రక్షకుడు కేవలం బాపు మాత్రమే! - ఛాయావీరా బ్రహ్మె, వడోదర

రక్షకుడు కేవలం బాపు మాత్రమే! - ఛాయావీరా బ్రహ్మె, వడోదర

పరమపూజ్య బాపు సన్నిధికి వచ్చిన తర్వాత మాకు అడుగడుగునా ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయంటే, మా బాధ్యత అంతా బాపునే మోస్తున్నారనే నమ్మకం కలుగుతుంది. అలాగే ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారనే విషయం కూడా మనకు అడుగడుగునా అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి అందమైన అనుభవాల వల్లే మాలాంటి సాధారణ భక్తులకు బాపు మీద నమ్మకం మరింత బలపడుతూ ఉంటుంది. అలాంటి ఒక అనుభవమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.

నేను ప్రభుత్వ ఆరోగ్య పరిచారికా విభాగంలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాను. నా కింద చాలా మంది నర్సెస్ ఉన్నారు, వాళ్ళు వేర్వేరు గ్రామాల్లో పని చేస్తున్నారు. నా పని వాళ్ళ పనిని పర్యవేక్షించడం. బరోడా తాలూకాలో ‘కరచియా’ అనే ఒక గ్రామం ఉంది, అది అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ దగ్గర ఉంది. ఇది ఒక ఫ్లాగ్ స్టేషన్ కూడా, ఇక్కడి నుంచే బండ్లకు (ట్రైన్స్ కు) ఎరుపు ఆకుపచ్చ సిగ్నల్స్ ఇస్తారు. రైల్వేవి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడానికి ట్రాక్స్ విడిపోతాయి. బండ్లను బట్టి ట్రాక్స్ మారుస్తూ ఉంటారు. దాదాపు 60 బండ్లు ఈ ట్రాక్ మీదగా రోజూ పాస్ అవుతూ ఉంటాయి.

ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్న రోజులు అవి. మధ్యాహ్నం ఒంటిగంట అయింది. కరచియా గ్రామంలో డిసెంట్రీ మరియు డీహైడ్రేషన్ వల్ల చాలా మంది జబ్బు పడ్డారని నాకు సమాచారం వచ్చింది.

అలా ఏదైనా కాల్ వస్తే నేను వెళ్లాల్సిందే. మా వారు రిటైర్డ్ అవ్వడం వల్ల రోజూ స్కూటీ తీసుకుని నన్ను దింపడానికి, తీసుకురావడానికి వస్తుంటారు.

ఆ రోజు కూడా ఈ కబురు రాగానే నేను వెంటనే ఆయనను వెంటబెట్టుకుని కరచియా గ్రామానికి బయలుదేరాను. రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రెండు ట్రాక్స్ మధ్యలో మా స్కూటీ ఇరుక్కుపోయింది మరియు స్కూటీతో పాటు మేమిద్దరం కింద పడిపోయాము!

మేము స్కూటీకి, ట్రాక్‌కి మధ్య విచిత్రంగా ఇరుక్కుపోయి నలిగిపోయాము. మధ్యాహ్నం పూట కావడంతో జనాల రాకపోకలు కూడా లేవు. నేను పూర్తిగా స్కూటీ కిందకు వెళ్లిపోయాను, ఆయన కాళ్ళు స్కూటీ కింద ఇరుక్కుపోవడంతో ఆయన లేవలేకపోయారు.

మేము సహాయం కోసం అరుస్తున్నాము, కానీ ఎవరూ వినడం లేదు. అంతలో దూరంగా ఒక ట్రైన్ రావడం కనిపించింది. అది చూసి మా కళ్ల ముందు చీకట్లు కమ్మాయి! ట్రైన్ కూత వినగానే, ‘ఇక మృత్యువు దగ్గరపడింది’ అని మాకు అర్థమైపోయింది. ఇక అంతా అయిపోయింది అని మాకు అనిపించింది.

ట్రైన్ మాకు కొద్ది దూరంలోనే ఉండుంటుంది, ఇక కొన్ని సెకండ్లలోనే అంతా ముగిసిపోతుంది, బాపు....బాపు....బాపు మా మనసులో వేరే మాటే లేదు. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఒక మనిషి ఎక్కడినుంచో మా దగ్గరకు వచ్చాడు, ఒక్కదుటున మమ్మల్నిద్దర్నీ నిలబెట్టాడు. మేము హడావిడిగా స్కూటీతో సహా ట్రాక్‌కి అవతలి వైపుకు చేరుకున్నాము, అంతలోనే ట్రైన్ మా పక్కనుంచి ధడధడలాడుతూ వెళ్ళిపోయింది! కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో మా చావు తప్పింది. ఎలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి ఆ సద్గురుతత్వం మమ్మల్ని అవలీలగా బయటకు లాగిందో తలచుకుంటేనే మా ఒళ్ళు జలదరించింది.

ఎలాగోలా మమ్మల్ని మేము కూడదీసుకుని చేతులు, కాళ్ళ మీద ఉన్న దుమ్ము దులుపుకున్నాము మరియు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ రుమాలు కట్టుకున్నాము. ఆ తర్వాత మేము స్కూటీ స్టార్ట్ చేసి చూశాము, అది కూడా వెంటనే స్టార్ట్ అయింది. మేము వెంటనే అక్కడినుంచి బయలుదేరాము.

....అంతలోనే మాకు, మృత్యువుకు మధ్య నిలబడిన ‘ఆ’ మనిషి గుర్తుకొచ్చాడు.

వెనక్కి తిరిగి అతన్ని చూద్దామని ప్రయత్నించాము, కానీ ఎవరూ కనిపించలేదు! అక్కడ చుట్టుపక్కలే కాదు కదా, చాలా దూరం వరకు కూడా ఎవరూ కనిపించడం లేదు. ఈ ప్రాణాపాయ సంకటం నుంచి మమ్మల్ని కాపాడటానికి ఎవరు వచ్చారో అప్పుడు మాకు జ్ఞానోదయం అయింది. ఆ మనిషి ఎవరైనా సరే, మాకైతే ఆయనే మా బాపు!

ఈ రోజుకీ ఆ ఘటనను గుర్తుచేసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది మరియు ఎదురుగా ట్రైన్ వస్తుండగా, స్కూటీ కింద ఇద్దరు ఇరుక్కుపోయి ఉండటం చూసి, క్షణాల్లో స్కూటీతో పాటు ఇద్దరినీ కాపాడిన ‘అతను’ ఎవరై ఉంటారు? అనే ఆలోచన మనసులో మెదులుతుంది. మాకు నవజీవనం ప్రసాదించింది మా బాపు మాత్రమే, ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు.

అందరినీ రక్షించే మరియు రక్షకుడైన బాపుకు కోటి కోటి వందనాలు!!!

Hindi English

Comments