చాలా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా.
ఇప్పటివరకు ఏ రూపాంతరానికి కూడా క్షణం కూడా పట్టలేదు.
కైలాసంలో కాలమే లేకపోవడం వలన, ‘ఎంత నెమ్మదిగా’ అనేది ఎవరికీ తెలియడం లేదు. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరంతరం ఏదో ఒక నిత్యజపం చేస్తూ ఉండడం వలన, తమ జపానికి ఎన్నో ఆవర్తనలు జరుగుతున్నప్పటికీ ఈ రూపాంతరం ఇంకా జరుగుతూనే ఉందని ప్రతి ఒక్కరికి పూర్తిగా అర్థం అవుతోంది.
అక్కడ ఉన్న అందరిలోనూ ఈ విషయం గురించి ఉన్న ఉత్సుకత ఇప్పుడు ఆతురతగా మారసాగింది.
మరియు నెమ్మది నెమ్మదిగా ఆ ఆతురత మనసును అస్థిరం చేయసాగింది. - మహర్షుల నుండి శివగణాల వరకు ప్రతి ఒక్కరి మనసు ఆతురత యొక్క అత్యున్నత శిఖరం మీదకు చేరుకుని, ఆ తరువాత అక్కడి నుండి అగాధంలో పడడం వల్ల పూర్తిగా అశాంతి మరియు అస్థిరంగా మారింది.
అందరు బ్రహ్మర్షులు మాత్రం ఈ నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ వల్ల మరింత ప్రశాంతంగా, నిర్మలంగా, తన్మయం అయి, ఆనందిస్తూ ఉన్నారు.
మరియు ఇది గమనించగానే మిగతా అందరి మనసులలోని అశాంతి మరియు అస్థిరత మరింత వేగంగా పెరగసాగింది.
మరియు తన పిల్లల ఈ అవస్థను ఆదిమాత చూడగలరా?కచ్చితంగా చూడలేరు.
![]() |
ఆదిమాత 'శ్రీవిద్య'. |
ఆదిమాత శ్రీవిద్యా అందరినీ కృపాదృష్టితో చూసి, “ఓ వత్సలారా! మీ అందరి మనసు ఇప్పుడు పూర్తిగా ‘థర్వ’ స్థితికి చేరుకున్నాయి" అని చెప్పడం ప్రారంభించింది.
సాధారణంగా మానవుడు ‘థర్వ’ స్థితిలోకి వెళ్ళేది, అతని షడ్-రిపులు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వలన.
కానీ మీరందరూ ‘థర్వ’ స్థితిలోకి వెళ్ళింది, కేవలం ‘అసతో మా సద్గమయ' ఈ ఒక్క కారణం వల్లనే అంటే పవిత్రమైన ఉనికి, పవిత్రమైన క్రియ యొక్క రహస్యం మరియు కారణం తెలుసుకోవడానికి.
మరియు అది కూడా ఏ విధమైన స్వార్థం కోసం కాదు, కేవలం అంటే కేవలం ఎనిమిదో నవదుర్గ మహాగౌరిని పూర్తిగా తెలుసుకోవడానికి - పూర్తిగా సాత్వికమైన ఉత్సుకత వలన.
ఓ శివ-ఋషి తుంబరు! ఈ రూపాంతరం పూర్తయ్యేంతవరకు నువ్వు ఈ అందరికీ ఈ రూపాంతరం కథను వివరంగా చెప్పు.”
ఆదిమాత శ్రీవిద్యకు సాష్టాంగ ప్రణామం చేసి శివ-ఋషి తుంబరు కథ చెప్పడం ప్రారంభించారు, “ఓ ఆప్తజనులారా! ఈ పార్వతి ఒకసారి ఎప్పుడైతే వసుంధరపై మరియు వసుంధర యొక్క ఆకాశం నుండి ఆ కాలంలో ఉన్న అన్ని అసురీ శక్తులను, అసురీ రూపాలను మరియు అసురీ గుణాలను పూర్తిగా విధ్వంసం చేయాలని నిశ్చయించుకున్నారో, అప్పుడే మొదటిసారి ఆమె ఈ ‘కాలరాత్రి’స్వరూపం ప్రకటమయింది.
పార్వతి ఈ నిశ్చయం కేవలం ఒక్క కారణం కోసం చేశారు - ఆ సమయంలో భగవాన్ పరమశివుడు ఘనప్రాణ గణపతి జన్మ కోసం ఘోర తపస్సులో కూర్చుని ఉన్నారు.
పరమశివుడి ఈ తపస్సు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి అవడం అవసరం ఉండింది. కాని అసురి వృత్తులు దానికి విరోధంగా నిలిచాయి.
అందువల్ల ఈ విశ్వానికి ఘనప్రాణుని జన్మింపజేయు ప్రక్రియకు కేవలం పది వేల సంవత్సరాల కాలమే మిగిలి ఉండటం వలన, ఈ భక్తమాత అలాంటి కఠినమైన సంకల్పం చేసి యుద్ధాన్ని ప్రారంభించింది మరియు ఆమె తన సంకల్పాన్ని మానవ శతాబ్దం (వంద సంవత్సరాలు) లోనే పూర్తి చేసింది.
అలాగే పరమశివుని తపశ్చర్య కేవలం మానవ ఎనిమిది సంవత్సరాలలోనే విజయవంతమై సంపూర్ణమైంది. దాంతో ఆదిమాతకు కావలసిన ఆ క్షణానికే శివగంగాగౌరీపుత్రుడు, వినాయక బ్రహ్మణస్పతి, ‘గణపతి’గా జన్మించడానికి పూర్తి సన్నాహం అయింది.
![]() |
నవదుర్గ. |
పరమశివుడు తపస్సు ముగించి కళ్ళు తెరవగానే ఆయనకు పార్వతి ఈ భయంకరమైన రూపం కనిపించింది. మరియు ‘కేవలం తన కోసమే తన ప్రియ సహధర్మచారిణి తన సౌందర్యాన్ని దూరంగా పారేసి ఈ భయంకరమైన రూపాన్ని ధరించారు’ అని తెలుసుకుని పరమశివుడు ఆమె వైపు ఎంతో ప్రేమతో ఆప్యాయమైన చూపుతో చూశారు.
అలాగే భర్గలోకంలో ప్రవహిస్తున్న గంగా (ఏడవ గంగా) భగవాన్ పరమశివుని రెండు నేత్రముల నుండి ప్రస్రవించగా, పరమశివుడు తన ప్రియ భార్యపై ఆ ఏడవ గంగాజలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు.
స్వయంగా పరమశివుడు ఆ ఏడో గంగ జలం నుండి చుక్క చుక్క జలం తీసుకుని పార్వతి దేహంపై లేపనం చేస్తున్నాడు.
అటువంటి విలక్షణమైన అభిషేకస్నానం మరియు లేపనం మానవ 108 సంవత్సరాలు కొనసాగింది.
మరియు ఆ క్షణాన పార్వతి ఈ ఎనిమిదో నవదుర్గ స్వరూపం ‘మహాగౌరి' ప్రకాశించసాగింది.”
శివ-ఋషి తుంబరుల కథ ముగిసింది. మరియు అదే క్షణాన ఎనిమిదో నవదుర్గ ‘మహాగౌరి’ ఆమె పూర్తి వైభవంతో కనిపించారు.
ఆమె చతుర్భుజ రూపంలో ఉంది. ఆమె కుడి పై చేయి అభయముద్రలో ఉంది, కుడి కింది చేయి త్రిశూలాన్ని ధరించింది, ఎడమ పై చేయిలో సౌమ్యమైన మరియు ప్రశాంతమైన ధ్వని ఉత్పత్తి చేసే డమరువు ఉంది, ఆమె ఎడమ కింది చేయి వరదముద్రలో ఉంది.
![]() |
ఆదిమాత 'మహాగౌరి'. |
ఈ మహాగౌరీ అత్యంత విశిష్టమైన గోరువర్ణం కలిగినది.
ఆమె ధరిస్తున్న అన్ని వస్త్రాలు చంద్రవర్ణం కలిగినవి.
ఆమె శరీరమంతా ముత్యాల అలంకారాలతో అలంకరించబడింది మరియు మెడలో తెల్లటి సువాసన గల పువ్వుల మాలలు ఉన్నాయి.
ఆమె చూపు పూర్తిగా వాత్సల్యంతో నిండినది, సౌమ్యమైనది, ప్రశాంతమైనది మరియు తృప్తిదాయకమైనది.
ఆమె వృషభారూఢ (వృషభంపై ఆలయం) రూపంలో ఉంది.
ఆ వృషభం కూడా పూర్తిగా గోరువర్ణం కలిగినది మరియు అత్యంత శాంతమైన స్వభావం కలిగినది.
ఆమె నుదుటిపై మూడో కన్ను లేదు.
మహాగౌరి కనురెప్పల వెంట్రుకల కదలికల నుండి ఎంతో సుగంధిత మరియు శాంతిని ఇచ్చే శక్తిప్రవాహం అన్ని చోట్లా విస్తరిస్తూ ఉంది.
మరియు వాటి స్పర్శ కలగగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ‘థర్వ’ అయిన మనసు పూర్తిగా ‘అథర్వ’ గా మారిపోతూ ఉంది.
బాపు తరువాత తులసీపత్రం - 1397 అనే అగ్రలేఖలో ఇలా వ్రాశారు,
ఆదిమాత శ్రీవిద్యా బ్రహ్మవాదిని లోపాముద్రకు మహాగౌరి పూజ చేయమని ఆజ్ఞ ఇచ్చారు. మరియు దాని ప్రకారం లోపాముద్ర మిగతా అందరు బ్రహ్మవాదినిలతో కలిసి సుగంధపూలతో మహాగౌరి పూజ చేశారు.
మహాగౌరి, తనకు సమర్పించబడిన అన్ని సుగంధ తెల్లని పూలు తన సొంత దోసిలిలోకి తీసుకుని అక్కడ
ఉన్న అందరిపై వర్షం కురిపించారు.
ఆశ్చర్యం అంటే ప్రతి ఒక్కరికీ ఒకే ఒక్క తెల్లని పువ్వు లభించింది. మరియు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న ఆ తెల్లని పువ్వు ఎనిమిది దళాలు (రేకులు) కలిగి ఉంది.
ఆ తరువాత ఎనిమిదో నవదుర్గ మహాగౌరి వివిధ రంగుల సుగంధపూలతో ఆదిమాత శ్రీవిద్య మరియు అనసూయ పూజ చేశారు.
మరియు మహాగౌరి తన చేతిలో ఉన్న పూలు ఆదిమాత చరణాలపై వేయగానే, ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న ‘ఆ’ తెల్లని పువ్వు ఇప్పుడు మరింత తేజోపుంజ మరియు ఆహ్లదకరంగా కనిపించసాగింది.
మరియు ఆ అష్టదలపుష్పం ప్రతి ఒక్కరి త్రివిధ దేహాలలో శాంతి, ప్రసన్నత, స్థైర్యం, ధైర్యం మరియు ఆహ్లదం ఈ గుణాలను వ్యాపింపజేస్తూ ఉంది.
ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ‘ఆ’ అష్టదలపుష్పం వారి చేతికి శాశ్వతంగా అంటుకుని ఉంది మరియు ‘ఆ’ పువ్వు వారి మొత్తం మనసునే మరింత మరింత అందంగా మరియు బలమైనదిగా చేస్తోంది.
బ్రహ్మవాదిని లోపాముద్ర మహాగౌరి ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉన్నవారి వైపు తిరిగి మాట్లాడసాగారు, “ఓ ప్రత్యక్షమైన ఆప్తజనులారా! ఈ ఎనిమిదో నవదుర్గ మహాగౌరి శాంభవీవిద్య యొక్క పదిహేను మరియు పదహారో మెట్టుకు (కక్ష్యకు) అధిష్ఠాత్రీగాఉంటుంది.
మరియు నవరాత్రుల అష్టమి తిథి పగలు మరియు రాత్రికి నాయికరాలు.
పరమశివుడు భర్గలోకంలోని ఏడో గంగ జలం లేపనం మరియు అభిషేకం చేసి ఈ ‘మహాగౌర’ రూపం నిర్మించారు, ఈ విషయం మనం విన్నాము.
కానీ ఒకవేళ ఏడో గంగ ఉంటే, మిగతా ఆరు గంగలు ఏమిటి? ఈ ప్రశ్న కలగడం సహజం.
కానీ ప్రస్తుతం కేవలం ఇంతే గుర్తు పెట్టుకోవాలి భూలోకంపై అవతరించిన ఆ మొదటి గంగ మరియు ఆ తరువాత ప్రతి లోకంలో ఒక గంగ.
మిగిలిన గంగాజ్ఞానం శాంభవీ విద్య యొక్క పదిహేను మరియు పదహారో కక్ష్యలు దాటిన తర్వాతనే అందుతుంది.
ఈ ఏడవ గంగా, అంటే భర్గలోక గంగా క్షీరసాగరంలోని జలంతోనే తయారయింది. మరియు దీనిని ‘అమృతవాహిని’, ‘అమృతవర్షిణి’ మరియు ‘చంద్రమధుప్రసవిణి’ ఈ పేర్లతో తెలుసుకొంటారు.
మహాగౌరి మరియు భర్గలోకీయ ఏడో గంగ ఈ ఇద్దరూ ఒకరినొకరు కవల సోదరీమణులుగా భావిస్తారు - ఎందుకంటే ఆ ఇద్దరి కార్యం కూడా ఒకటే.
శాంభవీ విద్య యొక్క పదిహేను మరియు పదహారో మెట్లపై ఉపాసకులు, తమ గురువు ముందు కూర్చుని, గురువు యొక్క మార్గదర్శనంలో ‘శ్రీశాంభవీముద్ర’ నేర్చుకోవలసి ఉంటుంది, దానిని ప్రతిరోజు మూడు పూటలా సాధన చేయవలసి ఉంటుంది, దాని అభ్యాసం చేయవలసి ఉంటుంది మరియు దాని గురించి జ్ఞానం సంపాదించుకోవలసి ఉంటుంది.
మరియు ఇదంతా చేయించేది, ఆ ఎనిమిదో నవదుర్గ మహాగౌరి.
చూడండి! మనం మొదటినుండి చూస్తూ ఉన్నాం మహాగౌరికి నుదుటిపైన మూడో కన్ను లేదు. అక్కడ కుంకుమతిలకం ఉంది.
కానీ ఇది సత్యం కాదు.
మహాగౌరికి కూడా మూడో కన్ను ఉంది.
కానీ మనం ఎవరూ దానిని చూడలేము.
మహర్షులు మరియు బ్రహ్మవాదినిలు కూడా చూడలేరు.
దీనికి కారణం ఏమిటి?
ఇదే శ్రీశాంభవీముద్ర యొక్క రహస్యం. ఈ ముద్ర చేసేటప్పుడు ఉపాసకుడు తన గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం సుఖాసనంలో కూర్చోవాలి. రెండు కళ్ళు పూర్తిగా మూసి, ఆ తరువాత ఆ మూసిన కనురెప్పల వెనుక ఉన్న
![]() |
శ్రీశ్వాసమ్ ఉత్సవంలో ఆదిమాత శ్రీవిద్యను దర్శిస్తున్న సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు. |
కళ్ళు తన సొంత ఆజ్ఞాచక్రం యొక్క స్థానంపై అంటే మూడో కన్ను స్థానంపై మెల్లగా కేంద్రీకరించాలి.
ఈ క్రియ ఎంత సమయం చేయాలి, ఎలా చేయాలి, ఆ సమయంలో మంత్రం చెప్పాలా, ఏ మంత్రాలు చెప్పాలి, ఎప్పుడు మనసును శాంతంగా ఉంచుకోవాలి మరియు ఎప్పుడు మనసును ఆ ఆజ్ఞాచక్రంతో కట్టి ఉంచుకోవాలి మరియు ఎలా, ఇదంతా సద్గురువు ప్రతి ఉపాసకుడికి బ్రాహ్మముహూర్తం సమయంలో పవిత్ర నది తీరంపై నేర్పిస్తారు.”
బ్రహ్మవాదిని లోపాముద్ర చేసిన ఈ శ్రీశాంభవీ ముద్ర యొక్క వర్ణన విని మహర్షుల నుండి శివగణాల వరకు అందరూ ఎంతో ఆనందించారు. మరియు ప్రతి ఒక్కరి మనసులో ‘మనకి కూడా ఇది లభించాలి’ అనే కోరిక కలిగింది.
మరియు అలాంటి కోరిక వారి మనసులో కలగగానే బ్రహ్మవాదిని లోపాముద్ర అన్నారు, “ఊరికే వేరే సాహసాలు చేయకండి. నాది లేదా ఎవరిదైనా వర్ణన విని వెంటనే ప్రయత్నం చేయకండి.
ఎందుకంటే ఈ శ్రీశాంభవీముద్ర శ్రీశాంభవీవిద్య యొక్క పదిహేను మరియు పదహారో మెట్టు వద్దనే పొందవచ్చు మరియు చేయవచ్చు.
ఈ శ్రీశాంభవీముద్ర శివ-శక్తి యొక్క ఏకత్వం, ఏకరూపత్వం మరియు నిరంతర సహచర్యాన్ని, అలాగే ‘విభేదం ఉన్నప్పటికీ అభేధం’ అనే అద్భుతమైన స్వరూపాన్ని మరియు దాని వెనుక ఉన్న రహస్యం ప్రదర్శిస్తుంది.
‘ఆదిమాతను మరియు ఆమె ‘ఆదిపిత’ రూపాన్ని తెలుసుకోవడం మరియు వారి యొక్క అయి ఉండడం’ ఇదే ఏకైక ఉద్దేశ్యం మరియు ఇదే ఏకైక లక్ష్యం ఈ క్షేత్రాలపై ఉన్న ఏకైక ధ్యేయం కావాలి.
మరియు ప్రత్యక్ష ఆప్తజనులారా! ఇంత గొప్ప జ్ఞానం ప్రసాదించే ఈ మహాగౌరీ సాధారణ శ్రద్ధావానులకూ, వారి స్థాయికి అనుగుణంగా మరిన్ని మనశాంతి, బలం, చిత్తస్థైర్యం మరియు ఆధ్యాత్మిక పురోగతిని అందిస్తూ ఉంటుంది.”
Comments
Post a Comment