జీవితం గురించి మాట్లాడేటప్పుడు చిన్న, పెద్ద సమస్యలు సహజమే, కష్టాలు కూడా వాటితో పాటు వస్తాయి! కానీ ప్రతి భక్తుడి విశ్వాసం ప్రకారం సద్గురు అనిరుద్ధుని అభయహస్తం ఎక్కడైతే ఉంటుందో, అక్కడి ఆ కష్టాలు సులభంగా తొలగిపోతాయి. సద్గురు అనిరుద్ధ బాపు దయవల్ల, నేను మరియు నా కుటుంబం క్షణక్షణం అనేక క్లిష్ట పరిస్థితుల నుండి సునాయసంగా మరియు సురక్షితంగా బయటపడ్డాము.
నా తర్వాతి అనుభవం నా చదువు మరియు నర్సింగ్ ప్రవేశ ప్రక్రియకు సంబంధించింది. 2019లో, నేను నా 12వ తరగతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలయ్యాను. నేను నా ఫలితాలను తీసుకుని సుచిత్ దాదాను కలవడానికి దత్తనివాస్‌లోని శ్రీదత్త క్లినిక్‌కు వెళ్ళాను. నేను శ్రీ గురుక్షేత్రంలో మహిషాసురమర్దిని పెద్దమ్మను దర్శనం చేసుకున్నాను మరియు దాదా అనుమతితో 'నర్సింగ్'లో ప్రవేశం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాదా నాకు మార్గనిర్దేశం చేస్తూ, నర్సింగ్ కోసం 100% ప్రయత్నించు. బాపు దయతో, నీవు ఖచ్చితంగా విజయం సాధిస్తావు" అని అన్నారు.
ఒక నెలలోనే, బి.ఎం.సి. సంస్థ నర్సింగ్లో ప్రవేశానికి పత్రాలను విడుదల చేసింది. నేను ముంబైలోని సాయన్ ఆసుపత్రిలో ఫారమ్‌ను నింపాను. జాబితా విడుదలైనప్పుడు, నా పేరు వెయిటింగ్ లిస్ట్ లో 64వ స్థానంలో ఉంది. నేను నిరంతరం బాపుని స్మరించుకుంటూ, త్రివిక్రమ్ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను. కేవలం రెండు రోజుల్లోనే, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పటికి, నా ర్యాంక్ 44కి తగ్గింది. బాపు ఖచ్చితంగా నాకు నర్సింగ్‌లో అడ్మిషన్ ఇప్పిస్తాడని నాకు నమ్మకం ఉంది.
ఆ తర్వాత, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు కూడా నర్సింగ్ కోసం ఫారాలను స్వీకరించడం ప్రారంభించాయి. నేను రెండు ఆసుపత్రులకుగాను ఫారాలను నింపాను మరియు ఒక వారంలోనే, ఒక ఆసుపత్రిలో నాకు రెండవ ర్యాంక్ మరొకదానిలో మొదటి ర్యాంక్ వచ్చాయి. నేను వెంటనే అప్పటికక్కడే 'జై జగదంబ జై దుర్గే' అంటూ బాపుకి 'అంబజ్ఞ' అని చెప్పుకున్నాను.
ముందుగా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మకు ఈ శుభవార్త చెప్పాను. రెండు రోజుల తరువాత, ఇంటర్వ్యూ సజావుగా జరిగింది. తరువాత ఏమి జరుగుతుందో అని నేను కొంచెం ఆందోళన చెందాను. అయినప్పటికీ, బాపు నాకు సరైనది చేస్తాడని నేను నమ్మాను కాబట్టి నాకు ఏలాంటి చింత కలగలేదు. నాలో త్రివిక్రమ మంత్ర జపం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి వచ్చాను మరియు కొన్ని
రోజుల్లోనే, నా ఎంపికను నిర్ధారిస్తూ ఒక లేఖ వచ్చింది. నేను వెంటనే ఆ లేఖను తీసుకుని శ్రీ అనిరుద్ధ గురుక్షేత్రానికి వెళ్ళి, మొదట పెద్దమ్మ మహిషాసురమర్దిని దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత నేను సుచిత్ దాదాను కలవడానికి వెళ్ళాను. నాకు నర్సింగ్ లో అడ్మిషన్ వచ్చిందని విన్న సుచిత్ దాదా కూడా చాలా సంతోషించారు. ఈ అనుభవాన్ని ఈ రోజు రాస్తున్నప్పుడు, నేను నర్సింగ్ లో మూడవ సంవత్సరంలో ఉన్నాను. పెద్దమ్మ మరియు బాపు ఆశీస్సులు, సుచిత్ దాదా చూపిన సరైన మార్గదర్శకత్వం కారణంగా నా చదువు సజావుగా సాగుతోంది. ఇకముందు కూడా దాదా మార్గదర్శకత్వంతో నా విద్య యొక్క తదుపరి దశను కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను.
ఇప్పుడు నా రెండవ అనుభవం. నా ఈ చిన్న అనుభవం లాక్‌డౌన్ కాలం నాటిది. గణేష్ ఉత్సవాల సందర్భంగా నాకు కొన్ని రోజులు సెలవులు వచ్చాయి. సెలవులు కావడం వల్ల, నేను కొన్ని బట్టలు ఇస్త్రీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఇస్త్రీ చేయడం ప్రారంభించి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు, నాకు అకస్మాత్తుగా భయంకరమైన విద్యుత్ షాక్ తగిలింది. మా ఇంట్లో ఎలక్ట్రిక్ బోర్డు పక్కనే ఒక ఇనుప బీరువా మరియు బాపు ఆశీర్వాద ఫోటో ఉన్నాయి. నేను పూర్తిగా స్విచ్ పట్టుకొని అలా ఉండి పోయాను. మా అమ్మ వెంటనే నా పైకి ఒక చెక్క స్టూల్ విసిరింది. అదే సమయంలో, ఎవరో నన్ను బలంగా నెట్టినట్లు కూడా నాకు అనిపించింది. ఆ క్షణంలోనే నేను పూర్తిగా నెట్టబడి పడిపోయాను. షాక్ భయంకరంగా ఉండింది, కానీ నాకు ఏమీ జరగలేదు, నేను పూర్తిగా బాగున్నాను.
ఆ చెక్క స్టూల్ ని విసిరే ఆలోచన బాపు నా తల్లికి కలిగించాడని మరియు నన్ను నెట్టివేయబడిన చేయి కూడా బాపుదే అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ బాపు ఆశీర్వదిస్తున్న ఫోటో ఉండింది! బాపు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ప్రమాదం నుండి కాపాడారు.
“హరి ఓం” “శ్రీరామ్” “అంబజ్ఞ్య” “నాథసంవిద్”
No comments:
Post a Comment