సద్గురు శ్రీ అనిరుద్ధుని భావవిశ్వం నుండి - పార్వతీమాత నవదుర్గ రూపాల పరిచయం - భాగం 1

శ్రీగణరాయుడికి, ఈ బుద్ధిదాత అయిన వినాయకుడికి అనంత చతుర్దశి నాడు వీడ్కోలు పలికేటప్పుడు మనసులో ఒక రకమైన విచారం ఆవహిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మన శ్రద్ధకు నవచైతన్యం ఇచ్చే, భక్తి, ఉత్సాహం నింపే కొత్త ప్రయాణం మొదలవుతుంది, అదే ఆశ్విన నవరాత్రి.

ఆశ్విన నవరాత్రి చివరిలో అంటే దసరా రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు, అశుభం నాశనమైంది, అందుకే ఈ నవరాత్రిని సద్గురు శ్రీఅనిరుద్ధులు 'అశుభనాశిని నవరాత్రి' అని అన్నారు.

ఈ నవరాత్రిలో జగదంబ మాత వివిధ రూపాలను పూజిస్తారు. అదే విధంగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తొమ్మిది రోజుల్లో భక్తమాత పార్వతి యొక్క తొమ్మిది రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి రూపాలను భక్తిభావంతో పూజిస్తారు. పార్వతీమాత ఈ రూపాలనే మనం 'నవదుర్గ' అని పిలుస్తాము.

దైనిక ప్రత్యక్ష పత్రికలోని సంపాదకీయాల ద్వారా సద్గురు శ్రీఅనిరుద్ధులు తమ లోతైన అధ్యయనం, చింతనతో ఈ నవదుర్గల మహత్యాన్ని అత్యంత సులభమైన భాషలో వివరించారు; ఈ సంపాదకీయాలు కేవలం సమాచారం ఇచ్చేవి మాత్రమే కాదు; అవి భక్తిని మరింత అర్థవంతం చేసేవి మరియు నవదుర్గల అసలైన పరిచయాన్ని కలిగించేవి.

ఈరోజు నుండి ఇదే సంపాదకీయాల ఆధారంగా బ్లాగ్‌ పోస్టును మీ అందరి కోసం అందుబాటులో ఉంచుతున్నాము. మనందరం ఈ భక్తిభావం, శ్రద్ధల యాత్రలో భాగస్వాములం అవ్వుదాం.

మూలం - సద్గురు శ్రీఅనిరుద్ధ బాపు గారి దైనిక ప్రత్యక్షలోని ‘తులసీపత్ర’ అనే సంపాదకీయాల శ్రేణిలోని సంపాదకీయాలు నం. 1380, 1381.

సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు తులసీపత్ర-1380 సంపాదకీయంలో రాస్తారు,

బ్రహ్మవాదిని లోపముద్ర మూలార్కగణేశుని సత్యయుగం నాటి స్థాపన కథను చెప్పిన తర్వాత పార్వతీమాత వైపు ముగ్ధురాలై చూడసాగింది.

ఆ అన్నపూర్ణ పార్వతి లోపముద్రతో ఇలా అంది, “ఓ బ్రహ్మవాదిని లోపముద్రా! ఈ కథను నీవు ఎంత అందంగా చెప్పావు!

శ్రీశాంభవివిద్య యొక్క మొదటి కక్ష్య గురించి వివరిస్తూ ఈ కథను చెప్పడం ద్వారా నీవు శ్రద్ధావంతులకు ఈ మొదటి మెట్టు ఎక్కడం చాలా సులభం చేశావు.”

శివ- ఋషి తుంబరులు అత్యంత ప్రేమతో భక్తమాత పార్వతిని అడిగారు, “ఓ మాతా! బ్రహ్మవాదిని లోపముద్ర తన బాధ్యతను పూర్తి చేసింది. కానీ ఈ మొదటి మెట్టులోని అనేక విషయాలను నీవు మాత్రమే స్పష్టం చేయగలవు. ఎందుకంటే ‘దక్షకన్య సతీ’ మరియు ‘హిమవాన్‌కన్య పార్వతి’ ఈ నీ రెండు జన్మలలోనూ నీవు ఈ శాంభవివిద్య యొక్క ప్రతి అడుగులోనూ అత్యంత సముచితమైన ప్రయాణం చేస్తూ తపస్సు ఆచరించావు, అదీ మనుష్యజన్మ పొంది సూక్ష్మంలోని పరమశివుని పొందుటకే;

మరియు ఈ నీ తపస్సు వల్లనే నీకు, శివుడికి వివాహ బంధం కుదిరింది, స్కందుడు, గణపతి పుట్టారు.”

దేవర్షి నారదుడు శివ-ఋషి తుంబరుల మాటలకు పూర్తిగా ఆమోదం తెలిపారు మరియు ఇలా అన్నారు, “ఓ భక్తమాత పార్వతీ! నీవు స్వయంగా శివుడి నుండి ఈ శాంభవివిద్యను నీ తపస్సు అనంతరం మళ్ళీ పొందావు, అందువల్ల నీవే స్వయంగా శాంభవివిద్యకు తొలి దీక్షితురాలు, తొలి ఉపాసిక మరియు తొలి క్రియాశీలి.

పరమశివుడు నీకు శాంభవివిద్యలోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని, ప్రతి సూత్రాన్ని సవివరంగా వివరిస్తూ బోధించాడు, అందుకే నేను అందరి తరపున నీకు ప్రార్థిస్తున్నాను, బ్రహ్మవాదిని లోపముద్ర శాంభవివిద్యను వివరిస్తున్నప్పుడు, నీకు కావాల్సినప్పుడు మా అందరి మనోగతాన్ని తెలుసుకొని నీవే స్వయంగా మాట్లాడటం ప్రారంభించు.

ఓ పార్వతీ! నీవు ఆదిమాత యొక్క అద్భుతమైన కుమార్తెవి, నీ ప్రతి క్రియలోనూ ‘శాంభవివిద్య’ అనేదే ఏకైక మార్గం ఉంటుంది మరియు ఈ కారణంగానే ఈ శాంభవివిద్య యొక్క తపస్సులోని నీ తొమ్మిది రూపాలు నవదుర్గలు అని ప్రసిద్ధి చెందాయి. 1) శైలపుత్రి, 2) బ్రహ్మచారిణి, 3) చంద్రఘంట, 4) కూష్మాండ, 5) స్కందమాత, 6) కాత్యాయని, 7) కాలరాత్రి, 8) మహాగౌరి, 9) సిద్ధిదాత్రి.”

ఆ తర్వాత అందరు ఋషిబృందం వైపు తిరిగి దేవర్షి నారదుడు ఇలా అన్నారు, “పార్వతి యొక్క ఈ తొమ్మిది రూపాలను నవరాత్రులలో క్రమంగా ఒకరోజుకు ఒక రూపం చొప్పున పూజిస్తారు.

ఎందుకంటే, ఏ విధంగానైతే ‘శ్రీసూక్తం’ భక్తమాత లక్ష్మి మరియు ఆదిమాత మహాలక్ష్మిల సంయుక్త స్తోత్రమో, అదే విధంగా ‘నవరాత్రిపూజ’ భక్తమాత పార్వతి మరియు ఆదిమాత దుర్గ యొక్క సంయుక్త పూజ.

మరియు ఈ నవదుర్గలలో ‘బ్రహ్మచారిణి’ రూపం శ్రీశాంభవివిద్యకు  ఆచారప్రతీకమే అవుతుంది.

ఆమె తపశ్చర్య ముగిసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె తన భర్త శివుని దగ్గర కేవలం రెండు కోరికలనే వ్యక్తం చేసింది – 1. తన శివునిపై ఉన్న ప్రేమ నిత్యమూ అఖండంగా, అక్షయంగా ఉండాలి. 2.పరమశివుని వలే తాను చేసే ప్రతి కార్యమూ ఆదిమాత సేవకే అంకితం కావాలి

'శ్రీశ్వాసమ్' ఉత్సవంలో ఆదిమాత మహాగౌరిని దర్శిస్తున్న సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు.


“శివుని వద్ద ఈ వరాలు కోరుతున్న సమయంలో పార్వతి, పరమశివుడితోను అలాగే ఆయన ‘ఆదిమాత యొక్క సంతానం’ అనే భావంతోను అంతగా ఏకరూపమై, తానె పూర్తిగా శివమయమైంది. అందువల్లే జన్మతః శ్యామవర్ణంగా ఉన్న ఆ పార్వతి, శుభ్రమైన ధవళవర్ణంతో‘మహాగౌరి’గా, వృషభ వాహనంగా అవతరించింది.

మరియు ఆదిమాత పార్వతి యొక్క ఈ ప్రేమ భావాన్ని అంతే ప్రేమతో స్వీకరించి, పార్వతికి ‘సిద్ధిదాత్రి’ అనే నవదుర్గలలోని తొమ్మిదవ రూపాన్ని, అంటే మహాదుర్గ యొక్క తన సొంత సిద్ధేశ్వరి రూపంలోని సులభ రూపాన్ని ప్రసాదించింది.

మరియు అదే సమయంలో ఆ సిద్ధిదాత్రి పార్వతే ‘శాంభవివిద్య యొక్క మూర్తి’ అని ప్రకటించబడింది.”

దేవర్షి నారదుని ఈ భక్తవత్సల ఉద్గారాలను విని పార్వతి ఆదిమాత అనుమతితో సిద్ధిదాత్రి రూపాన్ని ధరించి మాట్లాడటం ప్రారంభించింది. కానీ శివ-ఋషి తుంబరులు అత్యంత వినయంగా, ప్రేమతో ఆమెను మధ్యలోనే ఆపి మొదట అందరు శ్రద్ధావంతులకు 'నవదుర్గ' రూపాల పరిచయం చేశారు -

 

 
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు తులసీపత్ర-1381 సంపాదకీయంలో రాస్తారు,

పార్వతీదేవి యొక్క ‘నవరూపాలైన నవదుర్గల’ పరిచయం జరుగుతుండగా, కైలాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంతలా ఆనందంతో, ఉత్సాహంతో నిండిపోయారు; అక్కడ ఆనందసముద్రమే వ్యాపించినట్టుగా అనిపించింది.

ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రహ్మవాదిని లోపముద్ర మాట్లాడటం ప్రారంభించింది, “ఓ అత్యుత్తమ ఋషులారా, శ్రద్ధావంతులారా! శాంభవివిద్య యొక్క ఉపాసన మొదటి మెట్టు నుండి పద్దెనిమిదవ మెట్టు వరకు నిర్విఘ్నంగా జరగాలనే ఉద్దేశంతోనేమూలార్కగణేశుని ఉపాసన చెప్పబడింది.

శ్రీ అనిరుద్ధగురుక్షేత్రంలో ఉన్న శ్రీ మూలార్కగణపతి.


ఎందుకంటే శాంభవివిద్య యొక్క ఉపాసన చేసేటప్పుడు ఏ తప్పు కూడా జరగకూడదు, అంటే ఆహారం, విహారం, ఆచారం, ఆలోచనలలో తప్పు జరగకూడదు మరియు శ్రీమూలార్కగణేశుని మంత్ర పఠనం వల్ల ఈ దోషాలు జరగనే జరగవు లేదా కొద్దిగా జరిగినా, వెంటనే లేకుండా పోతాయి.

శ్రీమూలార్కగణేశమంత్రం :-

ఓం గం గణపతే శ్రీమూలార్కగణపతే వరవరద శ్రీఆధారగణేశాయ నమః।

సర్వవిఘ్నాన్ నాశయ సర్వసిద్ధిం కురు కురు స్వాహా॥

శాంభవివిద్య యొక్క మొదటి మెట్టుపై ఆదిమాత మరియు త్రివిక్రముడికి శరణు పొందేటప్పుడు మొదట మూలార్కగణేశుని ఈ మంత్రాన్ని రోజుకు 5 సార్లు అయినా పఠించాలి.” 

ఆమెను మధ్యలోనే ఆపి బ్రహ్మవాదిని కాత్యాయని (బ్రహ్మర్షి యాజ్ఞవల్క్యుని మొదటి భార్య) అత్యంత వినయంగా ప్రశ్నించింది, “ఓ జ్యేష్ఠ భగినీ లోపాముద్రే! మూలార్కగణేశుని ఈ మంత్రాన్ని కేవలం శాంభవివిద్య యొక్క ఉపాసకులు మాత్రమే పఠించాలా? ఇతర శ్రద్ధావంతులు చేయకూడదా?”

సిద్ధిదాత్రి పార్వతి అత్యంత నవ్వుతూ బ్రహ్మవాదిని కాత్యాయని వైపు చూసింది, “ఓ ప్రియమైన కుమార్తె కాత్యాయనీ! నీ భర్తలాగే నీకు కూడా ఎల్లప్పుడూ సాధారణ ప్రజల సంక్షేమం గురించే ఆందోళన ఉంటుంది. అందుకే నేను నీ నుండి ఈ ప్రశ్నను ఊహించాను.

ఓ కాత్యాయనీ! ఈ ములార్కగణపతి మంత్రాన్ని ఏ శ్రద్ధావంతుడైనా జపించవచ్చు. దీనికోసం శాంభవీ విద్య ఉపాసకుడు కావలసిన అవసరం అసలే లేదు. ఎందుకంటే, నిజంగా చూసుకుంటే ప్రతి భక్తుడు చండికాకులంతో జీవనం సాగిస్తూనే శాంభవీ విద్యలో మొదటి, రెండవ మెట్టుపై ఉపాసకుడిగా మారిపోతాడు. అదే కాదు, ఆదిమాతకు అపారమైన భక్తి చూపించే శ్రద్ధావంతుని ఆమె అతని ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి ఏదో ఒక జన్మలో తప్పకుండా శాంభవీ విద్యా ఉపాసన చేయమని ప్రేరేపిస్తుంది, ఆయన చేత ఆ ఉపాసన జరిగేలా చేస్తుంది.

భక్తమాత పార్వతి యొక్క ఈ సమాధానం వల్ల అందరు ఋషికుమారులు మరియు శివగణాలు కూడా అత్యంత ప్రోత్సహితులయ్యారు మరియు తర్వాతి భాగాన్ని మరింత శ్రద్ధగా వినడానికి మరింత ఆతృతగా ఉన్నారు.

లోపముద్ర :- “శ్రీశాంభవీ విద్య యొక్క రెండవ మెట్టు అంటే – ‘మొత్తం విశ్వం ఆదిమాత చండికే నుండే ఉద్భవించింది. కాబట్టి ఈ విశ్వం గురించి ఆమెకు ఉన్నంత జ్ఞానం మరెవరికీ ఉండదు’ అనే విషయాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకుని, ప్రతి కార్యం చేయడం.


మనము సాధారణ దైనందిన పనులు చేస్తూ ఉన్నా, సాధనలో ఉన్నా, ఏదైనా ప్రత్యేకమైన పని చేస్తున్నా లేదా తప్పు జరుగుతున్నా, ఆ క్షణానికే ‘ఆదిమాతకు ఇది తెలుసు’ అని గుర్తు పెట్టుకోవాలి.

ఉదాహరణకు! సాధకుడి మనసులో ఏదైనా మంచి-చెడు ఆలోచన వస్తే, సాధనలో ఏదైనా తప్పు జరిగినా లేదా చేతి నుండి ఏదైనా పెద్ద తప్పు జరిగినా, కూడా శాంభవివిద్య యొక్క సాధకులకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు మరియు భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు.

ఆ శ్రద్ధావంతుడైన సాధకుడు కేవలం అత్యంత స్వేచ్ఛగా తన మనసులోనే  ఆదిమాత మరియు త్రివిక్రముడికి, తనకు ఏమనిపిస్తే అది చెప్పాలి మరియు 5 సార్లు ‘అంబజ్ఞ’ అని చెప్పాలి.”

ఇక్కడ ఉండలేక ఒక ఋషికుమారుడు అత్యంత ఆశ్చర్యంతో మరియు ప్రేమతో ఇలా అన్నాడు, “ఏమిటి! ఇది

ఇంత సులభమా!”

లోపముద్ర అత్యంత వాత్సల్యంతో ఆ ఋషికుమారుడి వైపు చూసింది, “అవును! కానీ ఏ సరళమైన, కపటం లేని భావంతో నీవు ఈ ప్రశ్నను అడిగావో, అలాగే అంతా చెప్పాలి, అంతే.”

అయినా ఆ ఋషికుమారుడికి ఇంకా ఒక ప్రశ్న అడగాలని ఉంది. కానీ ఈసారి అతను సరిగ్గా అనుమతి తీసుకొని ప్రశ్న అడిగాడు, “ఓ బ్రహ్మవాదిని లోపముద్రా! మీ అందరి మాతృస్నేహాన్ని చూసి నేనిప్పుడు ధైర్యంగా ప్రశ్న అడగగలుగుతున్నాను.

నాలో ఇప్పటికీ అనేక దుర్గుణాలు ఉన్నాయి, అనేక రకాల భయాలు, చింతలు నన్ను అప్పుడప్పుడు వేధిస్తాయి. నేను ఇంకా కామక్రోధాది షడ్వికారాల నుండి విముక్తి పొందలేదు.

నిజానికి నేను ఇప్పుడు ‘ఋషికుమారుడు’గా మిగలలేదు, గురుకులాల నియమాల ప్రకారం నేను ‘ఋషి’ అయ్యాను. అందుకే నాకు శాంభవీ విద్య ఉపాసన చేయడం అత్యంత అవసరమని అనిపిస్తోంది, అలాగే చేయాలనే భయమూ కలుగుతోంది.

నాలో ఉన్న ఈ తామసి తమోగుణాలను తొలగించడానికి నేను శాంభవివిద్య యొక్క ఉపాసన చేయవచ్చా?”

బ్రహ్మవాదిని లోపముద్ర ఆ ఋషికుమారుడిని అడిగింది, “ఓ బిడ్డా! నీవు ఏ తపనతో ఈ ప్రశ్నను అడుగుతున్నావో, ఆ తపనే  శాంభవివిద్య యొక్క రెండవ మెట్టుపై అత్యంత అవసరం.

మరియు ఇది గుర్తుంచుకోండి, మీరందరూ మొదటి మెట్టును ఇప్పటికే పట్టుకున్నారు మరియు అందుకే నేను మీకు తర్వాతి మెట్టులను వివరించగలుగుతున్నాను.

ఓ ఇక్కడ ఉన్న శ్రద్ధావంతులారా! శివ-త్రిపురాసుర యుద్ధం కథ శాంభవివిద్య యొక్క కథాస్వరూపమే అవుతుంది మరియు ఆ చరిత్రలో మీలో ప్రతి ఒక్కరూ ఒక భాగం అయ్యారు.”

ఆమె ఈ మాటలు వినగానే ఆ ఋషికుమారుడు అత్యంత వినయంగా ఆమె పాదాలపై తలపెట్టి తర్వాత నిలబడ్డాడు మరియు ఆ సమయంలో అతని ముఖం సూర్యుడి ఉదయపు కిరణాల తేజస్సుతో మెరుస్తోంది.

అతని ముఖాన్ని చూసి అందరు ఋషికుమారులు, శివగణాలు ఆశ్చర్యం వ్యక్తపరచడం ప్రారంభించారు మరియు ఇది చూసి లోపముద్ర అతడిని ప్రశ్నించింది, “నీ ముఖంపై ఈ బాలార్క-కిరణాల తేజస్సు వ్యాపించింది, దాని కారణం నీకు తెలుసా?”

ఆ ఋషికుమారుడు అత్యంత వినయంగా ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు మరియు దానితో బ్రహ్మర్షి కశ్యపుడు లేచి నిలబడ్డాడు, “ఓ జ్యేష్ట బ్రహ్మవాదిని లోపముద్రా! ఈ ఋషికుమారుడి పేరు ‘గౌతముడు’. ఈ నామకరణం నేను చేశాను. ఎందుకంటే అతని స్వభావం మధ్యాహ్నం యొక్క ప్రచండ సూర్యుడిలా ఉంది మరియు అతను తన తపస్సులను కూడా అదే ప్రచండత్వంతో చేశాడు.

కానీ అతను తన విషయంలో కూడా ఎంత కర్తవ్యకఠోరుడు అంటే అతను తన అత్యంత చిన్న తప్పును కూడా క్షమించడు, దాని ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాడు, ‘సూర్యకిరణ’ విజ్ఞానంలో ఈ శ్రేష్ఠ శాస్త్రజ్ఞుడు అయ్యాడు. అతని ఈ ప్రచండ సత్యనిష్ఠ, నీతినిష్ఠ మరియు ధర్మనిష్ఠ స్వభావం వల్లనే నేను అతనికి

‘గౌతముడు’ (గౌ=సూర్యకిరణం) అనే పేరు ఇచ్చాను.

ఓ ప్రియ శిష్యుడా గౌతమా! నీ తపన కూడా ఇదే విధంగా ప్రచండంగా ఉంది మరియు అందుకే నీ ముఖంపై ఈ సూర్య తేజస్సు వ్యాపించింది.”

ఋషి గౌతముడు భక్తమాత పార్వతిని అత్యంత వినయపూర్వకంగా అడిగాడు, “ఓ భక్తమాత సిద్ధిదాత్రీ! నా స్వభావంలోని ఈ ప్రచండత్వం ఎప్పుడు తొలగిపోతుంది?”

పార్వతి నవ్వి సమాధానం ఇచ్చింది, “ఏ సమయంలోనైతే నీ ముందు ఒక శిల నుండి సజీవంగా స్త్రీ ఆకారం పొందుతుందో అప్పుడు.”


 

Comments