సప్తమాతృక పూజ (Saptamatruka Pujan)

గురువారము, తేది 24 అక్టోబర్ 2013 న పరమపూజ్య బాపూజీ చాలా ముఖ్యమైన అంశంపైన మాట్లాడినారు.   ప్రతిఒక అమ్మ-నాన్నలకు కోరిక ఉంటుంది తమ బిడ్డ జీవితం ఆరోగ్యకరంగా మరియు ధీర్గాయుశ్శులుగా ఉండాలని.  ఈ దృక్పథం నుండి సంప్రదాయం ప్రకారం, ఇంటిలో బిడ్డ జన్మించిన తర్వాత షష్ఠి పూజ చేస్తారు.  కానీ కాలం మారే కొద్ది ఇందులో తప్పుడు అర్థాలు చేరాయి మరియు ఈ పూజకు ప్రాముఖ్యత కేవలం అచారాలుకే పరిమితం చేయబడింది.  ఈ పూజ ఉద్దేశ్యం, దాని ప్రాముఖ్యత మరియు పూజ వ్యవస్థ గురించి బాపూజీ తమ ప్రవచనము ద్వారా మార్గదర్శనము చేసినారు.

పరమపూజ్య బాపూజీ అన్నారు, ’బ్రహ్మఋషిలలో మొట్టమొదటగా తల్లి అయిన లోపాముద్ర (ఋషి అగస్త్య భార్య) మరియు అరుంధతి (ఋషి వసిష్ఠ భార్య) ఇద్దరికి ఒకే సమయంలో ప్రసూతి అయింది.   అగస్త్య- లోపాముద్ర మరియు వసిష్ఠ – అరుంధతి, వీరు నలుగురు తమ తమ బిడ్డ కోసం చేసిన మొదట పూజను ’సప్తషష్ఠి పూజ’ అని సంభోదించినారు.

మాతృవాత్సల్యవిందానమ్ లో మనము చదువుతాము, శుంభ నిశుంభ అనే రాక్షసులతో పోరాడుతున్నప్పుడు మహాసరస్వతికి సహాయం చేయడానికి దేవతలందరు తమ తమ శక్తులను పంపుతారు.  ఆ ఏడు శక్రులనే సప్తమాతృకలు మరియు వారి సేనాపతి కాలి.  ఆ సప్త మాతృకల పేర్లు క్రింద ఇవ్వబడినది.

మాహేశ్వరీ – ఎవరికి అయితే పంచముఖము, చేతిలో త్రిశూలము మరియు ఎద్దు పైన కూర్చున్నారో ఆమె.

వైష్ణవి – ఎవరైతే చేతిలో చక్రము, గదా మరియు పధ్మము తీసుకొని గరుడపైన కూర్చున్నారో ఆమె.

బ్రహ్మణీ – ఎవరికి అయితే నాలుగు ముఖములు మరియు హంస పైన కూర్చున్నవారు.  ఆమె చేతిలో కమండలు మరియు అక్షమాల ధరించినవారు.

ఐంద్రి – ఈమె ఇంద్ర శక్తి మరియు ఐరావతము పైన కూర్చున్నవారు.  ఈమె చేతిలో వజ్రం యుంటుంది.

కౌమారి – ఈమె ఆరు ముఖముల కలది మరియు నెమలి పైన కూర్చున్న ఆమె.

నారసింహి – ఎవరి తల సింహంలా ఉన్నదో.  ఆమె చేతిలో గదా మరియు ఖడ్గం ఉన్న ఆమె.

వారాహి- ఎవరి తల వరహంలా ఉండి మరియు ఎవరైతే తెల్లని గేదె పైన కూర్చున్నారో.  ఆమె చేతిలో చక్రం, ఖడ్గం, కత్తి మరియు డాల్ ధరించిన ఆమె.

ఈ సప్తమాతృకుల పూజనే ’సప్తషష్ఠి పూజ’ అంటారు.  బాపూజీ పుట్టిన తర్వాత వారి ఇంటిలో ఈ పూజ అసలైన పాత పద్ధతి ప్రకారం జరిగింది.   పూజలో ఉపయోగించిన సప్తమాతృకల చిత్రాలను బాపూజీ 24 అక్టోబర్, 2013 న  ప్రవచనం సమయంలో అందరికి చూపించారు.  ఆ పూజ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ బాపూజీ ఇంకా ఇలా అన్నారు, “శుంభ మరియు నిశుంభ మరణం తర్వాత శుంభని పుత్రుడు దుర్గం అందులో నుండి తప్పించుకున్నాడు.  అతనికి ఒక కాకి రూపం ఇవ్వబడింది అందువలన అతను రక్షింపబడలేదు, నిజానికి అతనిని చూసి ఈ సప్త సేనాపతులకు మాతృభావము జాగృతమైంది. వారి మాతృత్వం భావన వలననే శతృవుల కుమారుడికి కూడా జీవనదానము ఇచ్చారు.  వీరి యొక్క ఈ కృత్యంకు మహాసరస్వతి ప్రసన్నమై వారికి ఆశీర్వాదం ఇచ్చారు ఏమని అంటే, ఏ మానవులు అయితే వారికి బిడ్డ పుట్టిన తర్వాత వీరిని (అనగా ఈ సప్త మాతృకలను) పూజ చేస్తే, మీరు ఆ శిశువుకి  రక్షకులగా అవ్వండి.  అందువల్ల ప్రతి ఇంటిలో శిశువు జన్మించిన తర్వాత ఈ ఏడు మాతృకలకు పూజ చేయు ఆచరణ మొదలైంది.  ఆ తరువాత ఈ పూజను ఎలా చేయాలి అని బాపూజీ విపులముగా వివరించారు.

పూజ తయారి:

1. ఒక పీఠ తీసుకొండి.  దాని క్రింద ’స్వస్తిక’ లేదా ’శ్రీ’ అని ముగ్గుపిండితో వేయవలెను ఎందుకంటే ఇది మంగళపు గుర్తు.  పూజ తయారీ పీఠ పైననే చేయవలెను, చౌరంగ్ లేదా టేబల్ పైన చేయరాదు ఎందుకంటే పెద్దమ్మ సమక్షంలో మనమందరం ఆమె పిల్లలమే.  శిశువు మొదటి అడుగు పీఠంత ఎత్తే ఎత్తగలగుతాడు అందువలన పూజ తయారిలో  పీఠనే  వాడండి.
2.  పీఠ పైన షాల్/ పీతాంబర్/దుప్పటి వేయవలెను.  పీఠకు ముందు ముగ్గులతో అలంకరించవచ్చును

3.  ఒక ప్లేట్ (తాంబూల పళ్ళెము)లో అంచువరకు గోదుమలు పోయవలయును.

4.  దానికి మధ్యలో ఒకటి, చుట్టుపక్కల ఆరు పాకుచెక్కలు ఉంచవలెను.                   

5.  ప్లేట్ కి రెండు వైపుల రెండు కొబ్బరికాయలు ఉంచవలెను.  మరియు కొబ్బరికాయకి పసుపు కుంకుమ పెట్టవలయును.

6. రెండు కొబ్బరికాయలకి లోపల వైపు ప్లేట్ కి దగ్గర ఎరుపు అక్షింతలు కుప్పగా ఉంచవలెను.  ఈ అక్షింతలు కుప్ప దేవతల వైధ్యులు అయిన అశ్విని కుమారుల భార్యలు.  వీరు కవల పిల్లలు మరియు వారి పేర్లు జరా మరియు జీవంతికా. వీరిద్దరు కూడ అశ్విని కూమారులు లాగ ఒకరు లేకుండ ఒకరు ఉండరు మరియు వీరిద్దరు చిన్న బిడ్దతో కూడా ఆడుతూవుంటారు, బిడ్దను పోషిస్తారు, ఒక అవగాహన ఉంది.  బిడ్ద మూడు నెలలు వరకు ఎప్పుడెప్పుడు నవ్వుతాడో అప్పుడు ఆ నవ్వు బిడ్డ ద్వారా ఈ ఇద్దరికి ఇచ్చిన ప్రతిస్పందన.

అ)    జరా అనగా ముసలి తనం ఇచ్చేది.  బిడ్డకు చాలా చాలా వృద్ధత్వం వచ్చే అంత వరకు జీవించ వలెను అని అశీర్వాదం ఇస్తుంది.

బ)   జివంతికా అనగా శిశువు జీవితపు చివరి వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆశీర్వాదము ఇచ్చేది.

7. పీఠపై నాలుగు మూలల నాలుగు తమలపాకులు మరియు వక్క వుంచండి.  పూజలో తమలపాకు ఉంచడం అనగా దేవునిని అహ్వానించుట.  తమలపాకు-వక్క తో అహ్వానించడం ఏ మంత్రము లేకుండా చేసిన అహ్వానం. ఇది సాక్షాత్ ఆదిమాత యొక్క కాత్యాయణి స్వరూపం చెప్పారు.  తమలపాకు ఉంచడం వలన భగవంతునికి అహ్వానం చేరుతుంది ఎందుకంటే ఇది కాత్యాయణి యొక్క సంకల్పము.

8.  ప్లేట్ కి వెనుక భాగంలో ప్లేట్ కి ఆనించి సప్తమాతృక ఫోటో ఉంచండి.

పూజ పద్దతి:

1.    ఈ పూజ సూర్యోదయం నుండి సూర్యస్తము లోపే చేయాలి.  అమావాస్య రోజున కూడ చేయవచ్చు. 

2.    బిడ్డ పుట్టిన తర్వాత మొదటి పూజ బిడ్డ తండ్రియే చేయాలి.  పూజ చేస్తున్నగా తండ్రి కొంత సమయానికైనా సరే బిడ్డను తనవడిలో కూర్చుని పెట్టుకోవాలి.  బిడ్డ పుట్టిన మూడు రోజుల తర్వాత ఎప్పుడైన ఈ పూజ చేయవచ్చును.

3.    పూజ ప్రారంభంలో, మొదట 'వక్రతుండా మహాకాయ ...... ..'ఈ శ్లోకం చెప్పండి.

4.    ఆ తర్వాత గురుక్షేత్రం మంత్రము చెప్పాలి అనంతరం సద్గురు నామం తప్పకుండా జపించవలెను.

5.    తమలపాకు వక్క పైన పసుపు, కుంకుమ, అక్షింతలు మరియు బొట్టు పెట్టవలెను.  కుంకుమ తడిపి పెట్టవలెను.  పిదప ప్లేట్ లో ఉంచిన వక్కల పైన పసుపు, కుంకుమ, అక్షింతలు మరియు బొట్టు పెట్టవలెను.

6.    ఆ తర్వాత మాతృవాత్సల్యవిందానమ్ లో నుండి ’నవమంత్రమాల స్తోత్రం’ పఠించుచూ పూజ చేయాలి.  ఈ స్తాత్రం ఒక సారి చదివినా సరిపోతుంది.

7. రెండు కొబ్బరికాయలకి లోపల)    స్తోత్రం పఠించుచూ గంధాక్షతల పై సువాసన పువ్వులు అర్పించవలెను.  సువాస పువ్వులు లేకున్నా నడుస్తుంది.  పువ్వులు వక్కలపైన, సప్తమాతృకల ఫోటో పైన అలాగే జరా జీవంతిక యొక్క ప్రతీకమైన అక్షింతల రాసుల పైన అర్పించవలెను.  స్తోత్ర పఠనం చేస్తున్నప్పుడు మొదటి ఆవర్తనలోనే పువ్వులు అర్పణచేయవలెను.

8.    ఆ తర్వాత దీపం మరియు అగర ఒత్తులు వెలిగించవలెను.

9.    ఆ తర్వాత భోగ్ కి ఏడు ప్లేట్లు తీసుకొనవలెను అందులో పూరణ్-వరన (ఉడికిన పప్పు)  యొక్క భోగ్ అర్పణ చేయండి.  దానితో కూడ బెల్లం-కొబ్బరి (సగం కొబ్బరి) యొక్క భోగ్ అర్పణ చేయండి.

1.    భోగ్ అర్పణ చేసిన తర్వాత అందుబాటులో ఉన్నచో కమల పువ్వులు అర్పణ చేయండి ఎందుకంటే కమల పువ్వు భగవంతునికి ఇష్టమైన పుష్పము కాబట్టి.

బాపూజీ అన్నారు, “బిడ్డ పుట్టిన తర్వాత మొదటి పూజ బిడ్డ తండ్రియే చేయాలి.  పూజ సమయంలో తల్లి కొంత సమయమైన కూర్చొని పూజోపచారం చేయాలి.   అయితే ముఖ్యమైన పూజ తండ్రియే చేయాలి.  కొన్ని కారణాల వలన బిడ్ద తండ్రి పూజ సమయంలో అందుబాటులో లేనట్లయితే బిడ్డకు తాత (నాన్నకు తండ్రి లేదా అమ్మకు తండ్రి) ఈ పూజ చేయవచ్చును.  వారు కూడా అందుబాటులో లేరని అనుకుందాం,  అప్పుడు దగ్గర బంధువులలో ఏ దగ్గర బంధువు కూడా పూజ చేయవచ్చును.  పిల్లలు పెరిగిన తరువాత  తల్లి ఈ పూజ తన పెద్ద బిడ్డ గురించి చేయవచ్చును.  ఈ పూజకు వయసు పరిమితం లేదు.  మీరు మీ పిల్లలకు ఎన్ని సార్లు అయినా ఈ పూజ చేయవచ్చును.  వారు పుట్టిన రోజున, మీ పిల్లలకు  అనారోగ్యం నయమైన తర్వాత, లేదా ఏ ఇతర రోజు అయిన చేయవచ్చును.  అప్పుడు ఈ పూజ తల్లిదండ్రులు వేరు వేరుగా లేదా కలసి చేయవచ్చును.  మీరు ఒకసారి ఈ విధంగా పూజ చేసితే మళ్ళీ మళ్ళీ  చేయాలి అని కూడా లేదు.  పిల్లలు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేక పూజ చేయుట మంచిది.  ఏ కారణంగా అయినా సమయం ఉండకపోతే,  అందరి కొరకు ఒకే పూజ చేసినా పరవాలేదు.

పూజ తరువాత, అలంకరణలు కనీసం 3 గంటల వరకు ఉంచాలి ఆ తర్వాత ఎప్పుడైనా అలంకరణను తీసేవేయవచ్చు.  అందులోని పువ్వులు మరియు పాకు చెక్కలు విసర్జన చేయాలి.   గోధుమలు ఇంటిలోనే ప్రసాదంగా ఉపయోగించవచ్చు.  వీలైతే, ఒక పిడికెడు గోధుమలు ఆవుకు తినిపించితే మంచిది.  భోగ్ ఎప్పటిలాగే, ఇంటిలోని వారందరు ప్రసాదంలా గ్రహించాలి.  సప్తమాతృకల ఫోటో విసర్జన చేయకూడదు.  ఆ ఫోటోని ఇంట్లో ఏ సురక్షిత స్థలంలో  ఉంచండి.  ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో లేదా ఇంటి గుడిలోనూ ఉంచవచ్చు.  భవిష్యత్తులో, కొత్త శిశువు ఇంట్లో జన్మించినప్పుడు, కొత్త చిత్రాన్ని తీసుకొని వచ్చిపూజ చేయవలెను.”

ధనలక్ష్మి పూజ రోజు, శుక్రవారం, తేదీ నవంబర్ 1, 2013 న సప్తమాతృకల ఫోటో శ్రద్ధావంతులందరికి శ్రీ హరి గురు గ్రామంలో అందుబాటులో ఉంటుంది.  అలాగే ఈ పూజ కొరకు ’నవమంత్రమాల’ స్తోత్రం సంస్కృత, మరాఠి మరియు హిందీ నకలు ఈ పోస్ట్ లో జోడించబడింది. బాపూజీ తెలిపిన ప్రకారం పూజ చేయు సమయం ఈ స్తోత్రం సంస్కృత, మరాఠి లేదా హిందీ ఈ మూడు భాషలలో ఏ భాషలో అయినా చదవవచ్చు. 

|| హరి ఓం ||
అథ నవమంత్రమాలస్తోత్రం
(పదచ్చేద్)
యా మాయా మధుకైటభ-ప్రమథనీ యా మహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణ-చండముండ-మథనీ యా రక్తబీజాశనీ |
శక్తి: శుంభనిశుంభ-దైత్య-దలినీ యా సిద్ధిలక్ష్మీః పరా
సా చండి న-కోటి-మూర్తి-సహితా మాం పాతు విశ్వేశ్వరీ ||

స్తుతా సురైః పూర్వం-అభీష్ట్-సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా |
కరోతు సా నః సుభహెతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః ||

యా సాంప్రతం చోద్ధత్-దైత్య-తాపితైః అస్మాభిరీశా చ సురైర్-నమస్యతే |
కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహన్తు చాపదః ||

యా చ స్మృతా తత్క్షణమేవ హన్తి నః సర్వాపదో భక్తి-వినమ్ర-మూర్తిభిః |
కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహన్తు చాపదః ||

సర్వబాధప్రశమనం త్రిలోక్యస్య అఖిలేశ్వరి |
ఎవమేవ త్వయా కార్యం అస్మద్-వైరి-వునాశనమ్ ||

సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||

సృష్టి-స్థితి-వినాశానాం శక్తిబూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే ||

శరణాగత-దీనార్త-పరిత్రాణ-పరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నరాయణి నమోఽస్తు తే ||

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి-సమన్వితే |
భయేభ్యస్-త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ||

నాకు విశ్వాసం ఉంది ప్రతిఒక శ్రద్ధావంతులు తమ ఇంటిలో ఈ పూజ ఖచ్చితంగా చేస్తారు అని.

|| హరిఓం || శ్రీరామ ||| అంబజ్ఞ ||

|| నాథసంవిధ్ ||

Comments