేవాడు. ఆ పోలీసు ఆఫీసరు వారందరికి ఆనేక బాధలు అపారమైన యాతనలు పెట్టేవారు. అది కూడ జనాల ముందర చేసేవారు. అందువల్ల ప్రచండ భయం నిర్మాణం అయింది.
"ప్రభు రామచంద్రునికి జయము" అని చెప్పి ఫకీర్ బాబా మిక్కిలి ఆవేశం తో అన్నాడు, "ఇక్కడ భయం తొలగిపోయింది. జానకీబాయి కార్యారంభం చేసింది. అందులో ఆమెకు మహాదేవరావు ఫడకే సహాయం చేసాడు. మరి రామచంద్ర రావు మొత్తం యోజన తయారు చేసాడు. “రాముడు, జానకి మరియు శివుడు వీరు ముగ్గురు ఒకేసారి కలిసివస్తే అశుభం తప్పకుండా నశిస్తుంది.”
( ఇంకా ఉంది)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Comments
Post a Comment