శ్రీ దత్త కరుణాత్రిపది మొదటి పాదం యొక్క అర్థం

శ్రీ దత్త కరుణాత్రిపది మొదటి పాదం యొక్క అర్థం

కరుణాత్రిపదీ” మొదటి పదం యొక్క అర్థం, తల్లి చీతా శాంవి శ్రీ గురుదత్తా ఇప్పుడు ప్రశాంతంగా విశ్రమించండి. ॥ ధ్రు. ॥

హే శ్రీ గురుదత్తా, మీరు ఎప్పుడూ శాంతంగానే ఉంటారు. మీరు కోపంగా ఉండటం అసాధ్యం. కానీ భక్తుల సంక్షేమం కోసం మీరెదైతే కోపం చేశారో దాని వల్ల నాకు భయమవుతోంది. హే గురురాయా, నా మనసులోని భయాన్ని శాంతింపజేయు. భయం, ఆందోళన, అస్థిరత మరియు అభద్రతతో నిండిన నా మనసును శాంతింపజేయు, వీటన్నింటినీ ప్రశాంత పర్చండి.

తూ కేవళ్ మాతాజనితా । సర్వథా తూ హితకర్తా ।

తూ ఆప్తస్వజన భ్రాతా । సర్వథా తూచి త్రాతా ॥

భయకర్తా తూ భయహర్తా । దండధర్తా తూ పరిపాతా ।

తుజవాచుని న దుజీ వార్తా । తూ ఆర్తా ఆశ్రయ దాతా ॥ 1 ॥


హే శ్రీ గురురాయ, నీవు మాత్రమే నాకు తండ్రివి, తల్లివి, అంటే నాకు జన్మనిచ్చి, నన్ను పెంచి పోషించినది నువ్వే. నాకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూర్చేది కూడా నువ్వే. నీవు నా నిజమైన మిత్రుడివి, నీవు నా జీవిత భాగస్వామివి, నీవు నా సోదరుడివి. నువ్వే నా అంతిమ రక్షకుడివి.

మా సంక్షేమం కోసం, కొన్నిసందర్భాలలో భయాన్ని సృష్టించేది నువ్వే, మాకు భయాన్ని చూపించేది నువ్వే, భయాన్ని తొలగించేది కూడా నువ్వే. అందుకే నువ్వు చేతిలో దండం పట్టుకున్నావు, నీవే శిక్ష నుండి రక్షించేది మరియు క్షమించేది.నాకు నీవు తప్ప మరెవరూ లేరు మరియు నాకు నీవు తప్ప మరేమీ తెలియదు. నాలాంటి దుఃఖితులకు, భాదితులకు సంకటాల్లో ఉన్నవారికి నీవే శరణు. హే శ్రీ గురుదత్తా, నీవు మాత్రమే మాలాంటి ఆత్మలకు ఏకైక ఆశ్రయం.

అపరాధాస్తవ గురునాథా । జరి దండా ధరిసీ యథార్థా ।

తరి ఆమ్హీ గాఉని గాథా । తవ చరణీం నమవూ మాథా ॥

తూ తథాపి దండిసీ దేవా । కోణాచా మగ కరూ ధావా? ।

సోడవితా దుస్రా తేంవ్హా । కోణ దత్తా ఆమ్హా త్రాతా? ॥ 2 ॥


హే శ్రీ గురునాథా! మా నేరాలను, దుష్కర్మలను, పాపాలను శిక్షించడానికి, అంటే మాకు సంక్షేమాన్ని కలిగించడానికి మీరు మీ చేతిలో దండాన్ని పట్టుకున్నారు. అది సరైనదే అయినప్పటికీ, మేము అపరాధులం, నీ నామాన్ని జపిస్తూ, నీ చరిత్రను, నీ లీలలను కీర్తిస్తూ, నీ పాదాలకు నమస్కరిస్తూ నీకు లొంగిపోయాము.


ఈశ్వరుడు మమ్మల్ని శిక్షిస్తే, నీ పిల్లలమైన మేము ఎవరిని వేడుకోవాలి? హే శ్రీ గురుదత్తా! పాపాల నుండి, దుఃఖాల నుండి, చిత్రహింసల నుండి మమ్మల్ని కాపాడగల నీవు తప్ప మాకు ఏ రక్షకుడు ఉన్నారు? ఇంకెవరూ లేరు.

తూ నటసా హోఉని కోపీ । దండితాంహి ఆమ్హీ పాపీ ।

పునరపిహీ చుకత తథాపి । ఆమ్హాంవరి నచ్ సంతాపీ ॥

గచ్ఛతః స్ఖలనం క్వాపి । అసే మానుని నచ హో కోపీ ।

నిజ కృపాలేశా ఓపీ । ఆమ్హాంవరి తూ భగవంతా ॥ 3 ॥



నిజానికి, మీరు మీ పిల్లలపై ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. ఒక నటుడిలా, మీరు మా సంక్షేమం కోసం కోపం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అలాంటి నటుడిలాగే, మీరు కోపాన్ని అణిచివేసి పాపాత్ములమైన మమ్మల్ని శిక్షిస్తారు.

అయినప్పటికీ, మేము అజ్ఞానులం, చేసిన వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూనే ఉంటాము. కాబట్టి, హే శ్రీ గురుదత్తా, మాపై కోపంగా ఉండవద్దని మేము నిన్ను ప్రార్థిస్తున్నాము.


“గచ్ఛతః స్ఖలనం క్వాపి” అంటే రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి కొన్నిసార్లు జారి పడిపోవచ్చు, అదేవిధంగా మనం కూడా చేసే మన పనూల్లో తప్పులు చేయవచ్చు మరియు చేస్తాము కూడా. కాబట్టి మాపై కోపంగా ఉండకండి. హే భగవంతుడా! నీ కృపను మాపై కురిపించు, ఎందుకంటే నీ కృప యొక్క కాంతి కూడా మమ్మల్ని రక్షించగలదు.


తవ పదరీ అసతా తాతా । ఆడమార్గీ పాఊల పడతాం ।

సాంభాళుని మార్గావరతా । ఆణితా న దుజా త్రాతా ।।

నిజ బిరుదా ఆణుని చిత్తా । తూ పతీతపావన దత్తా ।

వళే ఆతా ఆమ్హాంవరతా । కరుణాఘన తూ గురుదత్తా ॥ 4 ॥


భక్తుల తండ్రిగారైన ఓ శ్రీ గురు దత్తాత్రేయా! మీ పాదపద్మములను ఆశ్రయం పొందిన తర్వాత కూడా మా అడుగులు దారి తప్పినా, అంటే మేము తప్పుగా ప్రవర్తించినా, మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని తిరిగి సరైన మార్గంలోకి తీసుకువస్తారు. మీలాంటి రక్షకుడు మరొకరు లేరు.

పతిత పావనుడైన ఓ శ్రీ గురుదత్త, కరుణతో నిండిన మీ ఈ శ్వాసను మా హృదయాలలో ఉంచుకుని, మీ కృపను మాపై సదా కురిపిస్తూ ఉండండి.


సహకుటుంబ సహపరివార । దాస ఆమ్హీ హే ఘరదార ।

తవ పదీం అర్పూ అసార । సంసారాహిత హా భార ।

పరిహారిసీ కరుణాసింధో । తూ దీనానాథ సుబంధో ।

ఆమ్హా అఘలేశ న బాధో । వాసుదేవప్రార్థిత దత్తా ॥ 5 ॥


శ్రీ గురు దత్తాత్రేయా, మా సకుటుంబ, సపరివారమంతా మీ సేవకులం. ఈ నశ్వరమైన మరియు క్షణభంగుకరమైన సంసారం, గృహ వ్యవహారాల పట్ల మనకున్న అనుబంధం, మన కర్మ, మన సమగ్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే భారం, ఇది మాకు హానికరం. మా ఈ భారాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాము.

ఓ గురు రాయా! ఓ కరుణా సముద్రుడా! నువ్వే మాకు ప్రభువువి, మా శ్రేయోభిలాషివి. మా దుఃఖాలు, కష్టాలు, దురదృష్టాలు, అన్యాయాలన్నింటినీ నువ్వు పూర్తిగా తొలగిస్తావు. ఓ దత్తాత్రేయా! వాసుదేవుడైన నేను (పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి) మా పాపాలలో కొద్దిపాటి కూడా మీ సేవకు ఆటంకం కలిగించవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను.

Comments