సందర్భం: సద్గురు శ్రీఅనిరుద్ధ బాపుగారి దినపత్రిక ‘ప్రత్యక్ష’లోని ‘తులసీపత్ర’ అనే సంపాదకీయ శ్రేణిలో సంపాదకీయాలు 1400 మరియు 1401లో
సద్గురు శ్రీఅనిరుద్ధ బాపు తులసీపత్రం - 1400 అనే అగ్రలేఖలో ఇలా వ్రాశారు,
బ్రహ్మవాదిని లోపాముద్ర అందరు బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినిలతో కలిసి ఆదిమాత యొక్క ‘శ్రీవిద్యా’రూపానికి ప్రణామం చేశారు. మరియు వారందరూ లోపాముద్ర నాయకత్వంలో ఆదిమాత శ్రీవిద్య ముందు ‘ధ్యానం’ చేయడానికి కూర్చున్నారు.
అక్కడ ఉన్న ఇతరులు అందరూ వీరిని ఒకటే చూపుతో చూస్తున్నారు.
ఆ అందరు బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినిల ముఖాలపై నెమ్మది నెమ్మదిగా ఒక ఎంతో ఆహ్లదకరమైన, శాంతిరసం నిండిన మరియు ప్రసన్న భావం విలసిల్లడం మొదలుపెట్టింది. మరియు ఈ భావం పెరుగుతూనే ఉంది.
కానీ కేవలం ఒక్క లోపాముద్ర ముఖం పూర్తిగా నిశ్చలంగా మరియు శాంతంగా ఉంది. ఆమె ముఖంపై అలాంటి ప్రసన్న భావం లేదు మరియు అప్రసన్నత కూడా లేదు. ఇది చూసి అందరు ఉపస్థితులు మరింత జిజ్ఞాస గలవారుగా మారారు.
![]() |
| ఆదిమాత 'శ్రీవిద్య' |
భగవాన్ త్రివిక్రముడు ఇప్పుడు ‘ఓం నమశ్చండికాయై’ ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించి, బ్రహ్మవాదిని లోపాముద్ర మస్తకంపై తన వరదహస్తం ఉంచాడు.
అదే సమయంలో లోపాముద్ర ముఖంపై కూడా అలాగే ఆహ్లదకరమైన, శాంతిరసం నిండిన మరియు ప్రసన్న భావం వ్యాపించసాగింది.
అప్పుడు బ్రహ్మవాదిని లోపాముద్ర పెదవులు ఒకదాని నుండి మరొకటి వేరు అయ్యాయి. మరియు ఆమె కూడా స్వయంగా ‘ఓం నమశ్చండికాయై’ ఈ జపం చేయడం ప్రారంభించింది.
దానితోపాటు మిగతా అందరు బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినిలు తమ తమ కళ్ళు తెరిచారు.
అయితే బ్రహ్మవాదిని లోపాముద్ర కళ్ళు మాత్రం ఇంకా మూసుకునే ఉన్నాయి. ఆమె గట్టిగా మంత్రోచ్చారణ చేస్తున్నప్పటికీ ఆమె ఇంకా ‘ధ్యానంలోనే’ ఉంది అని ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తోంది.
లోపాముద్ర మస్తకంపై ఉన్న భగవాన్ త్రివిక్రముడి వరదహస్తం ఆమె వెంట్రుకల నుండి వేరైన వెంటనే బ్రహ్మవాదిని లోపాముద్ర పద్మాసనం నుండి లేచి నిలబడి, తన రెండు చేతులు జోడించింది; అయినప్పటికీ ఆమె ఇంకా పూర్తిగా ‘ధ్యానంలోనే’ ఉంది.
ఆ సమయంలో లోపాముద్ర ముఖం కేవలం ఆనందాన్ని చూపుతోంది. ఎలాగైతే ఆనందం యొక్క వివిధ రంగులు, వివిధ వనరులు, వివిధ ప్రవాహాలు, వివిధ సముద్రాలు ఆమె ఒక్క ముఖంపై ఆనందంగా నివసిస్తున్నట్టుగా అనిపించింది.
భగవాన్ త్రివిక్రముడి మాటలు ప్రతి ఒక్కరి చెవిలో పడ్డాయి, “ఇదే బ్రహ్మానంద స్థితి. ఇదే నిజమైన సంపూర్ణ స్థితి మరియు సంపూర్ణ గతి.
ఇలాంటి బ్రహ్మానందం శ్రీశాంభవీవిద్య యొక్క పదిహేడు మరియు పద్దెనిమిదో కక్ష్యలు (మెట్లు) దాటిన తరువాతనే లభిస్తుంది.
ఇతర అన్ని బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినీలకు కూడా ఈ బ్రహ్మానందం లభించింది. కానీ జ్యేష్ఠ బ్రహ్మవాదినీ లోపాముద్ర దగ్గర మాత్రం ఇంకో ప్రత్యేకమైన విషయం ఉంది.
- లోపాముద్ర చేసిన ఆదిమాత భక్తి యొక్క ప్రసారం వల్ల అంటే కోట్లకొలది గుణసంకీర్తనల వల్ల మరియు అది కూడా ‘నేను గుణసంకీర్తన చేస్తున్నాను’ ఈ భావం కొంచెం కూడా లేకపోవడం వల్ల ఈ లోపాముద్ర తాను పొందిన బ్రహ్మానందాన్నీ సహజంగానే ఒక క్షణంలో ఆదిమాత పాదాల వద్ద అర్పించసాగింది.
లోపాముద్ర అర్పించిన ఆ బ్రహ్మానందం, ఆదిమాత వ్యక్తమైన ఆ మూలస్థానానికి, అంటే శ్రీదత్తగురు పాదాల వద్దకు చేరింది.
ఈ విధంగా లోపాముద్ర వద్ద ఉన్న బ్రహ్మానందానికి సచ్చిదానందం యొక్క జోడి లభించింది.
అందుచేత ఆ బ్రహ్మవాదిని లోపాముద్ర, ఆమె ప్రతి పని చేస్తూ కూడా ఎల్లప్పుడూ బ్రహ్మానందంలోనే లీనమై ఉంటుంది.
శ్రీశాంభవీవిద్య యొక్క పద్దెనిమిదికి పద్దెనిమిది కక్ష్యలు దాటిన తర్వాతనే ఈ సచ్చిదానందం లభిస్తుంది.
అలాంటి ప్రాప్తి కేవలం లోపాముద్ర దగ్గరే ఉంది. అందువల్లనే ఆమె ‘శ్రీవిద్యాసంహిత’, శ్రీశాంభవీవిద్య, శ్రీశాంభవీముద్ర, శ్రీశాంభవీధ్యానం మరియు సచ్చిదానంద ఉపాసనలో అత్యున్నత మార్గదర్శక గురువు.”
![]() |
| స్వయంభగవాన్ త్రివిక్రముడు |
భగవాన్ త్రివిక్రముడు ‘అవధూతచింతన....’ అని అనగానే, బ్రహ్మవాదిని లోపాముద్ర కళ్ళు తెరిచారు. మరియు అది కూడా ‘....శ్రీగురుదేవదత్త’ అని ఉచ్చరిస్తూనే.
భగవాన్ త్రివిక్రముడు లోపాముద్రకు మాట్లాడటానికి అనుమతి ఇవ్వగానే ఆ జ్యేష్ఠ బ్రహ్మవాదిని మాట్లాడసాగారు, “ఓ ప్రియమైన ఆప్తగణులారా! శ్రీశాంభవీవిద్య యొక్క పదిహేడు మరియు పద్దెనిమిదో కక్ష్యల (మెట్ల) యొక్క అధిష్ఠాత్రి. ఆమె తొమ్మిదో నవదుర్గ ‘సిద్ధిదాత్రి’.
ఈ సిద్ధిదాత్రి నవరాత్రుల నవమి తిథి యొక్క రాత్రి మరియు పగులుకు నాయకురాలు.
శ్రీశాంభవీవిద్య యొక్క పదిహేడో కక్ష్యకు వచ్చే సాధకుడికి భగవాన్ త్రివిక్రముడు స్వయంగా ‘శ్రీశాంభవీధ్యానం’ నేర్పిస్తారు. మరియు అతను దాని సాధన కూడా చేయిస్తారు.
ఇంతకుముందు మేము అందరం ఏ ధ్యానంలో కూర్చున్నందువల్ల మేము బ్రహ్మానందంతో నిండిపోయాము, ఆ ధ్యానం అంటేనే ‘శ్రీశాంభవీధ్యానం’.
ఈ పదిహేడో మెట్టుపై భగవాన్ త్రివిక్రముడు ఆ సాధకుడి చేయి నవదుర్గ సిద్ధిదాత్రి చేతిలో ఇస్తారు.
మరియు ఆ మాత సిద్ధిదాత్రి ఆ సాధకుడిని తన సంతానంలాగా మానవుని 1008 సంవత్సరాలు తన దగ్గర జాగ్రత్తగా చూసుకుంటారు. మరియు అప్పుడే శ్రీశాంభవీధ్యానం సంపూర్ణ రూపాన్ని పొందుతుంది.
పద్దెనిమిదో మెట్టుపై మాత్రం ఈ సిద్ధిదాత్రి భగవాన్ త్రివిక్రముని సమ్మతితో ఆ సాధకుడి చేయి మళ్ళీ భగవాన్ త్రివిక్రముని చేతిలోనే ఇస్తుంది.
భగవాన్ త్రివిక్రముడు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా, ఆ సాధకుడిని తన రెండు చేతులలో ఒక చిన్నపిల్లాడిలాగా పైకి ఎత్తుకుంటారు.
మరియు ఆ సాధకుడిని ఎనిమిది సంవత్సరాల బాలుడిగా మార్చి ఆదిమాత యొక్క ‘మణిద్వీపనివాసిని’ రూపమైన అంటే ‘సింహాసనస్థ అష్టాదశభుజ మహిషాసురమర్దిని’ రూపమైన అంటే ‘లలితాంబిక’ రూపమైన అంటే మూల ‘శ్రీవిద్యా’ రూపం వద్దకు తీసుకెళ్ళి చేరుస్తుంది.
మణిద్వీపంలో ఆ బాలుడు బాలక్రీడ చేస్తూ ఎల్లప్పుడూ అక్కడే నివసిస్తాడు, అంటే బ్రహ్మర్షి లేదా బ్రహ్మవాదిని రూపంలోనే.
మణిద్వీపంలో బాలకుడిగా విహరిస్తూ ఉన్నప్పుడు, ఈ సాధకులు భూమిపై గాని లేదా ఇతర మానవవాస గృహిత గ్రహాలపై గాని తమ మూలరూపంలో కూడా సంచరిస్తారు, కార్యాలు నిర్వహిస్తారు, కొన్నిసార్లు జన్మ కూడా స్వీకరిస్తారు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మరణాన్నీ అంగీకరిస్తారు. అయితే వీరి జన్మమరణాలకు ఎలాంటి అర్థం ఉండదు. వీరు ఎల్లప్పుడూ ‘బ్రహ్మానంది’లుగానే ఉంటారు.
బ్రహ్మవాదిని లోపాముద్ర ఇలా చెప్పిన తరువాత ఆదిమాత శ్రీవిద్య యొక్క చరణాలపై వివిధ రంగుల సుగంధపూలు సమర్పించారు. దానితోపాటు ఆదిమాత యొక్క సింహాసనస్థ మణిద్వీప-స్వరూపం అక్కడ విలసిల్లసాగింది.
మరియు ఆదిమాత ఎడమవైపున నాలుగు మరియు కుడివైపున నాలుగు ఇలా పాడ్యమి నుండి అష్టమి వరకు ఉన్న నవదుర్గలు నిలబడ్డారు.
మరియు ఆదిమాత మస్తకంపై సువర్ణకమలఛత్రం పట్టుకుని తొమ్మిదో నవదుర్గ సిద్ధిదాత్రి నిలబడ్డారు.
ఈమె ముఖంలో మరియు ఆదిమాత ముఖంలో కొంచెం కూడా తేడా లేదు.
బాపు తరువాత తులసీపత్రం - 1401 అనే అగ్రలేఖలో ఇలా వ్రాశారు,
తొమ్మిదో నవదుర్గ సిద్ధిదాత్రి అందరు ఉపస్థితుల ముందుకు వచ్చి కైలాసం భూమిని కూడా పాదస్పర్శ చేయకుండా నిలబడింది.
మాత సిద్ధిదాత్రి యొక్క వర్ణం తాజా గులాబీ పువ్వుల రేకుల్లాగా ఉంది.
ఆమె కళ్ళు చాలా విశాలంగా మరియు సూటిగా ఉన్నాయి. ఎలాగైతే ఈమె చూపు దేనినైనా ఛేదించుకుని వెళ్ళగలిగేలా ఉంది.
ఆమె చతుర్హస్త. మరియు ఈమె నుదుటి భాగంపై మూడో నేత్రం బదులుగా కుంకుమతిలకమే కనిపిస్తోంది.
ఈమె నాలుగు చేతులలో శంఖం, చక్రం, గద మరియు పద్మం అనే ఆయుధాలు ఉన్నాయి.
ఈమె వస్త్రం ఎరుపు రంగుది మరియు బంగారు అంచు గలది.
ముఖ్యంగా ఈమె ప్రతి కదలిక చాలా సున్నితంగా, కోమలంగా మరియు నెమ్మదిగా ఉంది.
మాత సిద్ధిదాత్రి ముఖంపై ఒకే ఒక భావం ప్రసన్నంగా విలసిల్లుతోంది. మరియు అది అంటే ‘సమాధానం’.
ఆ సమాధానం మాత ముఖం నుండి బయలుదేరి ప్రతి శ్రద్ధావానుడి దగ్గరకు స్వయంగా తన బలం వల్లనే చేరుతోంది.
భగవాన్ త్రివిక్రముడు సైగ చేయగానే బ్రహ్మవాదిని లోపాముద్ర నవదుర్గ సిద్ధిదాత్రి మెడలో సుగంధ మల్లెపువ్వుల మాల సమర్పించారు. మరియు ఆమె చరణాలపై సంపెంగ మరియు గులాబీ పువ్వులు సమర్పించారు.
తరువాత విషయం చూసి మాత్రం ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు; ఎందుకంటే సిద్ధిదాత్రి చరణాలపై వేసిన ప్రతి పువ్వు బ్రహ్మవాదిని లోపాముద్ర మెడలోకి వచ్చి ఒక అందమైన పూలమాల తయారైంది.
తన దగ్గర ఉన్న అన్ని పువ్వులు సమర్పించిన తరువాత లోపాముద్ర ఆదిమాత మరియు సిద్ధిదాత్రి అనుమతి తీసుకుని అందరు ఉపస్థితులతో మాట్లాడటం ప్రారంభించారు, “ఓ భాగ్యవంతులైన ఆప్తగణులారా! మీరు అందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ అందరికీ సరైన క్రమంలో తొమ్మిది నవదుర్గల దర్శనం పొందారు. అలాగే వారి మహాత్మ్యమును కూడా శ్రవణం చేశారు.
ఈ విశ్వంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వం మరియు వశిత్వం, సర్వకామావసాహిత,
సర్వజ్ఞత్వం ఇలాంటి అనంత సిద్ధులు ఉన్నాయి.
వాటిలో అణిమ, లఘిమ, మహిమ మొదలైనవి ఎనిమిది ముఖ్య సిద్ధులుగా భావిస్తారు.
![]() |
| శ్రీ అనిరుద్ధగురుక్షేత్రంలోని శ్రీచండికాకులం ప్రతిమ ముందు శ్రీ స్వస్తిక్షేమ తపశ్చర్య సందర్భంగా హోమం చేస్తున్న సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు |
వసుంధరపైనే కాదు, ఇతర భూమిలపై కూడా చాలామంది ఏ తపస్సులు చేస్తూ ఉంటారో, అవి ఎక్కువగా ఏదో ఒక సిద్ధి ప్రాప్తి కోసం ఉంటాయి.
ఏ ఏ తపస్వి ఏ ఏ చండికాకుల సభ్యుడిని తన ఆరాధ్యదైవం గా భావించి తపస్సు చేస్తాడో లేదా సాధన చేస్తాడో, అతనికి ఆ దైవం నుండి వరం లభిస్తుంది. మరియు ఈ వరాలు సిద్ధులవి అయితే ఈ తొమ్మిదో నవదుర్గ సిద్ధిదాత్రి ఆ సాధకుడికి లభించే సిద్ధిపై కూడా తన దృష్టి ఉంటుంది.
ఎందుకంటే నవదుర్గ సిద్ధిదాత్రి యొక్క ప్రభామండలం నుండే అన్ని రకాల సిద్ధులు తయారవుతాయి. మరియు అక్కడి నుండే ఈ అన్ని సిద్ధుల నిజమైన పని మొత్తం బ్రహ్మాండంలో జరుగుతూ ఉంటుంది.
నిజానికి సిద్ధులను ఆశించడం తప్పు. ఎందుకంటే సిద్ధి లభించడం వల్ల ఏ సత్తా లభిస్తుందో, అది ఉపయోగించే బుద్ధి ఒకవేళ న్యాయమైనదిగా లేకపోతే మరియు పవిత్రంగా లేకపోతే, ఆ సాధకుడు అసురుడిగా మారడానికి సమయం పట్టదు.
మరియు ముఖ్యంగా నిజమైన శ్రద్ధావానుడికి ఏ సిద్ధి పొందవలసిన అవసరం లేదు.
![]() |
| అంబజ్ఞ ఇష్టిక |
ఎందుకంటే ఎప్పుడైతే నిజమైన శ్రద్ధావానుడు రెండు నవరాత్రులలో ఆదిమాత/నవదుర్గలను శ్రద్ధాగా అంతఃకరణంతో క్రమం తప్పకుండా పూజ చేస్తాడో, ఆదిమాత చరిత్రను పదే పదే పఠనం చేస్తూ ఉంటాడో మరియు ఆమె గుణసంకీర్తనలో లీనమైపోతాడో అప్పుడు అతని జీవితంలో అవసరం ఉన్న అన్ని సిద్ధుల పనిని ఈ మాత సిద్ధిదాత్రి, ప్రార్థన చేయకపోయినా కూడా శ్రద్ధావానుడికి అందిస్తూనే ఉంటుంది.
అంతేకాకుండా, ఆదిమాత యొక్క ఈ చండికాకులంలోని సమస్త కుమారులు, కుమార్తెల పట్ల సంపూర్ణ భక్తిని చూపువారికి కూడా, ఈ నవదుర్గలలో సిద్ధిదాత్రి తల్లి సరైన సమయంలో సరైన సిద్ధులను తప్పక ప్రసాదిస్తుంది.
ఆమె ముఖంపై నిరంతరం విలసిల్లే సమాధానం ప్రతి శ్రద్ధావానుడికి ఓదార్పు ఇస్తుంది. ఎందుకంటే మీరు భక్తిపూర్వకంగా చేసిన ప్రతి కార్యాన్నీ ఆమె సంతోషంతో స్వీకరిస్తుంది, మీ చిన్నసేవకే కూడా ఆమె
ప్రసన్నమవుతుంది. కానీ మీకు సిద్ధులు కావాలనే కోరిక ఉంటే మాత్రం, ఆమె ముఖంపై కనిపించే ఆ తృప్తి మీరు చూడలేరు.
ప్రతి బ్రహ్మర్షి మరియు బ్రహ్మవాదిని దగ్గర వివిధ రకాల సిద్ధులు ఉన్నాయి. మరియు వారికి కావలసిన సిద్ధులు వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించవచ్చు.”
అంతవరకు మాట్లాడి, జ్యేష్ఠ బ్రహ్మవాదిని లోపాముద్ర ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఆగిపోయింది. అప్పుడు భగవాన్ త్రివిక్రముడు మాట్లాడడం ప్రారంభించాడు,“ఓ నా ప్రియమైన బాలకులారా! ఈ సమస్త బ్రహ్మర్షులు మరియు బ్రహ్మవాదినులు శ్రీశాంభవీ విద్య యొక్క పదెనిమిదవ మెట్టులో (కక్షలో) తొలుత 108 సిద్ధులను పొందుతారు. అలాగే, వారి వారి సంకల్పానుసారం వారికి కావలసిన సమస్త సిద్ధులు కూడా అందుబాటులో ఉంటుంది.”
కానీ అసలైన గూఢార్థం ఇక్కడే ఉంది ఎవరికైనా ఈ లభించిన అన్ని సిద్ధులు తక్షణమే ఆదిమాత పాదాల వద్ద సమర్పించి, వాటి బంధనాల నుండి విముక్తి పొందాలనే కోరిక లేకపోతే, అతను ‘బ్రహ్మర్షి’గా మారలేడు.
పద్దెనిమిదో మెట్టుపై లభించిన అన్ని సిద్ధులు ఎప్పుడు ఆదిమాత చరణాలపై సమర్పించబడతాయో, అప్పుడు వారి ఈ నిష్కామ భావం చూసి ఆదిమాత ఆయా బ్రహ్మర్షి లేదా బ్రహ్మవాదిని యొక్క అన్ని సిద్ధులను ఈ సిద్ధిదాత్రికి అప్పగిస్తుంది.
మరియు ఈ సిద్ధిదాత్రి ప్రతి ఒక్కరి సిద్ధులను తన ప్రభామండలంలో వారి వారి పేరుతోనే జాగ్రత్తగా ఉంచుతుంది.
అప్పుడు ఆదిమాత, శ్రీదత్తాత్రేయ మరియు సిద్ధిదాత్రి ఆయా బ్రహ్మర్షి లేదా బ్రహ్మవాదినికి వారి దగ్గర లేని సిద్ధులను కేవలం సిద్ధిదాత్రి స్మరణతో ఉపయోగించుకునే వరం ప్రసాదిస్తారు.”
బ్రహ్మవాదిని లోపాముద్ర భగవాన్ త్రివిక్రమునికి మనసారా ప్రణామం చేసి ఇలా చెప్పింది, “ఓ ఆప్తగణులారా! గృహస్థుల కోసం ఈ తొమ్మిదవ నవదుర్గ సిద్ధిదాత్రి వారి సమస్త విధాల అభ్యుదయంకోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
ఇతరులకు అన్యాయంగా దుఃఖం కలిగించకుండా, ఎంత సుఖం శ్రద్ధావానుడికి కావాలని ఉంటుందో, అంతా ఈ నవదుర్గ సిద్ధిదాత్రి శ్రద్ధావానుడికి అందిస్తూనే ఉంటుంది.
ప్రధానంగా చెప్పాలంటే, ఈ నవదుర్గ అయిన సిద్ధిదాత్రి మరియు ఆదిమాత యొక్క సమస్త విద్యలపై ఆధిపత్యం కలిగిన సిద్ధేశ్వరి స్వరూపం, ఈ రెండూ పరస్పర సంబంధంతో ఒకదానితో ఒకటి బలంగా అనుబంధించబడి ఉన్నాయి.
పార్వతి తన జీవితంలోని ఈ తొమ్మిదో దశ అనంతరం అన్నపూర్ణ, సదాపూర్ణ, భావపూర్ణ, ప్రేమపూర్ణ మరియు శక్తిపూర్ణ అనే ఈ పంచవిధ కర్తవ్యాల ద్వారా ఆదిమాత యొక్క ‘క్షమ’ అనే సహజ భావన ప్రతి శ్రద్ధావానుడికి లభించాలనే ఉద్దేశంతో నిరంతరం కార్యనిరతగా ఉంది.
మరియు ఆమె ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.”
मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>> മലയാളം>>





Comments
Post a Comment