సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గారు 2013లో తన ప్రవచనంలో శ్రద్ధావంతులు అందరి శ్రేయస్సు కోసం స్వస్తిక్షేమ సంవాదం అనే సంకల్పాన్ని శ్రద్ధావంతులందరి సమక్షంలో ప్రవేశపెట్టారు.
ఇందులో ప్రతి శ్రద్ధావంతులు చండికాకులంలోని ఏ సభ్యునితోనైనా సంభాషించవచ్చు. శ్రద్ధావంతులు మనసులోని భావాలు, ఆలోచనలు లేదా అతను చెప్పదలుచుకున్నది ఆ సభ్యుల సమక్షంలో అతడు వ్యక్తపరచవలెను.
స్వస్తిక్షేమ సంవాదం అంటే ఏమిటి?
ప్రతి వ్యక్తి తన మనసులోని ఏ విషయాన్నైనా ఈ చండికాకులం లోని ఏ సభ్యుడితోనైనా మాట్లాడవచ్చు. మనం మాట్లాడుతున్నది, అమ్మ భగవతి తప్పకుండా వింటుంది అనే పూర్తి నమ్మకం మన మనసులో ఉండాలి.
మనసులో ఏం మాట్లాడితే అదే వినబడుతుంది. ఇది ఒక సంభాషణ. మనసులోని విషయం వారి వరకు చేరినప్పుడు, వారి విషయం (సందేశం) ప్రాణమయ సంభాషణతో, ప్రాణాల కంపనాలతో (Vibrations) మన ప్రాణాలతో అనుసంధానించబడుతుంది.
ప్రతి ఒక్కరికి మనసు మారాలని అనిపిస్తుంది, కానీ ఇది మానవుడికి కష్టం. 'స్వస్తిక్షేమ సంవాదం' (Swastikshema Samvadam) ద్వారా మనం కర్మ స్వాతంత్ర్యాన్ని సక్రమంగా ఉపయోగించి మనసులో తగిన మార్పులు తీసుకురావచ్చు.
'స్వస్తిక్షేమ సంవాదం' (Swastikshema Samvadam) అనేది దివ్య చండికాకులం (Divine Chandikakul) తో చేసే సంభాషణ అని మన సద్గురు అనిరుద్ధ బాపు గారు 'పితృవచనం' లో చెప్పారు, ఇది మీరు ఈ వీడియోలో చూడవచ్చు.
స్వస్తిక్షేమ సంవాదం ఎలా చేయాలి?
మొదటగా బాపూవారి స్వరంలో క్రింది జపం చేయబడుతుంది. అప్పుడు స్వస్తిక్షేమ సంవాదం ప్రారంభం అవుతుంది.
"సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే|
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే||"
తదుపరి కనీసం 5 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఆ సమయంలో ప్రతి శ్రద్ధావంతుడు కళ్లను మూసుకొని, తాను నిజంగా చండికాకులం ముందు కూర్చుని ఉన్నాడని భావిస్తూ, అర్థం చేసుకొని, చండికాకులంలోని ఏ సభ్యుడితోనైనా లేదా అందరితో కలసి తనకు నచ్చిన విధంగా సంభాషణ జరపవలెను. ఈ సమయం పూర్తైన తర్వాత బాపూవారి స్వరంలో మాతృవాత్సల్య ఉపనిషత్తులోని ఈ శ్లోకం ప్రసారమవుతుంది.
"నమః సర్వశుభంకరే| నమః బ్రహ్మత్రిపురసుందరి|
శరణ్యే చండికే దుర్గే| ప్రసీద పరమేశ్వరీ||"
స్వస్తిక్షేమ సంవాదం ఎక్కడ చేయవచ్చు?
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపూవారి నిశ్చయము మరియు హామీ ఏంటంటే, ఈ విధంగా స్వస్తిక్షేమ సంవాదం ద్వారా చండికాకులం లేదా చండికాకులంలోని ఏ సభ్యుడితోనైనా చేసే ఈ విధమైన సంభాషణ ఎటువంటి ఇతర మాధ్యమం లేకుండానే, మధ్యవర్తులు లేకుండానే, సులభంగా మరియు నిశ్చయంగా వారి వరకు చేరుతుంది.
ప్రతి అధికారిక ఉపాసనా కేంద్రంలో కూడా ఇలాంటి స్వస్తిక్షేమ సంవాదం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ సంవాదం జరుగుతున్న సమయంలో ఆ ఉపాసనా కేంద్రం అనేది హరిగురుగ్రామ్‌గానే పరిగణించబడుతుంది అనేది బాపు గారి సంకల్పం. బాపూవారి సంకల్పం ప్రకారం, స్వస్తిక్షేమ సంవాదం శ్రీహరిగురుగ్రామ్‌లో గానీ లేదా ఉపాసనా కేంద్రంలో గానీ జరుపుకోవచ్చు. అలాగే, ఆదివారాల్లో జరిగే ఆన్‌లైన్ ఇంగ్లీష్ ఉపాసనలో కూడా స్వస్తిక్షేమ సంవాదం యొక్క లాభం పొందవచ్చు.
ఈ ఉపాసన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మరియు రాత్రి 8.30 గంటలకు aniruddha.tv లో ప్రసారమవుతుంది.
శ్రద్ధావంతులకు “స్వస్తిక్షేమ సంవాదం” ద్వారా అద్భుతమైన, జీవితంలో గొప్ప మార్పులు తీసుకువచ్చిన అనుభవాలు కలిగాయి.
--------------------------


Comments
Post a Comment