సద్గురు శ్రీఅనిరుద్ధుల భావవిశ్వం నుండి - పార్వతిమాత నవదుర్గా రూపాల పరిచయం - భాగం 4

సద్గురు శ్రీఅనిరుద్ధుల భావవిశ్వం నుండి - పార్వతిమాత నవదుర్గా రూపాల పరిచయం - భాగం 4

సద్గురు శ్రీఅనిరుద్ధ బాపుగారి దైనిక 'ప్రత్యక్ష'లోని 'తులసీపత్ర' అనే సంపాదకీయ శ్రేణిలోని సంపాదకీయాలు 1386 మరియు 1387

సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు తులసీపత్ర - 1386 అనే సంపాదకీయంలో ఇలా వ్రాశారు,

భగవాన్ హయగ్రీవుడు ఆ నవదంపతులతో సహా మార్కండేయుడి ఆశ్రమం వైపు బయలుదేరగానే, రాజర్షి శశిభూషణుడు అత్యంత వినయంగా లోపముద్రను అడిగారు, “హే జ్యేష్ఠ బ్రహ్మవాదినీ! ఇప్పుడు ఒక నెల వరకు, లేదా ఇంకా ఎక్కువ కాలం గౌతముడు, అహల్య ఇక్కడ ఉండరు.  “అప్పుడు నువ్వు ఇకపై బోధించబోయే విషయాలు వారికి అందుతాయా? అనే ప్రశ్న నన్ను వేధిస్తోంది. నీవు న్యాయవంతురాలివి అని తెలిసి ఈ ప్రశ్న అడుగుతున్నాను.”

లోపముద్ర అత్యంత సున్నితంగా బదులిచ్చారు, “కూతురిని ఆమె భర్తతో పంపిస్తున్న వధువు తండ్రి భావం నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. నీ ఈ వాత్సల్య భావానికి గౌరవం ఇచ్చి చెబుతున్నాను - 1) ఒకటి, ఈ ఇద్దరూ మార్కండేయుడి వద్ద శ్రీ శాంభవీవిద్యలోని తొమ్మిదవ, పదవ మెట్లను వివరంగా, లోతుగా అభ్యసించబోతున్నారు అలాగే ఆ తరువాతవారినీ వారు అక్కడే పొందతగినవే. సరైన సమయంలో వారు ఇక్కడికి తిరిగి వస్తారు. 2) అన్నిటికంటే ముఖ్యమైన విషయం మర్చిపోయావు, అది కూడా నీ వాత్సల్యం వల్లే. అందుకే గుర్తు చేస్తున్నాను - కైలాసంలో ఎల్లప్పుడూ నిత్య సమయమే ఉంటుంది. కాలానికి ఇక్కడ స్థానం లేదు.”

రాజర్షి శశిభూషణుడు ఆనందంతో, భావోద్వేగమైన స్వరంతో లోపముద్రకు కృతజ్ఞతలు చెప్పి, అత్యంత శాంత చిత్తంతో మళ్ళీ ఏకాగ్ర సాధకుడిగా మారి అధ్యయనానికి కూర్చున్నారు.

లోపముద్ర ఇప్పుడు మళ్ళీ మాట్లాడటం ప్రారంభించారు, “తొమ్మిదవ, పదవ మెట్లపై అత్యంత ముఖ్యమైన ‘శ్రీలలితా సహస్రనామం' మీరందరూ కూడా నేర్చుకోవాలి. 

అది కేవలం నోటికి రావడం లేదా దానిని పదే పదే చదవడం నిజమైన సాధన కాదు. 

ఎందుకంటే శ్రీలలితా సహస్రనామంలోని ప్రతి నామం సహస్రార చక్రంలోని ఒకటి లేదా అనేక దళాలను తేజోవంతం చేసి, రసాన్ని అందించే రసవాహిని. 

ఇక్కడ కూర్చున్న ప్రతి బ్రహ్మర్షి, బ్రహ్మవాదిని ఈ పదవికి అప్పుడే చేరుకున్నారు, ఎప్పుడైతే ఈ లలితా సహస్రనామం, వారి సహస్రార చక్రం మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడిందో. అంటే, మానవుడి సహస్రార చక్రంలోని ఒక్కొక్క దళం లలితా సహస్రనామంలోని ఒక్కొక్క నామంతో నిండి, పూర్తిగా పరిపూర్ణమయ్యాకే బ్రహ్మర్షి మరియు బ్రహ్మవాదిని జన్మిస్తారు. 

మరి ఇతరుల సంగతేమిటి? అనే ప్రశ్న మీకు కలగవచ్చు, లేదా కలగాలి కూడా. ఎందుకంటే ప్రశ్న లేకుండా ప్రయత్నం లేదు, ప్రయత్నం లేకుండా సమాధానం లేదు, సమాధానం లేకుండా పురోగతి లేదు. 

మరియు శ్రీ శాంభవీవిద్యలోని తొమ్మిదవ, పదవ మెట్టు అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న అంతర్గత అసురీ ప్రవృత్తితో జరిగే యుద్ధమే. 

ఏ యుద్ధం కూడా లలితా సహస్రనామం లేకుండా విజయం సాధించలేదు. 

లలితా సహస్రనామం మద్దతు, ఆధారం తీసుకుని పోరాడే పక్షం దేవయాన్ పంథాకు చెందినది, దానికి సంపూర్ణ విజయం లభిస్తుంది. 

ఒకవేళ రెండు పక్షాలు లలితా సహస్రనామం ఆధారం చేసుకుని యుద్ధం చేస్తే, స్వయంగా లలితాంబికే ఆ యుద్ధంలో జోక్యం చేసుకుని ఆ రెండు పక్షాల మధ్య సయోధ్య కుదురుస్తుంది. ఎందుకంటే ‘లలితాంబిక' అనే రూపం యుద్ధ కర్త్రియే కాదు, శాంతి కర్త్రి కూడా. అందుకే లలితాంబిక ధనుస్సు ఏ లోహంతో చేయబడలేదు, అది ఎప్పుడూ కొత్తగా ఉండే ఇక్షుదండంతో (చెరకు) తయారవుతుంది, ఆమె బాణాలు కమలాల కాడలు, కమలపువ్వు మొగ్గలతోనే తయారవుతాయి.

నవదుర్గా స్కందమాత ఈ లలితా సహస్రనామం అధ్యయనానికి దిగ్దర్శకురాలు. భగవాన్ హయగ్రీవుడు ఈ సహస్రనామాన్ని ఎల్లప్పుడూ గానం చేస్తుంటారు. 

భగవాన్ స్కందుడి జననం తర్వాత సరిగ్గా ఒక సంవత్సరం తరువాత, ఈ స్కందమాత పార్వతి లలితా సహస్రనామం పఠిస్తూ ధ్యానంలో ఎంత లీనమైపోయిందంటే ఆమెకు ఇతర ప్రపంచ జ్ఞానం కూడా లేదు. 

ఆ ఒక సంవత్సరం పిల్లవాడు స్కందుడు అంటే కుమారుడు ఆడుతూ ఆడుతూ హిమాలయాల మణిశిఖరం (ఎవరెస్ట్) చేరుకుని, అక్కడి నుండి కిందకు దూకాలని చూస్తున్నాడు. 

అప్పుడు ఎల్లప్పుడూ జాగృతంగా ఉండే లలితాంబిక తక్షణమే మణిశిఖరంపైకి వచ్చి, కింద పడుతున్న కుమార కార్తికేయుడి కుడిచేతిని గట్టిగా పట్టుకుంది. 

సరిగ్గా అదే సమయంలో అంతర్గత వాత్సల్యంతో జాగృతమైన స్కందమాత పార్వతి కూడా తన స్థానం నుండి మణిశిఖరం వరకు పరుగెత్తి ఎక్కి, కింద పడుతున్న కుమార కార్తికేయుడి ఎడమ చేతిని పట్టుకుంది.

ఆ ఇద్దరి మనస్సులో ఒకరిపై ఒకరికి అత్యంత కృతజ్ఞత భావం ఉంది. అలాగే భవిష్యత్తులో దేవాసేనాపతి కాబోతున్న కుమార కార్తికేయుడిపై అపారమైన వాత్సల్యం ఉంది. 

స్కందమాత పార్వతి లలితా సహస్రనామం పఠించడం, ఆమె మేల్కొన్న తర్వాత, పరుగెత్తుతూ శిఖరం ఎక్కుతున్నప్పుడు, కార్తికేయుడిని పట్టుకున్న తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. 

దీనివల్ల లలితాంబిక అత్యంత ప్రసన్నమైంది. 

ఇప్పుడు స్కందుడి ఆరు ముఖాలకు ఒకేసారి ఆకలి వేసింది. అది తెలుసుకుని ఆ ఇద్దరికీ ఒకేసారి పాలు ఊరిగాయి. 

స్కంద కార్తికేయుడు ఆ ఇద్దరి చేతులను గట్టిగా పట్టుకునే ఉండి, ఇద్దరి నుండి పాలు తాగుతున్నాడు. 

పూర్తిగా పాలు తాగిన తర్వాత అతని ఆరు ముఖాల నుండి త్రేన్పులు వచ్చాయి - ఆ త్రేన్పులు మామూలువి కాదు, శ్రీలలితా సహస్రనామం యొక్క సహజ, సులభ ఉచ్ఛారణ. 

దీనివల్ల ఆ క్షణానికి లలితాంబిక, స్కందమాత పార్వతి ఏకరూపమయ్యారు. 

మరియు ‘శ్రీయంత్రం' ఎలాగైతే లక్ష్మి, మహాలక్ష్మిల ఏకస్థానమో, ‘శ్రీసూక్తం' ఎలాగైతే లక్ష్మి, మహాలక్ష్మిల ఏక స్తోత్రమో, 

అలాగే ‘శ్రీలలితా సహస్రనామం' పార్వతి, లలితాంబికల ఏక స్తోత్రంగా మారింది, ‘శాంభవీవిద్య' ఇద్దరి ఏకస్థానంగా నిలిచింది.

బాపూ ఇంకా తులసిపత్ర - 1387లో ఇలా వ్రాశారు,

ఈ కథ అంతా వింటూ అక్కడే ఆసీనుడైన భగవాన్ స్కందుడి మనస్సులో ఆ పాత వాత్సల్యపు జ్ఞాపకాలు అత్యంత వేగంగా మేల్కొన్నాయి. అతను తన జన్మనిచ్చిన తల్లి పార్వతి పాదాలపై శిరస్సు ఉంచి లలితా సహస్రనామం పఠించడం ప్రారంభించాడు - దానంతట అదే, సులభంగా; 

సరిగ్గా అదే సమయంలో రాజర్షి శశిభూషణుడి కళ్ళకు పార్వతి ఎప్పటిలాగే 'చంద్రఘంటా' రూపానికి బదులుగా 'స్కందమాత' రూపం కనిపించడం మొదలైంది. 

అంతేకాకుండా, ఆ స్కందమాత ఆకృతి చాలా నెమ్మదిగా విశాలంగా, వ్యాపకంగా అవుతూ పోయింది. ఒక క్షణానికి అతనికి మొత్తం ఆకాశం స్కందమాత రూపంతో నిండినట్లు అనిపించింది. 

దీనితో రాజర్షి శశిభూషణుడు లేచి నిలబడి, సహజ భావంతో ఆకాశవ్యాప్త స్కందమాత పాదాలను స్పర్శించడానికి ఆ పాదాల వైపు వెళ్ళసాగారు.

అతను ఆ పాదాలకు దగ్గరగా వెళ్ళే కొద్దీ, స్కందమాత ఆ రెండు పాదాలు భూమి నుండి పైకి పైకి వెళ్ళడం మొదలుపెట్టాయి. 

ఇప్పుడు ఆ సింహవాహిని స్కందమాత కుడి పాదం భూమి వైపు సహజ స్థితిలో ఉంది. ఆమె తన ఎడమ కాలును వంచి దానిపై బాల స్కందుడిని పట్టుకుంది. అందుకే ఆమె ఎడమ పాదం అడ్డంగా ఉన్నప్పటికీ నిలువుగా ఉంది. 

రాజర్షి శశిభూషణుడు ఆ కుడి పాదం తనకు మరింత దగ్గరగా ఉన్నప్పటికీ, ఆమె ఆ ఎడమ పాదం వైపుకే పూర్తిగా ఆకర్షితుడయ్యాడు.

 ఆ ఎడమ పాదం యొక్క 

నిలువు పాదతలంలో 

అతనికి ఏమి కనిపిస్తోంది? 

రాజర్షి శశిభూషణ్ పూర్తిగా ఉల్లాసంతో ఉప్పొంగిపోయాడు, ఆనందపు ప్రతి మెట్టును ఒక్కొక్కటిగా ఎక్కుతున్నాడు, ఇప్పుడు అతను మెల్లగా స్పష్టమైన స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు, “ఓ స్కందమాతా! ఓ నవదుర్గే! నీ ఈ ఎడమ పాదతలం నాకు బ్రహ్మర్షి, బ్రహ్మవాలందరి తపశ్చర్యలు కనిపిస్తున్నాయి. 

ఆ తపస్సు చేస్తున్న బ్రహ్మర్షిల కళ్ళ ముందు కూడా నాకు మళ్ళీ ఈ నీ ఎడమ పాదం ఇలాగే కనిపిస్తోంది.

"ఆ ప్రతి బ్రహ్మర్షికి నీ పాదతలంలో ఏమి కనిపిస్తోందో నాకు అర్థం కాలేదు — కానీ వారి రెండు కన్నులు నీ ఆ పాదతలవైపే పరవశంగా చూశుకుంటూ విస్తారంగా తెరవబడుతున్నాయని మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తోంది." 

అహాహా! నీ ఎడమ మరియు కుడి చేతుల్లో ఉన్న రెండు కమలపుష్పాలు ఇప్పుడు ఆ బ్రహ్మర్షుల మస్తకాలను తాకుతున్నాయి. 

అహహా! నీ ఆ రెండు చేతుల్లోని కమలపుష్పాలు నిజానికి నీవి మరియు శివుడి సహస్రార చక్రాలు. వాటి స్పర్శ తగలగానే...."

ఇంత చెప్పి రాజర్షి శశిభూషణుడు మరణించినట్లుగా, శ్వాస, హృదయ స్పందన లేనివాడై అంతరిక్షంలో తేలడం ప్రారంభించాడు. 

అతని ధర్మపత్ని పూర్ణాహుతి అత్యంత ప్రేమతో, ఆనందంతో అంతరిక్షంలోకి ఎగిరి తన భర్త శరీరం యొక్క కుడిచేతిని పట్టుకుని నెమ్మదిగా తిరిగి కైలాసానికి దించసాగింది. 

రాజర్షి శశిభూషణుడి పాదాలు కైలాస భూమిని తాకిన ఆ క్షణంలో, అతను మళ్ళీ పూర్తిగా ప్రాణవంతుడు అయ్యాడు. 

అతని మొదటి శ్వాసతోనే అతని సహస్రార చక్ర కమలం పూర్తిగా వికసించి అతని తల నుండి అన్ని దిక్కులవైపు పుష్పంలా విపరిణమిస్తూ వెలువడుతున్నదీ దృశ్యం కనిపించడం మొదలైంది.

ఒకరు బ్రహ్మర్షి అవ్వడం ఈరోజు బ్రహ్మర్షి కాని ఎందరో చూస్తున్నారు. 

జ్యేష్ఠ బ్రహ్మవాదిని లోపముద్ర చెబుతున్నారు, “ఇప్పుడు శశిభూషణుడు ‘బ్రహ్మర్షి' అయ్యాడు. నేను ఇందాక చెప్పిన, బ్రహ్మర్షి జన్మించే పూర్తి ప్రక్రియను మీరందరూ ఇప్పుడు చూశారు.”

‘బ్రహ్మర్షి శశిభూషణ్‌కు జయజయులు’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడున్నవారందరూ ఆనందంగా నృత్యం చేయడం ప్రారంభించారు. 

శివుడు, మహావిష్ణువు, ప్రజాపతి బ్రహ్మ, గణపతి, వీరభద్రుడు, దేవర్షి నారదుడు, శివ-ఋషి తుంబరు కూడా ఇందులో చేరారు. 

బ్రహ్మర్షి శశిభూషణుడి రెండు కళ్ళు తెరుచుకోగానే అతను ఆదిమాత శ్రీవిద్య పాదాలపై సాష్టాంగపడ్డాడు. 

సరిగ్గా అదే క్షణంలో స్కంద కార్తికేయుడి ముఖం నుండి లలితా సహస్రనామంలోని ఒక అద్భుతమైన నామం ఉచ్చరించబడింది, 

‘ఓం కల్పనారహితాయై నమః’. 

ఆ నామం ఉచ్చరించబడిన వెంటనే, బ్రహ్మవాదిని లోపాముద్ర మరియు నవదుర్గరూపిణి స్కందమాత ఇద్దరూ స్కందుని స్వరంతో స్వరం కలిపి, ఆ దివ్య నామాన్ని 108 సార్లు ఉచ్చరించారు.


Comments