శీర్షిక - సద్గురు శ్రీఅనిరుద్ధులవారి భావవిశ్వం నుండి - పార్వతీమాత యొక్క నవదుర్గ రూపాల పరిచయం – భాగం 8

శీర్షిక - సద్గురు శ్రీఅనిరుద్ధులవారి భావవిశ్వం నుండి - పార్వతీమాత యొక్క నవదుర్గ రూపాల పరిచయం – భాగం 8

సందర్భం: సద్గురు శ్రీఅనిరుద్ధ బాపుగారి దినపత్రిక ‘ప్రత్యక్ష’లోని ‘తులసీపత్ర’ అనే సంపాదకీయ శ్రేణిలో సంపాదకీయాలు 1394 మరియు 1395

సద్గురు శ్రీఅనిరుద్ధ బాపు తులసీపత్రం - 1394 అనే అగ్రలేఖలో ఇలా వ్రాశారు,


బ్రహ్మవాదిని లోపాముద్ర ఏడవ నవదుర్గ కాలరాత్రి చరణాలపై శిరస్సు ఉంచి, వినయపూర్వకంగా ఆమెకు నమస్కరించి ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు, “ఆప్తజనులారా! ఈ ఏడవ నవదుర్గ కాలరాత్రి శాంభవీ విద్యలోని పదమూడు, పద్నాలుగో మెట్ల (కక్ష్యల) అధిష్ఠాత్రి మరియు ఆశ్విన శుద్ధ సప్తమి యొక్క పగలు, రాత్రులకు నాయకురాలు.

ఈ భగవతి కాలరాత్రి భక్తుల శత్రువులను పూర్తిగా నాశనం చేయువారు. ఈమెను పూజించడం వల్ల భూతాలు, ప్రేతాలు, రాక్షసులు, దైత్యులు, దానవులు, తమాచారి మాంత్రికులు మరియు పాపి శత్రువులు వీళ్ళందరూ ఒక సంవత్సరం పాటు ఆ పూజక భక్తుని దగ్గర కూడా తిరగలేరు.” 

అందరూ శివగణాలు కలవరపడి ఒకరినొకరు చూసుకోసాగారు, “మేము పిశాచమయం ఉన్నాం. కానీ మాకు ఈమె భయం కలగడం బదులు ఈమె గురించి ఎంతో ప్రేమ కలుగుతోంది.”

లోపాముద్ర చిరునవ్వుతో ఇలా అన్నారు, “ఈమె అలాంటిదే మరియు మీరు కూడా ‘శివగణాలు’, కేవలం పిశాచాలు కాదు. మరియు ఇప్పుడు మీ రూపం కూడా మారిపోయింది.”

అందరు ఋషిసమూహాలు నిలబడి లోపాముద్రను అభ్యర్థించసాగారు, “మేము వనాల-అడవుల నుండి, దట్టమైన అరణ్యాల నుండి, ఎన్నో శ్మశాన ఘాట్ల నుండి, భయంకర నరసంహారం జరిగిన పురాతన యుద్ధభూముల నుండి ఒంటరిగా ప్రయాణించవలసి వస్తుంది. మరియు ఈమె గుణగణాలను విన్న మాకు ఈ నవదుర్గ కాలరాత్రి చరణాలపై శిరస్సు ఉంచాలని అనిపిస్తుంది. మాకు అలాంటి అనుమతి లభిస్తుందా?”

బ్రహ్మవాదిని లోపాముద్ర ప్రశ్నార్థకమైన చూపుతో భగవాన్ త్రివిక్రముని వైపు చూశారు. దానితోపాటు తన తల్లి అనుమతి తీసుకుని భగవాన్ త్రివిక్రముడు మరొక్కసారి తన ఏకముఖ రూపంలో ఈ అందరి మధ్యలోకి వచ్చారు. మరియు ఆయన బ్రహ్మవాదిని అరుంధతికి లోపాముద్ర చేతులను తన చేతుల్లో తీసుకుని అందరికీ చూపించమని చెప్పారు. మరియు లోపాముద్ర యొక్క మస్తకంపై వస్త్రాన్ని తొలగించి ఆమె నుదుటి భాగాన్ని చూపించమని చెప్పారు.

అరుంధతి అలా చేయగానే అందరూ మహర్షులు, ఋషివరులు మరియు ఋషికుమారులు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు మరియు కొద్దిగా భయపడ్డారు కూడా.

ఎందుకంటే బ్రహ్మవాదిని లోపాముద్ర మస్తకానికి మరియు చేతులకు ఎక్కడెక్కడ భగవతి కాలరాత్రి చరణాల స్పర్శ కలిగిందో, అక్కడ నుండి ఎన్నో విద్యుత్-శలాకలు లోపాముద్ర సహస్రారచక్రంలోకి దూరి ఆటలు ఆడుకుంటున్నాయి. మరియు ఆమె చేతుల నుండి అగ్నిజ్వాలల మంటలు ఆమె శరీరంలోని మొత్తం 72,000 నాడుల్లోకి దూరి ఆనందనృత్యం చేస్తున్నాయి.

ఇది చూసి మహర్షులు కూడా భయపడ్డారు. అది చూసి భగవాన్ త్రివిక్రముడు చెప్పారు, “ఈ కాలరాత్రి అలాంటిది. ఈ జ్వాలలు మరియు విద్యుత్-శలాకలు బ్రహ్మవాదిని లోపాముద్రకు ఏ విధంగానూ వేదన లేదా పీడ ఇవ్వడం లేదు. దీనికి బదులుగా ఈ విద్యుల్లత మరియు జ్వాలల కారణంగా బ్రహ్మవాదిని లోపాముద్ర యొక్క సహస్రారంలోని అన్ని సిద్ధులు జాగృతం అవుతున్నాయి. మరియు ఆమె దేహంలోని మొత్తం అంటే 108 శక్తి కేంద్రాలు పవిత్రమైన యజ్ఞకుండంలాగా మారిపోయాయి.

మరియు ఇలాంటి తేజస్సును ధరించడం సాధారణ మానవుడికి మాత్రమే కాదు; మహర్షులకు కూడా సాధ్యం కాదు.

ఎనిమిదో నవదుర్గ మహాగౌరి రూపం ఎంత శాంతంగా మరియు ప్రసన్నంగా ఉన్నప్పటికీ, ఆమె చరణాల ప్రత్యక్ష స్పర్శతో మానవ దేహంలోని మొత్తం 108 శక్తి కేంద్రాలు ఎంతో శీతలంగా మరియు శాంతంగా అవుతాయి. మరియు 72,000 నాడుల నుండి చాంద్రతేజస్సు జలప్రవాహంలాగా ప్రవహించసాగతుంది. మరియు ఆ అతిశీతలత్వాన్ని కూడా సాధారణ శ్రద్ధావానుడు మరియు మహర్షులు కూడా సహించలేరు.

తొమ్మిదో నవదుర్గ సిద్ధిదాత్రి అత్యంత ప్రసన్నమైన ముఖవర్ణం కలిగినవారు. అయితే ఆమెకు మణిద్వీపమాతతో ఏకరూపత్వం ఉంది.

ఈ అన్ని విషయాల వలన ఈ ముగ్గురి ప్రతిమలను పూజించడం చాలా సులువు అయినప్పటికీ, వారి ప్రత్యక్ష రూపాలను ధ్యానం చేయడం మహర్షులకు కూడా సాధ్యం కాదు.

అయితే ఈ ముగ్గురి ప్రత్యక్ష పూజ మరియు ప్రత్యక్ష ధ్యానం యొక్క అన్ని లాభాలు ఆశ్విని శుద్ధ నవరాత్రులలో పంచమి రోజున మాతా లలితాంబికను పూజ చేస్తే సులువుగా లభిస్తాయి. 

ఎందుకంటే పంచమి యొక్క నాయకురాలు స్కందమాత మరియు లలితాంబిక శ్రద్ధావానులందరకు ప్రత్యక్ష పితామహియే(మహా తల్లి).

ఈ ఆదిమాత ‘లలితాంబిక’ రూపంలో ఎల్లప్పుడూ ‘లలితాపంచమి’ రోజునే ప్రకటమవుతూ ఉంటుంది. మరియు అప్పుడు కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి ఆమెకు ప్రధాన సేనాపతులుగా ఉంటారు.

లలితాపంచమి పూజను వర్ణించడానికి నాకు కూడా ఎన్నో రోజులు పడుతుంది.”

ఇంత అని భగవాన్ త్రివిక్రముడు కాలరాత్రికి మరియు ఆదిమాతకు ప్రణామం చేశారు.

శ్రీ అనిరుద్ధగురుక్షేత్రంలో శ్రీ ఆదిమాత మహిషాసురమర్దినిని దర్శిస్తున్న సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు.

ఆ సమయానికి మొత్తం తొమ్మిది నవదుర్గలు, దశమహావిద్యలు, సప్తమాతృకలు, 64 కోట్ల చాముండలు అక్కడ ప్రత్యక్షమయ్యారు.

తర్వాత ఆ దేవతలంతా క్రమంగా ఆదిమాత మహిషాసురమర్ధినీ దేవి యొక్క ప్రతి రోమంలోకి ప్రవేశించాయి.

అదే సమయానికి, మణిద్వీపనివాసినీ అయిన ఆదిమాత తృతీయ నేత్రమునుండి ఒకేసారి ఉగ్రంగా మరియు సౌమ్యంగా ఉన్న అద్భుతమైన తేజస్సు అన్ని వైపులా విస్తరించసాగింది.

అదే సమయంలో, ఆదిమాత యొక్క మూలరూపం స్థానంలో ఆమె యొక్క ‘లలితాంబిక’ రూపం ప్రత్యక్షమవడం ప్రారంభమైంది.

లలితాంబికా ప్రత్యక్షమవుతూ అందరికీ భయరహిత వాగ్దానం ఇచ్చింది, “నవరాత్రి లోని ఇతర రోజుల్లో నవరాత్రి పూజ చేయగలవారికి మరియు చేయలేనివారికి,  అందరికీ లలితా పంచమి రోజున నా ‘మహిషాసురమర్ధిని’ రూపంలో నా ప్రియ కుమారుడితో చేసిన పూజ, ప్రతి వ్యక్తి భావప్రకారం మొత్తం నవరాత్రి ఫలాన్ని అందించగలదు.”

కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి ఈ ముగ్గురు దేవతల పాదాలకు మస్తకము ఉంచి నమస్కరించడము ద్వారా లభించే ఫలాలు, అత్యంత సౌమ్యమైన రూపంలో, లలితా పంచమి రోజున కేవలం నాకు మరియు త్రివిక్రమకు బిల్వపత్రాలు అర్పించగానే లభిస్తాయి.

ఎందుకంటే మీరు ఇప్పుడే చూశారు, అన్ని నవదుర్గాలు, అన్ని సప్తమాతృకలు, నా అన్ని అవతారాలు మరియు 64 కోట్ల చాముండలు నాలోనే నివసిస్తున్నాయి.”

సప్తమాతృకలు, వీరి పూజ గురించి సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు గురువారం, అక్టోబర్ 24, 2013న తన ప్రవచనంలో చెప్పారు.

బాపు తరువాత తులసీపత్రం - 1395 అనే అగ్రలేఖలో ఇలా వ్రాశారు, 

అందరు బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినిలు ఎంతో ప్రేమగా మరియు ఆదరంగా లలితాంబిక ‘లలితాష్టక స్తోత్రం’ సామవేదీయ పద్ధతిలో చెప్పడం ప్రారంభించారు. మరియు దానితోపాటు ‘లలితాంబిక’ రూపం ‘మణిద్వీపనివాసిని’ రూపంలో మళ్ళీ విలీనం అయింది.

అదే సమయంలో ఆ మణిద్వీపనివాసిని ఆదిమాత కూడా అదృశ్యమై ‘అష్టాదశభుజ అనసూయ’ మరియు ‘శ్రీవిద్యా’ ఈ రెండు రూపాలలోనే ముందులాగా కనిపించసాగింది.

ఇప్పుడు బ్రహ్మవాదిని లోపాముద్ర ముందుకు వచ్చి ‘కాలరాత్రిం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కందమాతరమ్’ ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. దానితోపాటు ఏడవ నవదుర్గ కాలరాత్రి ఆమె ఎప్పటిలాగే ఉన్న స్వరూపంలో; కానీ సౌమ్యతేజంతో కూడుకుని సాకారమయ్యారు.

లోపాముద్ర ఆమెకు ప్రణామం చేసి ఇలా మాట్లాడటం ప్రారంభించారు, “ఓ ఆప్తజనులారా! శాంభవీ విద్యలోని పదమూడు, పద్నాలుగో మెట్లపై (కక్ష్యపై), సొంత ఆధ్యాత్మిక ప్రవృత్తికి అడ్డుగా వచ్చే అన్ని శత్రువుల నాశనం చేయడం ప్రతి సాదకుడికి ఎంతో అవశ్యకం. ఎందుకంటే అలా చేయకపోతే పవిత్రతకు విరోధం కలిగించే అసురులు మరియు ఆసురీ ప్రవృత్తి గల మానవులు ఆ సాధకుడి తర్వాత ప్రయాణాన్ని కఠినం చేసివేస్తారు.

అందుకే అన్ని షడ్రిపుళ్లను అధిగమించిన సాధకుడు, తపస్వి ఇప్పుడు పరాక్రమి మరియు శూరుడు వీరుడైన వ్యక్తి రూపంలో పనిచేయాల్సి ఉంటుంది.

మరియు దానికోసమే ఈ ఏడవ నవదుర్గ కాలరాత్రి చాలా దక్షంగా ఉంటారు.

ఎందుకంటే పార్వతి కూడా తన జీవితరూపీ తపస్సులో ‘స్కందమాత’ మరియు ‘కాత్యాయని’ ఈ రెండు దశలను దాటిన తరువాత, ఒకసారి పరమశివుని భుజం తో భుజం కలుపుకొని మరియు అనేకసార్లు తానే ఒంటరిగా అక్షరాలా వేలకొద్దీ అసురులతో యుద్ధం చేశారు. మరియు ఆ ప్రతి అసురుడిని ఆమె ఖచ్చితంగా చంపింది.

ఆ సమయంలో ఆమె యుద్ధభూమిపై ప్రకటమయ్యే స్వరూపం అంటేనే ఏడవ నవదుర్గ ‘కాలరాత్రి’ - ఆమే తమ సంతానాలను రక్షించడానికి ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.

ప్రియమైన ఆప్తజనులారా! సరిగ్గా చూడండి. ఈమె చంద్రఖడ్గంపై కూడా అంచు యొక్క ప్రతి వైపు ఒక ఒక కన్ను ఉంది.

ఎప్పుడు ఎప్పుడు ఈమె నిజమైన శ్రద్ధావానుడైన భక్తుడు తన భక్తిసాధనలో పురోగతి సాధిస్తున్నప్పుడు, అతని ప్రపంచం లేదా ఆధ్యాత్మికతపై దాడి చేయడానికి వచ్చే ప్రతి వ్యక్తి పై భగవతి కాలరాత్రి కన్నులు మోపబడతాయి. మరియు సరైన సమయంలో ఈ కాలరాత్రి తన చంద్రఖడ్గాన్ని ఆ దుష్ట వ్యక్తిపై లేదా అసురుడిపై విసురుతారు - తన స్థానం నుండి కొంచెం కూడా కదలకుండా. 

ఎందుకంటే ఈమె చంద్రఖడ్గం యొక్క రెండు కళ్ళు ఈ ఖడ్గానికి సరిగా మార్గదర్శనం చేస్తాయి. మరియు ఆ అసురుడు ఎక్కడ దాక్కుని ఉన్నా, అతని చుట్టూ ఉన్న అన్ని రక్షక గోడలు మరియు అడ్డంకులను ఛేదించి ఈ చంద్రఖడ్గం ఆ శ్రద్ధావానుడి శత్రువు యొక్క వినాశనం కలిగిస్తుంది.

ఇప్పుడు ఈమె చేతిలో ఉన్న కంటకాస్త్రం వైపు చూడండి. దీనికి ఏడు కంటకలు (ముళ్ళు) ఉన్నాయి. ఇందులో ఆరు కంటకలు ఆరే ఆరు లోకాల నుండి సూక్ష్మాతిసూక్ష్మ పవిత్రత యొక్క శత్రువుల అంటే అసురుల మరియు దైత్యుల ప్రభావం లేకుండా చేస్తాయి.

నిజానికి ఇప్పటివరకు ఎప్పుడూ ఆరో కంటకం యొక్క ఉపయోగమే కాలేదు. ఎందుకంటే ఆరో లోకంలో అసురులు ఎప్పుడూ ప్రవేశించలేకపోయారు.

మరియు ఏడో లోకంలో అయితే ఆసురీ వృత్తులకు ప్రవేశం లభించడం కూడా సాధ్యం కాదు.

అప్పుడు ఈ ఏడో కంటకం యొక్క పని ఏమిటి?

ఈ ఏడో కంటకం పదమూడు మరియు పద్నాలుగో మెట్లపై (కక్ష్యపై) ఉన్న శాంభవీ విద్య యొక్క సాధకుడికి, అతనికి ఏమైన తన అంతఃకరణంపై కొరవవలసి ఉంటే - భావం, శబ్దం, ధ్యానం, చిత్రం, ప్రసంగం, అనుభవం, స్తోత్రం, మంత్రం, నామం - అవి అన్నీ కొరవడానికి భగవతి కాలరాత్రి నుండి లభించే అత్యున్నత లేఖన-సాధనం.

ఆదిమాత మహిషాసురమర్దిని మరియు శ్రీ అనిరుద్ధగురుక్షేత్రంలోని ధర్మాసనంపై విరాజమానమై ఉన్న సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు.

మరియు ఈ ఏడో కంటకం ఎప్పుడు శ్రద్ధావానుడికి లభిస్తుందో, అప్పుడే స్వయంగా భగవాన్ త్రివిక్రముడు, సాధకుడికి కావాల్సింది అతను రాసేసిన తరువాత, ఆ సాధకుడికి శాంభవీ విద్య మంత్రాన్ని స్వయంగా ప్రదానం చేస్తారు.

మరియు ఇక్కడ ఆ శ్రద్ధావానుడైన సాధకుడికి మాతా కాలరాత్రి మహాగౌరి రూపం ధరించి అతన్ని శాంభవీఛాత్ర అని స్వీకరిస్తారు.

హే గౌతమ మరియు అహల్య, రండి. మీకు స్వాగతం. మీరు ఇక్కడి వరకు అంతా నేర్చుకునే వచ్చినారు.”

అందరు బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినిలు ఇతర ఉపస్థితులందరితోపాటు నిలబడి గౌతమ-అహల్యకు ప్రేమతో స్వాగతం పలికారు.

మరియు లోపాముద్ర ఇంకా మాట్లాడసాగారు, “కాలరాత్రి ఉగ్ర అయినప్పటికీ మరియు అత్యంత సాత్విక ప్రేమతో నిండిన రూపం నుండి ఎనిమిదో నవదుర్గ మహాగౌరి దగ్గరికి వెళ్ళడం అంటే ఎంతో ఉగ్ర మరియు దాహక తేజస్సు నుండి ఎంతో సౌమ్య, శీతల తేజస్సు వరకు ప్రయాణం.

అంటే విశ్వం యొక్క రెండు ధ్రువాల జ్ఞానం.”

ఇప్పుడు ఏడవ నవదుర్గ కాలరాత్రియే నెమ్మది నెమ్మదిగా ఎనిమిదో నవదుర్గ ‘మహాగౌరి’గా మారసాగింది.

గౌతమ మరియు అహల్య భగవతి కాలరాత్రిని స్తవనం చేసి ఆమె దగ్గర ఎంతో ప్రేమతో వీడ్కోలు తీసుకుంటున్నారు.

అయితే భగవతి కాలరాత్రి మాత్రం తన అంగుష్టమాత్ర స్వరూపం బ్రహ్మర్షి గౌతముడి హృదయంలో స్థాపించారు.

मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments