సద్గురు అనిరుద్ధ మా ఏకైక తారణహారుడు - డా. రాజశ్రీవీరా దేశ్‌ముఖ్, వడుజ్, సతారా

సద్గురు అనిరుద్ధ మా ఏకైక తారణహారుడు  - డా. రాజశ్రీవీరా దేశ్‌ముఖ్, వడుజ్, సతారా

ఈ శ్రద్ధావంతురాలి భర్త కారు ఒక భయంకరమైన ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైపోయింది, కానీ ఆయన శరీరానికి చిన్న గీత కూడా పడలేదు. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ రోజు ఇంటి నుంచి బయటకు బయలుదేరేటప్పుడు ఆయన ఉది పెట్టుకోవడం మర్చిపోయారు. కానీ సమయానికి ఆయనకు అది గుర్తుకు వచ్చి, తిరిగి వెనక్కి వెళ్లి ఉది పెట్టుకుని, ఆ తరువాతనే ఇంటి బయటకు వెళ్లారు.
-----------------------------------------
హరి ఓం. నేను గత రెండున్నర సంవత్సరాలుగా వడూజ్ ఉపాసనా కేంద్రానికి నిత్యనియమంగా వెళ్తున్నాను. దైనందిన జీవితంలో బాపుగారి అనుభవాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ నా భర్తకు జనవరి 7వ తేదీన వచ్చిన అనుభవాన్ని మాత్రం నేను ప్రత్యేకంగా అందరికీ తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను.
నా భర్త కూడా డాక్టర్‌నే, ఆయన ఖటావ్‌లో తన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం, జనవరి 7వ తేదీన ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు నా భర్త ఎప్పటిలాగే ఓపీడీకి వెళ్లేందుకు బయలుదేరారు. వడూజ్‌ను దాటి కేవలం 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనే రోడ్డుపనులు జరుగుతున్నాయి. నా భర్త మా స్విఫ్ట్ డిజైర్ కారును నడుపుతున్నారు. రోడ్డుపనులు జరుగుతున్న ప్రాంతంలో అకస్మాత్తుగా మా కారు జారిపోయింది. ఆయన బ్రేక్ వేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ కారు అదుపు తప్పిపోయింది. ఆ తరువాత ఏమి జరుగుతుందో ఆయనకు అసలు అర్థం కాలేదు. ఆయన కళ్లముందు చీకటి కమ్ముకుంది, కానీ కారు ఎన్నోసార్లు పల్టీలు కొట్టిందని, అలాగే బెరడు ఊడిపోయిన రెండు చెట్ల మధ్య నుండి 8-10 అడుగుల ఎత్తులో విమానంలా ఎగిరిపోయిందని మాత్రం ఆయనకు గుర్తుంది.
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా నా భర్తకు చిన్న గీత కూడా పడలేదు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయింది. కారులో మిగిలింది కేవలం నా భర్త కూర్చున్న సీటు, కారులో ఉన్న బాపుగారి ఫోటో, అలాగే గణపతి ఫోటో మాత్రమే. కారులోని అన్ని అద్దాలు పగిలిపోయాయి, కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. స్టీరింగ్ వీల్ తన స్థానంనుంచి జారిపోయింది, టైర్లు కూడా పేలిపోయాయి. చెప్పాలంటే కారులో ఇంకేమీ మిగలలేదు. కారు వెనుక అద్దం దగ్గర, అంటే బాపుగారి జప స్టికర్ వేసిన చోటునుంచి నా భర్త బయటకు వచ్చారు. బయటకు రాగానే, ఆయనకు బాగా పరిచయమైన ఒక వ్యక్తి తన కారుతో ఆయన ఎదురుగానే నిలబడి ఉన్నాడు.
ఏం జరిగిందో అది మా అవగాహనకు అందని విషయం. ఇంత పెద్ద ప్రమాదం నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడటం, అలాగే అకస్మాత్తుగా పరిచయమైన వ్యక్తి ఎదురుగా వచ్చి సహాయం చేయడం, ఇది అంతా ఆ సద్గురువుల కృప. బాపు నా భర్తకు అంతటి సామర్థ్యం ఇచ్చారు కాబట్టి, ఆ పరిస్థితిలో కూడా ఆయన కారులోని పేపర్లు తీసుకోవాలనే స్పృహతో వ్యవహరించగలిగారు. ఆ పరిచయమైన వ్యక్తి కారులో నా భర్త వడూజ్‌కు వచ్చారు. కేవలం జాగ్రత్త కోసం సీటీ స్కాన్, సోనోగ్రఫీ మరియు ఇతర పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు పూర్తిగా బాగానే వచ్చాయి. ఇంత జరిగినా, నా భర్త శరీరం నుంచి ఒక్క రక్తపు చుక్క కూడా బయటకు రాలేదు.
ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులకు కూడా ఈ కారు రెండు చెట్ల మధ్య నుండి ఎలా వెళ్లిందో అన్న ప్రశ్న కలిగింది. . అది అసలు అసాధ్యమైన విషయం. కారు పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరూ, “ఇంత భయంకరమైన ప్రమాదంలో కారులో ఉన్నవారు నిజంగా బ్రతికారా?” అని ఆశ్చర్యపోతూ అడిగేవారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక్క బాపుకే సాధ్యం.
ఇంటి బయటకు వెళ్లేటప్పుడు మేమంతా ఉది పెట్టుకునే అలవాటు ఉంది. కానీ ప్రమాదం జరిగిన ఆ రోజునే నా భర్త ఉది పెట్టుకోవడం మర్చిపోయారు. అయితే మళ్లీ గడపలోపలికి వచ్చి ఉది పెట్టుకుని తర్వాతే బయటకు వెళ్లారు. ఆ ఉదీయే ఆయన్ని కాపాడిందని నా నమ్మకం.
ఈ ప్రమాదానికి 15 రోజుల ముందే, నేను నా ఓపీడీ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఆకులు కదిలిన శబ్దం వినిపించింది. నేను అప్పటికే ఉది పెట్టుకున్నాను. నా మనసులో “అరే, పాము ఏమో?” అన్న ఆలోచన వచ్చేసరికి, మొత్తం దారినీ ఆక్రమించిన ఒక పెద్ద ధామణ పాము నా నుండి కేవలం ఒక అడుగు దూరంలో పడగ ఎత్తి నిలబడి ఉంది. అది ఎలా అకస్మాత్తుగా వచ్చిందో, అలాగే మరో వైపు నుంచి వెంటనే వెళ్లిపోయింది.
నా మీద, మా మిస్టర్ మీద గండం వచ్చింది. కానీ బాపు ఆ కాలం కంటే ముందే మా రక్షణ కోసం సిద్ధంగా ఉన్నారు. గండం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. కాలాన్ని కూడా వెనక్కి నెట్టేది ఒక్క బాపు మాత్రమే. ఆయన ప్రమాదం జరిగిందని ఫోన్ చేయగానే నేను "బాపు" అని గట్టిగా అరిచి బాపు ఫోటోకి నమస్కరించి ఆయన మీద మొత్తం భారం వేశాను.
చాలా చాలా అంబజ్ఞ బాపు, మీరు తప్ప ఇది ఎవరూ చేయలేరు.
హరి ఓం శ్రీరామ్ అంబజ్ఞ
నాథసంవిధ్

Comments