సద్గురు శ్రీ అనిరుద్ధ ఆధ్యాత్మిక ప్రపంచం నుండి పార్వతి దేవి మాత యొక్క నవదుర్గ స్వరూపాల పరిచయం – భాగం 10

సద్గురు శ్రీ అనిరుద్ధ ఆధ్యాత్మిక ప్రపంచం నుండి పార్వతి దేవి మాత యొక్క నవదుర్గ స్వరూపాల పరిచయం – భాగం 10

సూచన - సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు దినపత్రిక "ప్రత్యక్ష" లో ప్రచురితమైన "తులసిపత్ర" అనే ధారావాహిక లోని సంపాదకీయ క్రమ సంఖ్య 1398 మరియు 1399లో

సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు "తులసిపత్ర" - 1398 అనగా మొదటి పేజీ సంపాదకీయంలో ఇలా వ్రాయబడినది.

శ్రీ శాంభవీ ముద్ర యొక్క పూర్తి వివరణ మరియు దాని కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకున్న తర్వాత, సకల శివగణాలు, ఋషికుమారులు, ఋషిగణాలు మరియు మహర్షులు పరస్పరం చర్చించుకున్న తర్వాత, వరిష్ట బ్రహ్మవాదిని అయిన లోపాముద్రను అభ్యర్థించడం ప్రారంభించారు. ఓ పరమొత్తమ బ్రహ్మవాదిని! శ్రీ శాంభవీ ముద్ర గురించి, ఎనిమిదవ నవదుర్గ అయిన మహాగౌరి గురించి, ఆమె మాకు ఇచ్చిన అష్టాదళ శ్వేత పుష్పం గురించి మరింత తెలుసుకోవాలనే బలమైన కోరిక మాకు ఉంది మరియు మా చేతులకు శాశ్వతంగా అతుక్కుపోయిన ఈ శ్వేత పుష్పం యొక్క సువాసన కారణంగా ఈ కోరిక మరింత బలపడుతోంది. మాపై దయ చూపండి.

మహాగౌరి మరియు ఆదిమాత అనుమతి తీసుకున్న తర్వాత బ్రహ్మవాదిని లోపాముద్ర మాట్లాడటం ప్రారంభించింది, అవును, ఆ తెల్లటి పువ్వు వల్లనే మీ ఉత్సుకత పెరుగుతోంది.

శ్రద్ధావానులు మరియు సజ్జనుల జిజ్ఞాసను ఆధ్యాత్మిక, శాస్త్రీయ, కళాత్మక, వ్యాపార, చేతిపనులు, జాతీయ మరియు మతపరమైన భద్రత, దేశీయ భద్రత మొదలైన అన్ని రంగాలలో ఈ ఎనిమిదవ నవదుర్గా మహాగౌరి సరైన మార్గంలో మరియు సరైన క్రమంలో ప్రాంతాల యొక్క ఉత్సుకతను పెంచుతూనే ఉంటుంది.

ఎందుకంటే ఈ “మహాగౌరి” రూపమే తన శరీరంపై పరమ శివుడు ఏడవ గంగతో అభిషేకించిన లేపనం ద్వారా గణపతికి జన్మనిచ్చింది మరియు ఈ గణపతి ప్రపంచానికి ఆత్మగా ఉండటం వలన జ్ఞానం, కాంతి మరియు అడ్డంకులను తొలగించేవాడు.

అప్పుడు, అతని తల్లి అయిన ఈ మహాగౌరి, తన భక్తులైన శ్రద్ధావానులు గణపతి నుండి అన్ని వరాలను పొందేలా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది కదా! అందుకే, ఆమె శ్రద్ధావానుల మనస్సులలో శుభకరమైన మరియు ఉపయోగకరమైన కోరికలను కూడా సృష్టించి వాటిని నెరవేరుస్తుంది.

ప్రియమైన ఆప్తజనులారా, ఈ పార్వతి యొక్క ఎనిమిదవ రూపమే "మహాగౌరి" తగు విధంగా పనిచేస్తోంది, దీని కారణంగా నవరాత్రిలో అష్టమి తిథి యొక్క ప్రాముఖ్యత ప్రతిచోటా ప్రసిద్ధి చెందింది.

చాలా ప్రదేశాలలో మరియు ప్రాంతాలలో నవరాత్రి ఎనిమిదవ రోజున హోమం, హవనము, యజ్ఞము, యాగము, యజనము నిర్వహిస్తారు, ఎందుకంటే పార్వతి జీవిత ప్రయాణంలో ఈ "మహాగౌరి" స్థితి, అనగా వాస్తవానికి, దశ లేదా

రూపం కూడా మునుపటి ఏడు రూపాలకు సమానంగా ఉంటుంది మరియు తదుపరి తొమ్మిదవ రూపానికి కూడా సమానంగా ఉంటుంది.

మరియు ఈ కారణంగా, అష్టమి నాడు చేసే హవనాన్ని తొమ్మిది మంది నవదుర్గలు సమానంగా స్వీకరిస్తారు.

అదేవిధంగా, ఈ మహాగౌరి ప్రకటితమైన రోజు కూడా అశ్వీయుజ శుక్ల అష్టమి.

అష్టమి రోజున, హవనము, పూజ, ఉత్సవము, భక్తి (గర్భాలాంటి)నృత్యము మరియు రాత్రి జాగరణలు, ఆదిమాత చరిత్ర పఠనం (మాతృవాత్సల్యవిందానం), ఆదిమాత యొక్క కార్యకర్మలు మరియు గుణ సంకీర్తనలను వినడం మరియు పారాయణం చేయడం (మాతృవాత్సల్య ఉపనిషత్) వంటివి నిర్వహిస్తారు. ఇదంతా స్వయం ఆదిమాతకు మరియు తొమ్మిది మంది నవదుర్గలకు చాలా ప్రియమైనవి.

వాస్తవమేమంటే అశ్వీయుజ శుక్ల అష్టమి రోజు శ్రద్ధావానులందరికి ఒక పెద్ద వరం లాంటిది.

ఈ నవరాత్రి సమయంలో చేసే పూజల కారణంగా, ఈ తొమ్మిది నవదుర్గలు శ్రద్ధావనులకు సహాయకులుగా మారతారు, మరియు ఈ మహాగౌరి మరియు స్కందమాత తమ కుమారులతో కలిసి నిజమైన శ్రద్ధావనుల ఇళ్లలో ఏడాది పొడవునా తమ ఆశీర్వాద ప్రకంపనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు.

మరి అందుకే శ్రద్ధావానులు ఈ రెండు అత్యంత పవిత్ర ఉత్సవాలైన అశ్వీయుజ నవరాత్రి మరియు చైత్ర నవరాత్రిలను వీలైనంత వరకు ప్రేమ మరియు భక్తితో వారి వారి సామర్థ్యం మేరకు మరియు సాధ్యమైనంత వరకు జరుపుకోవాలి.

ఓ శ్రద్ధావానులారా! ఎవరైతే "మాతృవాత్సల్యవిందానం" మరియు "మాతృవాత్సల్య ఉపనిషత్తు" లను భక్తితో క్రమం తప్పకుండా పారాయణం చేస్తారో మరియు ప్రతి నవరాత్రులలో ఒక గ్రంథాన్ని పారాయణం చేస్తారో, వారికి ఈ మహాగౌరి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ శ్వేతపుష్పాన్ని ప్రసాదిస్తుంది.

మరియు ఈ శ్వేతపుష్పం శ్రద్ధావంతుడి చేతులకు అంటుకుంటే, అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.

ఎందుకంటే వాస్తవానికి ఆ శ్వేతపుష్పం ఆ శ్రద్ధావంతుడి శరీర లింగ భాగానికి అతుక్కుపోతుంది.

మరియు దీని కారణంగా, ఆ శ్వేతపుష్పం అతని ఏ జన్మలోనూ కూడా తన నుండి విడిపోదు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పువ్వు అష్టదళానికి ఎందుకు చెందినదని?

మానవ జ్ఞానాన్ని పొందడం కోసమా లేదా ఆధ్యాత్మికత కోసమా లేదా రెండింటి కోసమా అనే దానికి ఆదిమాత యొక్క “శాకంభరీ శతాక్షి” అవతారం ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది.

శ్రీశ్వాసమ్ ఉత్సవంలో ఆదిమాత శతాక్షిని దర్శిస్తున్న సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు.

కానీ ఆ ప్రతి పనికి, అతనికి శారీరక, జీవ మరియు మానసిక స్థాయిలలో ఆహారం, నీరు మరియు గాలి అవసరం.

మరియు మానవుడి మూడు రకాల శరీరాలకు అవసరమైన ఆహారం, నీరు మరియు గాలి తల్లి అయిన ఆదిమాత యొక్క అష్టాంగ స్వభావం ద్వారా సరఫరా చేయబడతాయి.

మరియు ఈ శ్వేత అష్టదళపుష్పం ఆ అష్టాంగ స్వభావం యొక్క వరం మరియు అది కూడా తెల్లని రంగులో ఉంటుంది. అంటే, పూర్తిగా స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది.

బాపు ఇంకా “తులసీపత్ర” - 1399 సంపాదకీయంలో ఇలా రాశారు.

ఈ విధంగా, నవరాత్రులలోని అష్టమి తిథి యొక్క ప్రాముఖ్యత గురించి మరియు మహాగౌరి ఇచ్చిన శ్వేత అష్టదళ పుష్పం గురించి శ్రద్ధావంతులకు వివరించిన తర్వాత, బ్రహ్మవాదిని లోపాముద్ర అక్కడ ఉన్న బ్రహ్మఋషులు మరియు బ్రహ్మవాదినీలందరికీ ఇలా చెప్పింది, ఆదిమాత అనుమతి తీసుకున్న తర్వాత, అక్కడ ఉన్న చిన్న చిన్న సమూహాలకు “శ్రీ శాంభవీ ముద్ర” ను ప్రదర్శించమని ఆయన అభ్యర్థించారు.

ప్రతి బ్రహ్మర్షి మరియు బ్రహ్మవాదిని వారి వారి సమూహాలతో వేర్వేరు ప్రదేశాలకు వెళ్లి కూర్చున్నారు.

ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడ కూర్చోవాలో సద్గురు త్రివిక్రముడే స్వయంగా చెప్పారు.

ప్రతి శివగణం మరియు ఋషిగణం వారి కోసం కేటాయించిన స్థానాల్లో కూర్చున్న వెంటనే, వారందరూ దూకి అద్భుత సముద్రంలో తేలడం ప్రారంభించారు.

కారణం కూడా అదే - బ్రహ్మర్షి లేదా బ్రహ్మవాదిని యొక్క ప్రతి సమూహానికి సమీపంలో గంగా నది ప్రవహిస్తున్నది.

ప్రతి బ్రహ్మర్షి లేదా బ్రహ్మవాదిని తమ ఆసనం వెనుక వికసించే బిల్వవృక్షం ఉంది.

మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సమూహం ఇతర సమూహాల దృశ్యాలను కూడా చూడగలదు.

ఎన్ని గంగలో! ఇన్ని బిల్వ చెట్లో! మరియు వారు వాటిని ఎక్కడ చూడగలరు?

అయితే, బ్రహ్మవాదిని లోపాముద్రకు ఏ సమూహాన్ని కేటాయించలేదు. ఆమె తనకు తానుగా మార్గదర్శిగా వ్యవహరించాల్సి వచ్చింది.

బ్రహ్మవాదిని లోపాముద్ర ఆది మాత శ్రీవిద్య పాదాల వద్ద చాలా వినయంతో నిలబడి, ఓ విశ్వాసపాత్రులైన శ్రద్ధావంతులారా! ఇప్పుడు మీరు ప్రతిదీ చూశారు మరియు మీ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. కాబట్టి, ఈ క్షణం నుండి, మీ సమూహంలోని సద్గురువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి.

మీ గురువులు ఈరోజు మీకు శ్రీ శాంభవీ ముద్రను ప్రదానం చేయరు, కానీ కేవలం దానిని మీకు ప్రదర్శిస్తారు.

బ్రహ్మవాదిని లోపాముద్ర సూచనల ప్రకారం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ గురువులను మాత్రమే చూడటం ప్రారంభించారు.

ప్రతి బ్రహ్మర్షి లేదా బ్రహ్మవాదిని అంటే బ్రహ్మగురువు ఇప్పుడు పద్మాసనంలో ఆసీనులై కూర్చున్నారు.

ముందుగా, వారు చేతులు జోడించి దత్తగురువు మరియు ఆది మాతను ప్రార్థించారు, ఆపై వారు కళ్ళు మూసుకుని కూర్చున్నారు.

వారు వేరే ఏ కదలికలు చేయడం లేదు - కనురెప్పలు మరియు నాసికా రంధ్రాల కదలికలు కూడా చేయలేదు.

మరియు దీని కారణంగా, వారి ముందు కూర్చున్న వారెవరూ వారి కనురెప్పల వెనుక ఏమి జరుగుతుందో చూడలేకపోయారు.

కానీ కైలాసం మీద ఇది ఎలా జరుగుతుంది, అది కూడా ఆదిమాత మరియు త్రివిక్రముడి సమక్షంలో?

లేదు! అటువంటి పరిస్థితిలో, ఏ శ్రద్ధావంతుడు కూడా దేనినీ కోల్పోకూడదు. ప్రతి సమూహానికి సమీపంలో ప్రవహించే గంగా నది నుండి నీటిని ప్రతి బ్రహ్మగురువు యొక్క కనురెప్పలపై చల్లమని భగవాన్ త్రివిక్రముడు లోపాముద్రను కోరాడు.

దీనితో పాటు, బ్రహ్మగురువు కనురెప్పలు అందరికీ కనిపించినప్పటికీ, ఆ కనురెప్పల వెనుక ఉన్న అతని కళ్ళ కదలికలు ఒక క్రమపద్ధతిలో కనిపించాయి.

ఆ బ్రహ్మగురువులలో ప్రతి ఒక్కరి కళ్ళు వారి వారి కనుబొమ్మల నుండి సమాన దూరంలో ఉన్న ఒక మధ్య బిందువుపై కేంద్రీకరించబడ్డాయి.

మరియు వారి కళ్ళ నుండి, అత్యంత పవిత్రమైన మరియు స్వచ్ఛమైన భావోద్వేగం సున్నితమైన మరియు మృదువైన విద్యుత్ శక్తి రూపంలో అతని ఆజ్ఞ చక్రం వైపు ప్రవహింస్తుంది.

మరియు దానితోపాటు, వారి ఆజ్ఞ చక్రం ఒక అద్వితీయమైన అందమైన తేజస్సుతో పొంగిపొర్లుతోంది,

మరియు ఆ ఆజ్ఞ చక్రం నుండి, ఆ బ్రహ్మగురువుల కళ్ళలోకి అత్యంత అసాధారణమైన ప్రవాహం ప్రవహిస్తోంది.

అయితే, ఈ అసాధారణ ప్రవాహం నీరు లేదా విద్యుత్ శక్తి కాదు, కానీ ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతమైన కాంతి, చాలా అందమైనది, సున్నితమైనది మరియు ప్రశాంతమైనది.

సద్గురు శ్రీ అనిరుద్ధ ప్రతిపాదించిన శ్రీశబ్దధ్యానయోగ ఉపాసనలో ఉన్న ఆజ్ఞాచక్ర ప్రతిమ.

మరియు ఈ అద్భుతమైన కాంతి ప్రవాహం ఆ బ్రహ్మగురువుల కళ్ళలోకి ప్రవేశించి, వారి త్రిగుణాత్మక శరీరంలోని 72,000 నాడుల గుండా ప్రవహిస్తుంది.

మరియు ఈ కాంతి కారణంగా, ఆ బ్రహ్మగురువుల శరీరంలోని ప్రతి స్థూల కణం చాలా యవ్వనంగా, శక్తివంతంగా మరియు స్వచ్ఛంగా మారుతోంది మరియు వారి మానసిక పదార్ధంలోని ప్రతి కణం కూడా మారింది.

ఇంతలో "ఓం శ్రీదత్తగురవే నమః" అనే మంత్రం త్రివిక్రమ భగవానుడి స్వరంలో అందరికీ వినిపించింది మరియు దానితో, కనురెప్పల వెనుక కనిపించే ప్రతిదీ అదృశ్యమైంది.

కానీ అందరు బ్రహ్మగురువులు వెంటనే తమ కళ్ళు తెరవడం ప్రారంభించలేదు - వారు త్రిగుణాత్మక శరీరంలో పొందిన దైవిక కాంతిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లుగా.

"శ్రీ దత్తగురువే నమః" అని త్రివిక్రమ భగవానుడు జపిస్తూ ఉండగా, తరువాత బ్రహ్మర్షి అగస్త్యుడు ముందుగా తన కనురెప్పలను తెరిచాడు. ఆయనను అనుసరించి, మిగతా బ్రహ్మగురువులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు తమ కనురెప్పలను తెరిచారు.

ఆ బ్రహ్మఋషులు మరియు బ్రహ్మవాదినీలందరూ ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా, యవ్వనంగా, శక్తివంతంగా, బలవంతులుగా కనిపించారు.

బ్రహ్మవాదినీ లోపాముద్ర తన ముఖం మీద చిరునవ్వుతో అందరికీ “శ్రీ శాంభవిముద్ర" సాధన వల్ల ప్రతి సాధకుడి భౌతిక శరీరం, ప్రాణాధార శరీరం మరియు మానసిక శరీరం నిరంతరం నవీకరించబడి, ఉత్తేజితమవుతాయి.

కానీ ఆజ్ఞ చక్రం నుండి ఉద్భవించిన కాంతి ఎక్కడి నుండి వచ్చిందో అది కేవలం శ్రీశాంభవీవిద్య యొక్క పదిహేడు మరియు పదిహెనిమిదో కక్ష్యలోనే మాత్రమే తెలుసుకోగలరు.

సద్గురు త్రివిక్రముడి నుండి శ్రీ శాంభవీ ముద్రను పొందడం ప్రతి శ్రద్ధావానుడి జీవిత చక్రం యొక్క అంతిమ లక్ష్యం అయి ఉండాలి. శ్రీ శాంభవీ ముద్రను పొందిన తర్వాత, దుఃఖం, భయం మరియు బాధలను కలిగించడం మానేస్తాయి మరియు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కానీ శ్రద్ధావానుడు దానిని అధిగమిస్తాడు.

ఓ శ్రద్ధావానులారా! ఈ ఎనిమిదవ నవదుర్గ మహాగౌరి తన ఇతర ఎనిమిది రూపాల మాదిరిగానే చాలా దయగలది.

ప్రియమైన మిత్రులారా! ఈ తొమ్మిది నవదుర్గలలో ఎవరు ఎక్కువ దయగలవారో లేదా ఎవరు ఎక్కువ ప్రభావవంతమైనవారో కూడా ఆలోచించకండి.

ఎందుకంటే అందరి మార్గాలు భిన్నంగా ఉన్నప్పటికీ, అందరి ప్రేమ, దయ మరియు కరుణ ఒకటే.

ఎందుకంటే చివరికి ఈ తొమ్మిది మంది వేరు వేరు కాదు, ఒక పార్వతియే.

मराठी >> हिंदी >> English >> ગુજરાતી>> ಕನ್ನಡ>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments