సద్గురు శ్రీఅనిరుద్ధులు తులసీపత్ర 695 అగ్రలేఖలో, మానవుని జీవితంలో ఉండే 10 కాలాలను ప్రస్తావించారు.
వాటిలో 9వ కాలం యొక్క వివరణ తులసీపత్ర 702వ అగ్రలేఖల నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలోని అగ్రలేఖల్లో కిరాతరుద్ర - కిరాతకాలం గురించి వివరించేటప్పుడు, సద్గురు శ్రీఅనిరుద్ధులు మూలార్క గణేశుని మరియు నవదుర్గల ప్రాముఖ్యతను వివరించారు.
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు తులసీపత్ర -1377 అగ్రలేఖలో ఇలా వ్రాసారు…
సత్యయుగం యొక్క మొదటి చరణం ముగిసేటప్పుడు, దేవర్షి నారదుడు బ్రహ్మర్షులందతో సభ నిర్వహించి, ‘తర్వాతి చరణం కోసం ఏమి చేయడం అవసరం’ అనే దానిపై లోతైన చర్చ చేశారు. వారి సభలో కొన్ని నిర్ణయాలు జరిగిన తర్వాత, వారందరినీ వెంట తీసుకుని దేవర్షి నారదుడు అత్రిఋషిని కలుసుకున్నారు.
ఆ సమయంలో అత్రిఋషి శాంతంగా *నైమిషారణ్యం* యొక్క నిర్మాణం చేయడంలో నిమగ్నమై ఉన్నారు.
దేవర్షి నారదుడు మరియు బ్రహ్మర్షులందరూ కనిపించగానే, అత్రిఋషి తన ఎప్పటిలాంటి శాంత, స్థిర, గంభీర స్వభావంతో వారందరినీ ఇలా ప్రశ్నించారు, “ప్రియులారా! మీరు అత్యంత ముఖ్యమైన పని కోసం వచ్చారు, ఇది మీ ముఖాలను చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మానవుల సంక్షేమం కోసం అన్ని చోట్లా తిరుగుతూ ఉంటారు, ఇది నాకు తెలుసు. మీలో స్వార్థం యొక్క ఆవగింజ కూడా లేదు, దీని గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల, మానవుల సంక్షేమం గురించి మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే, నేను మీకు అనుమతి ఇస్తున్నాను. కానీ నేను ప్రస్తుతం ఈ పవిత్రమైన నైమిషారణ్యం యొక్క నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాను. ఈ స్థలాన్ని శంబలా నగరంతో అనుసంధానించడంలో కూడా నేను వ్యగ్రంగా ఉన్నాను. ఈ కారణంగా, నేను ఎవరి ప్రశ్నలకూ నోటితో లేదా వ్రాసి సమాధానం ఇవ్వబోను అని సంకల్పం చేసుకున్నాను.
అందువల్ల ప్రియులారా! నేను మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు నన్ను ఎప్పుడైనా ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. అయితే, నేను వాటికి సమాధానాలను నా కార్యాచరణ ద్వారానే ఇస్తాను”.
అత్రిఋషి ఈ మాటలు వినగానే, దేవర్షి నారదుడు మరియు బ్రహ్మర్షులందరూ, తమ ప్రశ్నలు ఈ ఆదిపిత అయిన భగవాన్ అత్రికి ముందే అర్థమయ్యాయని గ్రహించారు. ఎందుకంటే వారందరికీ ఒకే ప్రశ్న కలిగింది - ‘ఈ కల్పంలో సత్యయుగం యొక్క మొదటి చరణం ముగిసేటప్పటికే మానవుడు కార్యరూపంలో ఇంత బలహీనంగా ఉన్నాడు, మరి త్రేతాయుగం మరియు ద్వాపరయుగంలో ఏమి జరుగుతుంది?' ‘మరి దీని కోసం మేము ఏమి చేయాలి?'
వారందరూ భగవాన్ అత్రి ఆశ్రమంలోనే ఉండటం ప్రారంభించారు. ఆదిమాత అనసూయ మాత్రం అక్కడ లేరు.
ఆమె అత్రిఋషి యొక్క గురుకులాన్ని చూసుకుంటూ, ఋషి భార్యలందరికీ రకరకాల విషయాలు, పద్ధతులను వివరిస్తున్నారు, ఆ ఆశ్రమం నైమిషారణ్యం నుండి చాలా దూరంలో ఉంది.
సాయంత్రం వరకు అత్రిఋషి కేవలం సమిధలను సేకరిస్తూనే తిరుగుతున్నారు. ఆయన *ప్రతి సమిధను* చాలా జాగ్రత్తగా పరీక్షించి ఎంచుకుంటున్నారు. బ్రహ్మర్షులందరూ అత్రిఋషిని పదే పదే ఇలా విన్నవించుకున్నారు, “ఓ భగవాన్! ఈ పని మేము చేస్తాము”. కానీ భగవాన్ అత్రి తల ఊపి మాత్రమే తిరస్కరించారు.
సూర్యాస్తమయం అయిన తరువాత, అత్రిఋషి అందరితో పాటు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత భోజనం చేసి, అత్రిఋషి **స్వయంగా** సమిధలను వేర్వేరుగా విభజించడం ప్రారంభించారు - వృక్షం ప్రకారం, పొడవు ప్రకారం, తడి ప్రకారం, మరియు వాసన ప్రకారం.
ఈ విధంగా అన్ని సమిధలను బాగా వర్గీకరించి, ఆయన వేర్వేరు సమిధల కట్టలను వేర్వేరు పాత్రలలో ఉంచారు.
వారందరికీ ఇప్పుడు అత్రిఋషి విశ్రాంతి తీసుకుంటారని అనిపించింది. కానీ వెంటనే అత్రిఋషి పలాశ వృక్షం యొక్క ఆకులను తీసుకుని, వాటితో పత్రావళి (ఆకులతో చేసిన విస్తరి) మరియు ద్రోణాలను (దోనలు) తయారు చేయడం ప్రారంభించారు.
ఈసారి కూడా వారందరి విన్నపాలను తిరస్కరించి, అత్రిఋషి స్వయంగా ఒంటరిగా పత్రావళి మరియు ద్రోణాలను తయారు చేయడం ప్రారంభించారు. అత్యంత జాగ్రత్తగా ఆయన ఆకులను ఎంచుకుంటున్నారు. అత్యంత అందమైన అంచులను కలిగిన పత్రావళి మరియు ద్రోణాలను తయారు చేస్తున్నారు.
![]() |
దేవర్షి నారదుడు బ్రహ్మర్షులందరికీ కళ్ళతోనే సైగ చేశారు - ‘చూడండి! ఏ ఒక్క ఆకులో కూడా చిన్న రంధ్రం కూడా లేదు, లేదా ఏ ఒక్క ఆకు కూడా కొంచెం కూడా తెగలేదు'.
పత్రావళి మరియు ద్రోణాలను తయారు చేయడం పూర్తవగానే, ఆ వస్తువులన్నింటినీ అత్రిఋషి ఒక ఖాళీ గూడులో ఉంచి, ఆ బ్రహ్మర్షులతో ఇలా అన్నారు, “నాకు సహాయం చేయాలని మీ మనస్సులో ఉంది కదా! అయితే రేపు ఈ తాజా పలాశ ఆకుల పత్రావళి, ద్రోణాలను ఎండలో ఆరబెట్టే పని చేయండి”. అంత చెప్పి భగవాన్ అత్రిఋషి ఆయన ధ్యానం కోసం ధ్యానకుటిలోకి వెళ్ళారు.
రెండో రోజు బ్రహ్మర్షులందరూ ఎప్పటిలాగే బ్రాహ్మముహూర్తంలో లేచి, తమ తమ సాధనలను పూర్తి చేసి, సూర్యోదయం నుండి తమ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి బ్రహ్మర్షి అత్యంత తన్మయత్వంతో తమ పనిని చేస్తున్నారు. సూర్యాస్తమయం వరకు ఆ పత్రావళి మరియు ద్రోణాలు అన్నీ బాగా ఆరిపోయి, పొడిగా అయ్యాయి.
సూర్యాస్తమయానికి అత్రిఋషి ఆశ్రమానికి తిరిగి రాగానే, బ్రహ్మర్షులందరూ చిన్నపిల్లల ఆనందంతో ఆ పత్రావళి, ద్రోణాలు ఎలా బాగా ఆరిపోయాయో అత్రిఋషికి చూపించారు.
అత్రిఋషి వారి శ్రమను మెచ్చుకున్నారు, ఆపై ఇలా అడిగారు, “వీటిలో మధ్యాహ్నం వరకు ఆరిన పత్రావళి, ద్రోణాలు ఏవి? మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆరినవి ఏవి? మరియు సూర్యాస్తమయం వరకు ఆరడానికి సమయం పట్టినవి ఏవి?”.
ఇప్పుడు బ్రహ్మర్షులందరూ తికమకపడ్డారు. వారు అలాంటి పరిశీలన చేయలేదు. ఆధ్యాత్మిక అధికారాన్ని ఉపయోగించి దీనిని భగవాన్ అత్రి ముందు తెలుసుకోవడం తప్పు అవుతుంది.
దీనివల్ల బ్రహ్మర్షులందరూ సిగ్గుపడి తమ తప్పును అంగీకరించారు.
దానిపై అత్రిఋషి ఇలా అడిగారు, “కానీ ఇది ఎలా జరిగింది? మీకు ఈ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత బాగా తెలుసు కదా”.
ఎవరి దగ్గరా దీనికి సమాధానం లేదు.
మనసులో సిగ్గుపడిన ఆ బ్రహ్మర్షులందరి వైపు చాలా సౌజన్యంగా చూస్తూ అత్రిఋషి ఇలా అన్నారు, “పిల్లలారా! *అపరాధ భావనను వదిలివేయండి*.
ఎందుకంటే మన తప్పు వల్ల అపరాధ భావన ఏర్పడితే, క్రమంగా చింతిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ చింత మనసును నిరంతరం వేధిస్తూ ఉంటే, అది విషాదంగా మారుతుంది లేదా న్యూనతా భావంగా మారుతుంది, ఇది మరింత తప్పు.
ఈ రోజు మీరే పలాశ వృక్షం యొక్క ఆకులను సేకరించండి, మీరే పత్రావళి మరియు ద్రోణాలను తయారు చేయండి, రేపు మీరే వాటిని ఎండబెట్టడానికి పెట్టండి. అప్పుడు *పరిశీలించడం* మర్చిపోవద్దు.
నేను నా ధ్యానం కోసం అంతఃకుటీలోకి వెళుతున్నాను. రేపు సూర్యాస్తమయం సమయానికే నేను బయటకు వస్తాను. ఆ సమయానికి అన్ని పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండండి”.
బ్రహ్మర్షులందరూ చాలా ఆలోచనాపూర్వకంగా, ఉత్సాహంగా తమ పనిలో నిమగ్నమయ్యారు. వారు అత్రిఋషి ఆదేశాల ప్రకారం అన్ని పనులను చాలా కచ్చితత్వంతో పూర్తి చేసి, మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు వాటిని చక్కగా అమర్చారు.
ఒంటరిగా దేవర్షి నారదుడు మాత్రం ఏ పని చేయలేదు. ఆయన కేవలం ఆ బ్రహ్మర్షి *ప్రతి ఒక్కరితో* కలిసి తిరుగుతున్నారు.
అత్రిఋషి చెప్పిన సమయానికే తన ధ్యానకుటి నుండి బయటకు వచ్చారు. వారు ఆ బ్రహ్మర్షులందరినీ ప్రశ్నార్థకమైన చూపుతో చూశారు. వెంటనే ప్రతి బ్రహ్మర్షి ముందుకు వచ్చి తమ పనిని చూపించారు.
ప్రతి ఒక్కరి పని చాలా శుభ్రంగా జరిగింది. ఆరిపోయే ఆకులను కూడా వారు చక్కగా వర్గీకరించగలిగారు.
కానీ, ఇప్పటికీ అత్రిఋషి ముఖంలో ఎటువంటి సంతృప్తి కనిపించలేదు. ఇప్పుడు ఆయనను ప్రశ్నలు అడగడానికి ఏ బ్రహ్మర్షికీ ధైర్యం కలగలేదు. ఎందుకంటే మిగతా బ్రహ్మర్షులందరూ **సృష్టి** అయితే, భగవాన్ అత్రి స్వయంభూ - ఆదిశక్తి యొక్క పురుషరూపం.
అత్రిఋషి: “ఓ మిత్రులారా! దేవర్షి నారదుడు మాత్రమే సర్వోత్తమమైన పనిని చేశారు. మీ అందరి పని వంద మార్కులకు వంద మాత్రమే అయ్యింది, కానీ 108 మార్కులకు కాదు”.
ఇప్పుడు బ్రహ్మర్షులందరూ మరింత గందరగోళంలో పడిపోయారు. ‘దేవర్షి నారదుడు ఒక్క పలాశ ఆకును కూడా సేకరించలేదు, ఒక్క ద్రోణాన్ని లేదా పత్రావళిని కూడా తయారు చేయలేదు. అయితే ఇది ఎలా సాధ్యం?' ఈ ఆలోచన వారి ప్రతి ఒక్కరి మనస్సులో వస్తోంది.
కానీ వారికి ఒక విషయంపై పూర్తి నమ్మకం ఉంది, భగవాన్ అత్రి ఎప్పుడూ అబద్ధం చెప్పరు, పక్షపాతం చూపరు, లేదా తమను పరీక్షించడానికి వాస్తవాన్ని మార్చి చూపించరు.
అప్పుడే బ్రహ్మర్షులందరూ, తమ ముఖ్య ఋషి శిష్యులు ఆశ్రమం వెలుపల ఉన్నారని గ్రహించారు - వారిలో కొంతమంది మహర్షులు, కొంతమంది తపస్వి ఋషులు, కొంతమంది కొత్త ఋషులు మరియు కొంతమంది ఋషికూమారులు కూడా ఉన్నారు.
ఇప్పుడు అత్రిఋషి వారందరికీ, అదే పనిని మరో రెండు రోజులు వారి వారి శిష్యులచే చేయించమని ఆదేశించి, ఇలా అన్నారు, “ఈసారి మీరు మీ ప్రతి శిష్యుడికి అతని పనిని బట్టి మార్కులు ఇవ్వాలి, నేను మీకు ఇస్తాను”.
![]() |
బ్రహ్మర్షులందరూ తమ తమ శిష్యులకు అత్రిఋషి యొక్క ఆదేశాన్ని వివరించారు. వారు స్వయంగా ప్రతి శిష్యుడి పనిని నిశితంగా *పరిశీలించడం* ప్రారంభించారు.
రెండు రోజుల తరువాత, అత్రిఋషి మళ్ళీ అదే సమయానికి బయటకు వచ్చారు. వెంటనే ప్రతి బ్రహ్మర్షి తన శిష్యుడి పనిని అత్రిఋషికి చూపించి, ప్రతి ఒక్కరికీ వందకి వచ్చిన మార్కులను కూడా చెప్పారు.
దీని తరువాత భగవాన్ అత్రి బ్రహ్మర్షుల శిష్యులందరినీ వారి వారి నివాస స్థానాలకు వెళ్ళమని చెప్పారు.
ఆ మహర్షులు, ఋషులు అక్కడి నుండి వెళ్ళిపోగానే, బ్రహ్మర్షులందరూ **అత్యంత బాలభావంతో**, ఎంతో ఆసక్తిగా, **జిజ్ఞాసగా** అత్రిఋషి వైపు చూశారు.
అత్రిఋషి వారందరికీ ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి, ఇలా చెప్పడం ప్రారంభించారు, “ప్రియమైన ఆప్తజనులారా! మీ ‘మహర్షి’ శిష్యులకు కూడా వందకి వంద మార్కులు కూడా రాలేదు. దీనికి కారణం ఏమిటి?”
బ్రహ్మర్షులందరూ చాలా ఆలోచించారు. కానీ వారికి సమాధానం దొరకలేదు. సమాధానం కనుగొనడానికి వారి దగ్గర ఉన్న సిద్ధులను అత్రి ఆశ్రమంలో ఉపయోగించలేరు. అందువల్ల వారందరూ **అత్యంత వినయంగా** *నమస్కరించి* భగవాన్ అత్రికి ఇలా చెప్పారు, “మాకు దీని వెనుక ఉన్న కారణం తెలియడం లేదు.
మాకు కూడా 100కి 108 మార్కులు రాలేదు, మా శిష్యులకు అయితే 100 మార్కులు కూడా రాలేదు. **మా బుద్ధి మొద్దుబారిపోయింది**.
ఓ దేవర్షి నారదా! నీకు మాత్రమే 100కి 108 మార్కులు వచ్చాయి. దయచేసి మా ప్రశ్నలకు నీవైనా సమాధానం ఇవ్వు”.
దేవర్షి నారదుడు స్పష్టమైన మాటల్లో ఇలా చెప్పారు, “భగవాన్ అత్రి మాటను ఉల్లంఘించడం నాకు కూడా సాధ్యం కాదు. భగవాన్ అత్రి యొక్క కరుణ, అనుగ్రహంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల, ఏమి చేయాలో ఆయనే చేస్తారు”.భగవాన్ అత్రి తక్షణమే ఆదిమాత అనసూయను స్మరించారు. క్షణంలో అత్రిఋషి పక్కన ఆదిమాత అనసూయ ప్రత్యక్షమయ్యారు.
ఆ వాత్సల్యమూర్తి అయిన ఆదిమాతను చూడగానే, బ్రహ్మర్షులందరూ ఏడ్చారు. ఆమె ఆదిమాత కదా!.
ఆమె హృదయం కరిగిపోయింది, ఆమె వెంటనే శ్రీవిద్యాపుత్ర త్రివిక్రముడిని అక్కడికి పిలిచారు.
బాపు తరువాత తులసీపత్ర-1379లో ఇలా వ్రాస్తారు,
ఆదిమాత అనసూయ ఆదేశం ప్రకారం భగవాన్ త్రివిక్రముడు ఆ ఆశ్రమంలోకి వచ్చి ఆ బ్రహ్మర్షులందరితో మాట్లాడటం ప్రారంభించారు, “ఓ మిత్రులారా! మీరందరూ బ్రహ్మర్షులు, నాకు చాలా సన్నిహితులైనవారు. మీ ప్రతి ఒక్కరి సామర్థ్యం, కార్యసామర్థ్యం, జ్ఞానం అపారమైనవి.
కానీ ఈ క్షణంలో మీరందరూ ‘మనం ఎక్కడో వెనుకబడ్డాము' అనే భావనలో చిక్కుకున్నారు.
భగవాన్ అత్రిని మీరు అడగడానికి వచ్చిన ప్రశ్న - ‘ఈ కల్పంలో సత్యయుగం యొక్క మొదటి చరణం తర్వాతే మానవ సమాజం అశక్తమై, బలహీనంగా మారుతోంది, మరి ముందు ఎలా అవుతుంది?' ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే భగవాన్ అత్రి ఈ లీల అంతా జరిపారు.
మీరే కాదు, నేను, జ్యేష్ఠ భ్రాత హనుమంత మరియు శ్రీదత్తాత్రేయుడు కూడా అత్రి-అనసూయల ముందు బాలభావంలోనే ఉంటాము.
మరియు మీరు సరిగ్గా ఈ విషయాన్నే మర్చిపోతున్నారు. అందువల్ల, మీకు తక్కువ మార్కులు రావడం వల్ల సిగ్గుపడుతున్నారు. అలా అవ్వడానికి ఎటువంటి కారణం లేదు. ఎందుకంటే బ్రహ్మర్షి అగస్త్య వేరు, అత్రి-అనసూయల ముందు నిలబడిన బాలభావంలోని అగస్త్య వేరు.
చూడండి! ఇక్కడ జరిగిన అన్ని చర్యలను బాగా చూడండి. మీరు చేసిన మొదటి తప్పు ఏమిటంటే - మీరు అత్రిఋషి ఆదేశాన్ని పాటించి పత్రావళి మరియు ద్రోణాలను తయారు చేశారు. కానీ స్వయంగా భగవాన్ అత్రి ద్రోణాలను తయారు చేస్తున్నప్పుడు, మీరు *ఆయన చర్యలను* సరిగా *పరిశీలించలేదు*. అందువల్ల అత్రిఋషి స్వయంగా తయారు చేసిన వస్తువులను ఎలా వర్గీకరించారో మీ దృష్టికి రాలేదు.
సరిగ్గా ఇదే తప్పు ఈ కల్పంలోని సత్యయుగం మానవుడు కూడా చేస్తున్నాడు. అతడు జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు, పని కూడా చేస్తున్నాడు. కానీ ఈ కల్పంలోని ఈ మానవుడు *పరిశీలనా శక్తిని* ఉపయోగించడంలో వెనుకబడి ఉన్నాడు. మరియు ఇదే భగవాన్ అత్రి మీకు చూపించారు.
మీ ప్రశ్నకు సగం సమాధానం దొరికింది కదా?”
![]() |
సంతోషపడి బ్రహ్మర్షులందరూ వెంటనే ‘సాధు సాధు’ అని అంటూ భగవాన్ త్రివిక్రముడి మాటలకు అంగీకారం తెలిపారు.
ఇప్పుడు భగవాన్ త్రివిక్రముడు ఇంకా చెప్పడం ప్రారంభించారు, “ప్రియమైన బ్రహ్మర్షిగణులారా! ఇప్పుడు ప్రశ్న యొక్క సమాధానం యొక్క రెండవ సగం గురించి.
మీరు చేసిన తప్పు, ఈ మహర్షులందరూ కూడా చేశారు.
ఎందుకంటే మీరందరూ మహర్షులు, ఋషులకు గురువులు-ఉపాధ్యాయులు. మీకు వచ్చిన అనుభవాన్ని మీరు మీ శిష్యులకు ఆదేశించేటప్పుడు వారి ముందు నిజాయితీగా ఉంచలేదు.
ఉపాధ్యాయుడు స్వయంగా తన విద్యార్థి దశలో చేసిన తప్పుల నుండి క్రమంగా అభివృద్ధి చెందుతాడు. అతడు అదే అనుభవాలను తన విద్యార్థులకు చెప్పి, వారి అభివృద్ధిని సులభం చేయాలి.
అది కూడా ఇక్కడ జరగలేదు. అందువల్ల మీ ఈ మంచి విద్యార్థులకు కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి.
ఈ భూమిపై ఈ కల్పంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. మీరు మీ శిష్యులను అంటే మహర్షులను, ఋషులను తయారు చేయడంలో ఎక్కడా తప్పు చేయలేదు. వారు కూడా వివిధ ఉపాధ్యాయులను చక్కగా తయారు చేస్తున్నారు.
కానీ ఈ ఋషులు కాని ఉపాధ్యాయులు మాత్రం, తమ తప్పుల నుండి ఏమి నేర్చుకున్నారో, అది తమ విద్యార్థుల ముందు ఉంచడం లేదు. మరియు ముఖ్యంగా, *పరిశీలన*, పరిశీలన తర్వాత *ఆచరణ* అనే క్రమం విద్యార్థులకు అందడం లేదు. దానివల్ల ఈ కల్పంలో మానవుడి కార్యసామర్థ్యం చాలా త్వరగా తగ్గిపోతోంది”.
భావోద్వేగానికి లోనైన బ్రహ్మర్షులందరూ మొదట అత్రి-అనసూయల పాదాలను పట్టుకున్నారు, ఆ తర్వాత త్రివిక్రముడికి కూడా నమస్కరించారు.
కానీ బ్రహ్మర్షి యాజ్ఞవల్క్యుడు ఏదో గుర్తు చేసుకుని ఆలోచనలో పడిపోయినట్లు అయ్యారు. ఇది తెలుసుకున్న త్రివిక్రముడు ఆయనను నేరుగా ఇలా ప్రశ్నించారు, “ఓ బ్రహ్మర్షి యాజ్ఞవల్క్య! మీరు అయితే ఉత్తమ ఉపాధ్యాయులు. మీరు ఎందుకు ఆలోచనలో పడిపోయారు? మీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉందా? మీరు నన్ను ఏ ప్రశ్న అయినా అడగవచ్చు”.
బ్రహ్మర్షి యాజ్ఞవల్క్యుడు ఇలా అన్నారు, “ఓ త్రివిక్రమా! కానీ మా ప్రశ్నకు ఒక మినహాయింపు ఉంది. బ్రహ్మర్షి ధౌమ్య ఆశ్రమంలో మాత్రం అంతా సవ్యంగా జరుగుతోంది. దానికి కారణం కూడా తెలియడం లేదు. అక్కడ అందరూ చక్కగా పరిశీలన చేసి, చాలా అద్భుతంగా పని చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి?”
![]() |
భగవాన్ త్రివిక్రముడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, “ఆదిమాత ఏ ప్రశ్న ఏర్పడక ముందే, దాని సమాధానాన్ని సిద్ధం చేసి ఉంటుంది.
బ్రహ్మర్షి ధౌమ్య 100 సంవత్సరాలు దేశాటనకు వెళ్లినప్పుడు, అతని ఆశ్రమం బాధ్యతను అతని పెద్ద కుమారుడు మహర్షి మందార, అతని భార్య రాజయోగినీ శమీ చూసుకున్నారు.
మీకు కలిగిన ప్రశ్న వారికి 99 సంవత్సరాల క్రితమే కలిగింది, దాని కోసం వారు చాలా పరిశోధనలు చేశారు. కానీ వారికి సమాధానం దొరకలేదు. అదే సమయంలో రాక్షసుల గురుకులంలో వారి రాక్షస పనులు క్రమశిక్షణతో సరిగ్గా జరుగుతున్నాయని వీరికి తెలిసింది.
ఈ ఇద్దరూ ఆదిమాత చరణాలలో తమ తపస్సు మరియు పవిత్రతను భద్రంగా ఉంచి, *దేవర్షి నారదుడితో* కలిసి తామ్రతామస అరణ్యానికి వెళ్ళారు. వారికి కొద్ది రోజుల్లోనే జ్ఞానార్జన మరియు పనిలోని పరిశీలనా శక్తి యొక్క ప్రాముఖ్యత, మరియు ఉపాధ్యాయులు తమ గత జీవితంలోని తప్పులను విద్యార్థుల ముందు కథల రూపంలో ఉంచడం యొక్క ప్రాముఖ్యత తెలిసివచ్చింది. వారు వెంటనే వారి ఆశ్రమానికి తిరిగి వచ్చారు.
ఆదిమాత నుండి వారికి వారి పవిత్రత, తపస్సు తిరిగి రాగానే, వారు పరిశీలనా శక్తిని మరియు తప్పులను *కథల రూపంలో* విద్యార్థుల ముందు ఉంచడం యొక్క అభ్యాసం ప్రారంభించారు. ఒకరోజు అలా ధ్యానం చేస్తూ వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు, ఆ ధ్యానంలో వారికి తామ్రతామసంలోని పాఠశాలలు కనిపించాయి. వారు తెలియకుండానే రాక్షసులను అనుకరించారని గ్రహించారు - మంచి కోసం అయినప్పటికీ, రాక్షసుల అనుకరణ చెడ్డదే.
అందువల్ల ఆ ఇద్దరూ ప్రాయశ్చిత్తంగా తమ సాధనలు, ఉపాసనలు, తపశ్చర్యలు మరియు పవిత్రతను దేవర్షి నారదుడికి దానంగా ఇచ్చారు.
వారి ఈ సాత్విక ఆచరణకు ఆదిమాత చాలా సంతోషించారు, ఆమె వారికి వరం కోరుకోమని చెప్పారు. ఆ ఇద్దరూ నన్నే ఆరాధ్య దైవంగా భావిస్తున్నందున, వారు ఇద్దరూ నా వద్దనే మార్గం అడిగారు, నా దగ్గరే వారి కోసం ఆదిమాత నుండి వరం కోరమని అడిగారు.
మరియు నన్ను ఇబ్బందుల్లో పెట్టారు. నేను వారికి సరైన వరం కోరే బుద్ధిని ఇవ్వగానే, ఆ ఇద్దరూ ఆదిమాతను ఇలా అడిగారు, “ఓ ఆదిమాతా! రాక్షసుల అనుకరణను విడిచిపెట్టి, సరైన పరిశీలనా శక్తి మరియు సరైన బోధనా మార్గం యొక్క మూలస్థానం ఎక్కడి నుండి వస్తుంది, దాన్ని ఎలా పొందాలి, ఇది మాకు చెబుతారా? మాకు ఈ వరమే కావాలి.
అంతేకాదు, రాక్షసుల భూమిలో కూడా పవిత్రమైన భక్తులు బాగా పరిశీలించి పని చేయగలగడానికి మూలస్థానం కూడా మాకు చెప్పండి”.
దానితో ఆదిమాత ఆ ఇద్దరికీ ‘తథాస్తు’ అని వరం ఇచ్చి, వారికి మార్గదర్శనం చేయమని నాకు చెప్పారు. నేను వారిద్దరినీ ఈ నైమిషారణ్యానికే తీసుకువచ్చి, వారికి అత్యున్నత ధ్యానం నేర్పించాను. ఆ ధ్యానం ద్వారా వారికి బుద్ధికి అతీతమైన జ్ఞానాన్ని, రాక్షస శక్తులకు అతీతమైన సత్త్వం యొక్క మూలస్రోతస్సు చూపించాను.
ఆ మూలస్రోతస్సు అంటే ప్రతి ఒక్కరి మూలాధార చక్రానికి స్వామి అయిన భగవాన్ శ్రీమూలార్క గణపతి.
తమ సొంత మూలాధార చక్రంలో మరియు అదే సమయంలో భూమి యొక్క మూలాధార చక్రంలో శ్రీమూలార్క గణపతిని చూస్తున్నప్పుడు, ఆ ఇద్దరి యొక్క సంపూర్ణంగా సమర్పితం అవ్వాలనే కోరిక అత్యంత బలంగా పెరిగింది, అది శిఖరాన్ని చేరుకుంది.
మరియు వారి ఈ అత్యున్నత, సర్వోత్తమమైన కోరిక ఆదిమాతకు చాలా నచ్చింది, శ్రీగణపతికి అత్యంత ప్రియమైనదిగా మారింది. అప్పుడు మహర్షి మందార నుండి ఒక వృక్షం ఉద్భవించింది, రాజయోగినీ శమీ నుండి ఒక సున్నితమైన మొక్క పుట్టింది.
![]() |
మరియు దానితో ఆదిమాత ఒక వరం ఇచ్చారు, ఎవరైతే శ్రీగణపతి యొక్క ఏ విగ్రహానికైనా పూజ, ముఖ్యంగా మూలార్క గణపతికి మందార వృక్షం కింద మరియు శమీ ఆకులతో పూజ చేస్తారో, వారికి ఈ బుద్ధికి అతీతమైన పరిశీలనా శక్తి మరియు రాక్షస పరిస్థితుల్లో కూడా ఆపదల నుండి విముక్తి పొందే శక్తి అంటే దైవీ **ప్రజ్ఞ** (దైవీ ప్రతిభ) లభిస్తుంది.
ఈ విధంగా, ఈ నైమిశారణ్యంలో విశ్వంలో తొలి మందార వృక్షం మరియు తొలి శమీ వనస్పతి ఉద్భవించాయి.
ఒక నిమిషంలో (కనురెప్పపాటు కాలం) మందార వృక్షం వర్థిల్లినందువల్ల, నేను దానిని ‘నిమిషవృక్షం’ అని పేరు పెట్టాను. ఇటీవల జరిగిన త్రిపురాసుర యుద్ధం సమయంలో శివపుత్రుల బాణాలను నేను స్వయంగా, శమీ రసంలో ముంచిన మందార వృక్షం యొక్క సమిధల నుండి తయారు చేయించాను.
అందువల్ల శివపుత్రుల ఈటెలు మరియు బాణాలు తామ్రతామస అరణ్యం యొక్క భూమిలో పాతుకుపోగానే, అక్కడ చోటు చేసుకున్న ప్రతి ప్రదేశంలో మందార వృక్షం మరియు శమీ మొక్కలు పుట్టుకొచ్చాయి - భక్తులను రక్షించడానికి”.
ఈ కథ విన్న బ్రహ్మర్షులందరూ చాలా ఆనందంగా ధౌమ్యఋషిని అభినందించడం ప్రారంభించారు.
అప్పుడే వారందరికీ తమ ముందు మందార మరియు శమీ ఉన్నాయని తెలిసింది. బ్రహ్మర్షులందరూ చాలా ప్రేమతో, వాత్సల్యంతో, ఆదరంతో మందార వృక్షాన్ని కౌగిలించుకున్నారు.
అదే సమయంలో త్రివిక్రముడు ఆ బ్రహ్మర్షులందరి యొక్క, సాధారణ భక్తుల పట్ల ఉన్న కరుణను **నీటి రూపంలో** ఆ మందార వృక్షం యొక్క వేళ్ళకు అర్పించారు. ఆ మందార వృక్షపు వేరుల నుండి భగవాన్ త్రివిక్రముని చేతిలో ఈ విశ్వంలోని **మూలార్క గణేశుని ఆది స్వయంభూ విగ్రహం** ప్రత్యక్షమైంది.
బ్రహ్మవాదినీ లోపాముద్ర కైలాసంలో ఉన్న అందరికీ ఇంకా చెప్పడం ప్రారంభించారు, “అదే ఆ క్షణం! భగవాన్ త్రివిక్రముడు నైమిశారణ్యంలో అత్రి ఋషి ఆశ్రమం ముందు స్వయంభూ మూలార్క గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.
ఎందుకు?
మూలార్క గణేశుని మంత్రపఠనం వలన, భగవంతుడు ప్రసాదించిన ప్రజ్ఞ (బుద్ధి) మనిషి యొక్క సామాన్య బుద్ధి మరియు మనసుపై ఆధిపత్యం చెలాయిస్తుంది. దాంతో భక్తుడు అన్ని ఆపదలు నుండి, తప్పుల నుండి విముక్తి పొందుతాడు.
Comments
Post a Comment